PM Svanidhi Scheme 2026 | చిరు వ్యాపారులకు శుభవార్త.. గ్యారంటీ లేకుండా రూ.90వేల వరకు రుణం..
PM Svanidhi Scheme 2026 | చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీఎం స్వనిధి పథకం-2026 కింద ఇప్పుడు ఎలాంటి తనఖా లేకుండా మొత్తం రూ.90వేల వరకు రుణం పొందే అవకాశం కల్పించారు. ఆధార్ కార్డు ఒక్కటే గుర్తింపుగా సరిపోతుంది.
PM Svanidhi Scheme 2026 | చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీఎం స్వనిధి పథకం-2026 కింద ఇప్పుడు ఎలాంటి తనఖా లేకుండా మొత్తం రూ.90వేల వరకు రుణం పొందే అవకాశం కల్పించారు. ఆధార్ కార్డు ఒక్కటే గుర్తింపుగా సరిపోతుంది. గ్యారంటీ అవసరం లేకుండానే దశలవారీగా రుణ పరిమితిని పెంచుతూ వ్యాపారం విస్తరించుకునే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. సమయానికి ఈఎంఐలు చెల్లిస్తే వడ్డీపై భారీ రాయితీతో పాటు క్యాష్‌బ్యాక్ లాంటి ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే, ఒకేసారి భారీ మొత్తాన్ని భారం వేయకుండా మూడు దశల్లో రుణాన్ని అందించడం.
దశలవారిగా సహాయం..
మొదటగా వ్యాపారం ప్రారంభించేందుకు రూ.10వేల సహాయం అందుతుంది. దీనిని సకాలంలో తిరిగి చెల్లిస్తే రుణ పరిమితి రూ.20వేలకు పెరుగుతుంది. ఆ తరువాత మూడో దశలో రూ.50వేల వరకు అదనంగా రుణం లభిస్తుంది. ఇలా మొత్తం కలిపి వ్యాపారులు రూ.90వేల వరకు ప్రయోజనం పొందవచ్చు. రుణాన్ని సమయానికి చెల్లించే వ్యాపారులకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది. వార్షికంగా 7 శాతం వడ్డీ రాయితీని సబ్సిడీ రూపంలో నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. అంతేకాకుండా యూపీఐ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ లావాదేవీలు చేస్తే నెలవారీ క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. దీంతో రుణ భారం తగ్గడమే కాకుండా డిజిటల్ చెల్లింపులకు కూడా ప్రోత్సాహం లభిస్తుంది.
సులభంగా దరఖాస్తు..
ఈ పథకానికి అర్హత విషయానికి వస్తే, పట్టణాలు లేదా నగరాల్లో వీధి వ్యాపారం చేస్తున్న వారు మున్సిపల్ గుర్తింపు కార్డు ఉంటే సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. కార్డు లేని వారు కూడా స్థానిక సంస్థల ద్వారా ధ్రువీకరణ అనంతరం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
ఈ పథకానికి దరఖాస్తు చేయాలంటే pmsvanidhi.mohua.gov.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)లో సంప్రదించవచ్చు. అవసరమైన పత్రాలు సక్రమంగా ఉంటే దరఖాస్తు చేసిన 30 రోజుల్లోనే రుణ మొత్తం బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఈ పథకం ద్వారా చిన్న వ్యాపారులు ఆర్థికంగా బలోపేతం కావడంతోపాటు స్వయం ఉపాధికి మరింత ఊతం లభిస్తుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






