Gold Purchase | ధంతేరస్‌కు బంగారం కొంటున్నారా? స్వచ్ఛతను ఇలా గుర్తించండి!
Gold Purchase | దీపావళి, ధంతేరస్ సందర్భంగా బంగారం కొనుగోలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలి. నకిలీ బంగారం, తక్కువ స్వచ్ఛత కలిగిన ఆభరణాల మోసాలను అరికట్టేందుకు భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) హాల్‌మార్క్, ఆరు అంకెల హెచ్‌యూఐడీ నంబర్ కీలకంగా పనిచేస్తాయి. బీఐఎస్ కేర్ యాప్ ద్వారా ఆభరణాల స్వచ్ఛత, నగల దుకాణం వివరాలను తనిఖీ చేయవచ్చు.
Gold Purchase | దీపావళి, ధంతేరస్ సందర్భంగా బంగారం కొనుగోలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలి. నకిలీ బంగారం, తక్కువ స్వచ్ఛత కలిగిన ఆభరణాల మోసాలను అరికట్టేందుకు భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) హాల్‌మార్క్, ఆరు అంకెల హెచ్‌యూఐడీ నంబర్ కీలకంగా పనిచేస్తాయి. బీఐఎస్ కేర్ యాప్ ద్వారా ఆభరణాల స్వచ్ఛత, నగల దుకాణం వివరాలను తనిఖీ చేయవచ్చు.
దీపావళి పండుగ సమీపిస్తుండడంతో దేశవ్యాప్తంగా బంగారం కొనుగోళ్లకు ప్రాధాన్యం పెరుగుతోంది. ముఖ్యంగా ధంతేరస్ రోజున బంగారం కొనుగోలు చేయడం శుభప్రదమని చాలా మంది విశ్వసిస్తారు. సంపద, శ్రేయస్సు, అదృష్టానికి బంగారాన్ని ప్రతీకగా భావించడంతో చాలామంది ఏడాది పొడవునా డబ్బు పొదుపు చేసి మరీ ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అయితే బంగారానికి పెరుగుతున్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కొందరు విక్రేతలు ఆకర్షణీయమైన తగ్గింపులు, ప్రత్యేక ఆఫర్ల పేరుతో నకిలీ బంగారం లేదా తక్కువ స్వచ్ఛత కలిగిన ఆభరణాలను విక్రయిస్తున్నారు. దీంతో కొనుగోలుదారులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది.
స్వచ్ఛతను ఎలా చెక్ చేయాలి..?
ఈ మోసాలను నివారించేందుకు బీఐఎస్ హాల్‌మార్క్ వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలి. బంగారు ఆభరణాల స్వచ్ఛతకు ధ్రువీకరణగా ఈ హాల్‌మార్క్ పనిచేస్తుంది. అసలైన హాల్‌మార్క్ ఉన్న ఆభరణాలపై బీఐఎస్ గుర్తు, బంగారం స్వచ్ఛతను తెలిపే గుర్తింపు (ఉదాహరణకు 22కె916), ఆరు అంకెల హాల్‌మార్క్ ప్రత్యేక గుర్తింపు సంఖ్య (హెచ్‌యూఐడీ) ఉంటాయి. ఈ వివరాలు సాధారణంగా ఆభరణాలపై చెక్కి ఉంటాయి. చిన్న అక్షరాల్లో ఉండే అవకాశం ఉన్నందున భూతద్దంతో పరిశీలించడం మంచిది. కొనుగోలు చేసే ముందు ఈ గుర్తులు ఉన్నాయో లేదో తప్పనిసరిగా నిర్ధారించుకోవాలి.
యాప్‌లో ఎలా తనిఖీ చేయాలి..?
ఆభరణాలపై ఉన్న హెచ్‌యూఐడీ నంబర్‌ను ప్రభుత్వానికి చెందిన బీఐఎస్ కేర్ యాప్‌లో నమోదు చేసి వివరాలను తనిఖీ చేసుకోవచ్చు. ఈ ప్రత్యేక సంఖ్య ద్వారా బంగారం స్వచ్ఛత, నాణ్యత, ఆభరణాల రకం, నమోదిత నగల వ్యాపారి పేరు, చిరునామా వంటి వివరాలు తెలుసుకోవచ్చు. ఆభరణం 14 క్యారెట్లు, 18 క్యారెట్లు లేదా 22 క్యారెట్ల బంగారంతో తయారైందో తెలుసుకోవడం ద్వారా దాని ధరను అంచనా వేయవచ్చు. యాప్‌లో హెచ్‌యూఐడీ వివరాలు కనిపించకపోయినా, ఆ నంబర్ చెల్లనిదని చూపించినా అప్రమత్తం కావాలి. అలాగే బీఐఎస్ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదిత నగల వ్యాపారుల జాబితాను పరిశీలించవచ్చు. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా ధంతేరస్ కొనుగోళ్ల సమయంలో నకిలీ బంగారం మోసాల నుంచి రక్షణ పొందవచ్చు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Priyanka Chopra | బయోపిక్‌లో చూపించినవన్నీ అబద్దాలే - ప్రియాంక చోప్రా సినిమాపై దిగ్గజ బాక్సర్ ఆరోపణలు
- ●Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..
- ●Karnataka SIR | కర్ణాటక తుది ఓటర్ల జాబితా విడుదల.. 99.32 లక్షల మంది పేర్లు ఔట్
- ●Errabelli Dayakar Rao | సిగ్గు లేకుండా ఫొటోలకు ఫోజులా..!
- ●Apple | ఐఫోన్ డ్యుయో వినియోగదారులకు షాక్.. డిస్ప్లేలో సమస్య..
- ●Assembly Elections 2027 | 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ నగారా: అధికారుల బదిలీలపై కీలక ఆదేశాలు.. ఆ డిక్లరేషన్ తప్పనిసరి!

Priyanka Chopra | బయోపిక్‌లో చూపించినవన్నీ అబద్దాలే - ప్రియాంక చోప్రా సినిమాపై దిగ్గజ బాక్సర్ ఆరోపణలు

Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..

Karnataka SIR | కర్ణాటక తుది ఓటర్ల జాబితా విడుదల.. 99.32 లక్షల మంది పేర్లు ఔట్

Errabelli Dayakar Rao | సిగ్గు లేకుండా ఫొటోలకు ఫోజులా..!






