Axis Bank Digital Merchant Loan | చిరు వ్యాపారులకు యాక్సిస్ బ్యాంక్ ఆఫర్.. సెక్యూరిటీ లేకుండానే రూ.20 లక్షల వరకు లోన్..
Axis Bank Digital Merchant Loan | దేశంలోని సూక్ష్మ, చిన్న తరహా వ్యాపారులు, చిరు వ్యాపారులకు యాక్సిస్ బ్యాంక్ అద్భుతమైన ఆఫర్‌ను అందిస్తోంది. ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే రూ.20 లక్షల వరకు లోన్‌ను అందిస్తోంది. డిజిటల్ మర్చంట్ క్యాష్ అడ్వాన్స్ లోన్స్ పేరిట యాక్సిస్ బ్యాంక్ ఓ ప్రత్యేక లోన్ స్కీమ్‌ను ప్రారంభించింది.
Axis Bank Digital Merchant Loan | దేశంలోని సూక్ష్మ, చిన్న తరహా వ్యాపారులు, చిరు వ్యాపారులకు యాక్సిస్ బ్యాంక్ అద్భుతమైన ఆఫర్‌ను అందిస్తోంది. ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే రూ.20 లక్షల వరకు లోన్‌ను అందిస్తోంది. డిజిటల్ మర్చంట్ క్యాష్ అడ్వాన్స్ లోన్స్ పేరిట యాక్సిస్ బ్యాంక్ ఓ ప్రత్యేక లోన్ స్కీమ్‌ను ప్రారంభించింది. ఈ స్కీమ్ లో భాగంగా చిరు వ్యాపారులు లేదా సూక్ష్మ, చిన్న తరహా వ్యాపారులు ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే కనిష్టంగా రూ.2 లక్షల నుంచి గరిష్టంగా రూ.20 లక్షల వరకు లోన్‌ను పొందవచ్చు. దీని వల్ల రిటెయిల్ షాప్స్ లాంటి వ్యాపారం నిర్వహించే వారికి ఎంతో మేలు జరుగుతుందని యాక్సిస్ బ్యాంక్ తెలియజేసింది. ఈ లోన్ స్కీమ్ వల్ల వ్యాపారులకు కావల్సిన ఆర్థిక సహాయం లభిస్తుందని, దీంతో వారు డబ్బు కోసం ఏవిధమైన ఆందోళన చెందకుండానే తమ రోజువారి వ్యాపార కార్యకలాపాలను నిరాటంకంగా కొనసాగించవచ్చని తెలియజేసింది.
చాలా త్వరగా లోన్..
దేశంలోనే మొదటి సారిగా ఈ తరహా లోన్ స్కీమ్‌ను తామే అందిస్తున్నామని యాక్సిస్ బ్యాంకు తెలియజేసింది. సాధారణంగా వ్యాపారులకు లోన్ కావాలంటే సెక్యూరిటీగా ఏదైనా సమర్పించాల్సి ఉంటుందని, పైగా పత్రాల పరిశీలన, రుణ మంజూరుకు సమయం పడుతుందని, కానీ తాము ప్రవేశపెట్టిన డిజిటల్ మర్చంట్ క్యాష్ అడ్వాన్స్ లోన్స్ స్కీమ్‌లో భాగంగా ఎలాంటి సెక్యూరిటీని సమర్పించాల్సిన అవసరం లేదని యాక్సిస్ బ్యాంకు కమర్షియల్ బ్యాంకింగ్ గ్రూప్ ప్రెసిడెంట్ విజయ్ శెట్టి తెలిపారు. అలాగే వ్యాపారుల రోజువారి లావాదేవీల వివరాలను, ఇతర పత్రాలు సమర్పిస్తే తాము క్షణాల్లోనే రుణాన్ని అందిస్తామని, దీంతో వ్యాపార లావాదేవీలకు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా ఉంటుందని అన్నారు. సాధారణ లోన్లకు రోజుల తరబడి సమయం పడుతుందని, కానీ తాము ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ వల్ల చాలా త్వరగా లోన్ పొందవచ్చని తెలిపారు.
రోజువారి ఈఎంఐ..
ఈ స్కీమ్‌లో భాగంగా వ్యాపారులు తాము తీసుకునే రుణానికి గాను భారీ ఎత్తున నెలవారి ఈఎంఐ లను చెల్లించాల్సిన అవసరం లేదు. రోజువారి వాయిదాల పద్దతిలోనూ రుణాన్ని చెల్లించవచ్చు. దీన్నే Everyday Installment (EDI) మోడల్‌గా యాక్సిస్ బ్యాంకు వ్యవహరిస్తోంది. వ్యాపారులు తమ రుణాన్ని రోజువారి వాయిదాల్లో చెల్లించవచ్చు. ఏరోజుకారోజు తమకు అయ్యే వ్యాపారాన్ని బట్టి కూడా రుణ ఈఎంఐ చెల్లింపులు చేయవచ్చని యాక్సిస్ బ్యాంకు తెలియజేసింది. దీని వల్ల నెలవారి ఈఎంఐల పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదని పేర్కొంది. కాగా తాము అందిస్తున్న ఈ లోన్ స్కీమ్ వల్ల దేశంలోని చిరు వ్యాపారులు, ఎంఎస్ఎంఈలకు ఎంతగానో ఉపయోగం ఉంటుందని యాక్సిస్ బ్యాంక్ అభిప్రాయం వ్యక్తం చేసింది.
సంబంధిత వార్తలు

HDFC Bank | హెచ్డీఎఫ్సీ బ్యాంకులో లోన్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్.. తగ్గిన వడ్డీ రేట్లు..
మే 8, 2026

Home Loan | హోం లోన్ తీసుకుంటున్నారా.. బెస్ట్ డీల్ లభించాలంటే క్రెడిట్ స్కోర్ ఎంత ఉండాలి..?
మే 3, 2026

ECLGS | MSME లకు గుడ్ న్యూస్.. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ ఇవ్వనున్న కేంద్రం..
ఏప్రిల్ 7, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



