త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Atal Pension Yojana | నెల‌కు రూ.5వేల పెన్ష‌న్ కావాలా.. ఈ కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కంలో చేరండి..

Atal Pension Yojana | భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించే ప్రముఖ పెన్షన్ పథకాలలో ఒకటి. ఈ పథకంలో నిర్దిష్ట కాలం పాటు ప్రతి నెలా పెట్టుబడి పెడితే 60 ఏళ్లు పూర్తైన తర్వాత ప్రతి నెలా పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. ఎంపిక చేసుకున్న ప్లాన్‌ను బట్టి గరిష్ఠంగా నెలకు రూ.5వేల వరకు పెన్షన్ అందుతుంది.

S

Business | Published On Jul 25, 2026, 2.19 pm IST

Atal Pension Yojana | నెల‌కు రూ.5వేల పెన్ష‌న్ కావాలా.. ఈ కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కంలో చేరండి..
Advertisement

Atal Pension Yojana | భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించే ప్రముఖ పెన్షన్ పథకాలలో ఒకటి. ఈ పథకంలో నిర్దిష్ట కాలం పాటు ప్రతి నెలా పెట్టుబడి పెడితే 60 ఏళ్లు పూర్తైన తర్వాత ప్రతి నెలా పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. ఎంపిక చేసుకున్న ప్లాన్‌ను బట్టి గరిష్ఠంగా నెలకు రూ.5వేల వరకు పెన్షన్ అందుతుంది. అటల్ పెన్షన్ యోజనలో రూ.1వేయి, రూ.2వేలు, రూ.3వేలు, రూ.4వేలు, రూ.5వేల‌ నెలవారీ పెన్షన్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఏ ప్లాన్‌ను ఎంచుకుంటారో, దరఖాస్తు చేసే సమయంలో వయస్సు ఎంత ఉందో దానిని బట్టి ప్రతి నెల చెల్లించాల్సిన ప్రీమియంను నిర్ణయిస్తారు.

నెల‌కు ఎంత చెల్లించాలి..

ఈ పథకంలో చేరేందుకు కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ఠ వయస్సు 40 సంవత్సరాలు. అయితే పెన్షన్ పొందాలంటే కనీసం 20 సంవత్సరాల పాటు నిరంతరంగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అనంతరం 60 ఏళ్లు పూర్తైన తర్వాత ఎంపిక చేసిన ప్లాన్‌కు అనుగుణంగా ప్రతి నెలా పెన్షన్ అందుతుంది. ఉదాహరణకు 18 ఏళ్ల వయస్సులో రూ.5వేల నెలవారీ పెన్షన్ ప్లాన్‌ను ఎంచుకుంటే, ప్రతి నెల రూ.210 ప్రీమియంగా చెల్లించాలి. అదే 30 ఏళ్ల వయస్సులో అదే రూ.5వేల పెన్షన్ ప్లాన్‌లో చేరితే నెలకు రూ.577 చెల్లించాల్సి ఉంటుంది.

ప్లాన్ ఆధారంగా ప్రీమియం..

పథకంలో చేరే సమయంలో బ్యాంకు అధికారులు వయస్సు, ఎంపిక చేసిన పెన్షన్ ప్లాన్ ఆధారంగా చెల్లించాల్సిన ప్రీమియాన్ని తెలియజేస్తారు. ఆ మొత్తం ప్రతి నెల బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా డెబిట్ అవుతుంది. దీంతో చెల్లింపులు స‌క్ర‌మంగా జ‌రుగుతాయి. ఇది కేంద్ర ప్ర‌భుత్వం ఆధ్వర్యంలో నిర్వ‌హిస్తున్న ప‌థ‌కం క‌నుక ప్ర‌జ‌ల పెట్టుబడుల‌కు భ‌ద్ర‌త ఉంటుంది. పైగా 60 ఏళ్లు దాటిన త‌రువాత ముందుగా నిర్ణ‌యించిన ప్ర‌కారం నిర్దిష్ట మొత్తాన్ని అందిస్తారు. దీంతో ఆ వ‌య‌స్సులో ఆర్థిక భ‌ద్ర‌త ల‌భిస్తుంది.

Advertisement
Advertisement