త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | ఏడాది పాటు బంగారం కొనొద్దు.. దేశ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని మోదీ పిలుపు..!

P

Telangana | Published On May 10, 2026, 8.10 pm IST

PM Modi | ఏడాది పాటు బంగారం కొనొద్దు.. దేశ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని మోదీ పిలుపు..!
Advertisement

PM Modi | ప్ర‌జ‌లు ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు చేయొద్ద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ దేశ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్‌లో ఆయ‌న మాట్లాడారు. ప్ర‌స్తుతం ఇరాన్‌, ఉక్రెయిన్ యుద్ధం ప్ర‌భావం దేశంపై ప‌డుతోంద‌న్నారు. చాలా దేశాల్లో యూరియా బ‌స్తా రూ.3వేలు ఉంద‌ని, భార‌త్‌లో మాత్రం రూ.300లోపు మాత్ర‌మే ఉంద‌ని గుర్తు చేశారు ప్ర‌ధాని మోదీ. కొవిడ్ త‌ర్వాత ప్ర‌పంచ‌వ్యాప్తంగా స‌ర‌ఫ‌రా గొలుసులో స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌ని, పెట్రోల్‌, డీజిల్‌, ఎరువుల ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగాయ‌ని తెలిపారు. ధ‌ర‌ల భారాన్ని దేశ ప్ర‌జ‌ల భార‌త దేశ ప్ర‌జ‌ల‌పై ప‌డ‌కుండా చూశామ‌న్నారు. ప‌శ్చియాసియా యుద్ధ ప్ర‌భావం దేశంపై తీవ్రంగా ఉంద‌న్నారు. రెండు నెల‌ల నుంచి ప్ర‌జ‌ల‌పై భారం ప‌డ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు.

గడ్డు కాలంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాల‌ని, దుబారా ఖర్చులు తగ్గించుకోవాల‌ని ప్ర‌ధాని పిలుపునిచ్చారు. దీర్ఘ‌కాలంలో పెట్రోల్‌, డీజిల్ వినియోగాన్ని మ‌నం త‌గ్గించుకోవాల‌ని పిలుపునిచ్చారు. రైల్వేరంగంలో డీజిల్ వినియోగాన్ని గ‌ణ‌నీయంగా త‌గ్గిస్తున్నామ‌న్నారు. దేశంలో ఎల‌క్ట్రిక‌ల్ వాహ‌నాల‌ను ప్రోత్స‌హిస్తున్న‌ట్లు తెలిపారు. స‌మీప భ‌విష్య‌త్‌లో పెట్రోల్‌, డీజిల్ అవ‌స‌రం మ‌న‌కు భారీగా త‌గ్గుతుంద‌న్నారు. పెట్రోల్‌, డీజిల్ వాడ‌కం త‌గ్గిస్తే విదేశీ మార‌క‌ద్ర‌వ్యం మిగులుతుంద‌న్నారు. ప్ర‌జ‌లు సొంత వాహ‌నాల‌కు బ‌దులుగా మెట్రోలు, బ‌స్ సేవ‌ల‌ను వినియోగించుకోవాల‌ని పిలుపునిచ్చారు. వీలైనంత వ‌ర‌కు పెట్రోల్‌, డీజిల్‌ను ప‌రిమితంగా వినియోగించాల‌ని కోరారు. వ‌ర్క్ ఫ్రం హోం, ఆన్‌లైన్ మీటింగ్‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు దుబారా ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. దుబారా ఖ‌ర్చులు త‌గ్గించాల‌ని, ఆడంబ‌రాల‌కు పోడ‌కూడ‌ద‌న్నారు.

ఇది దేశ విధానం..

అంత‌ర్జాతీయ ప‌రిస్థితుల వ‌ల్ల బంగారం ధ‌ర‌లు పెరుగుతున్నాయ‌ని, బంగారం కొనుగోళ్ల‌ను మ‌నం త‌గ్గించుకోవాల‌ని కోరారు. బంగారం దిగ‌మ‌తులు త‌గ్గిస్తే విదేశీమార‌క ద్ర‌వ్యం పెరుగుతుంద‌న్నారు. పండ‌గ‌లు, శుభ‌కార్యాల‌కు బంగారం కొనుగోళ్ల‌ను త‌గ్గించుకోవాల‌న్నారు. ఏడాది పాటు బంగారం కొనుగోళ్ల‌ను పూర్తిగా నిలిపివేద్దామ‌న్నారు. విదేశీ డెస్టినేష‌న్ మ్యారేజ్‌ల‌ను త‌గ్గించుకోవాల‌ని కోరారు. అలాగే, విదేశీ ప‌ర్య‌ట‌న‌లు సైతం త‌గ్గించుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. వంట‌నూనెల్లో స్వ‌యం సంవృద్ధి సాధించాల‌న్నారు. ఎరువుల వినియోగం త‌గ్గించి భూసారాన్ని కాపాడాల‌న్నారు. మ‌నం ఇంట్లో వాడే వ‌స్తువుల‌ను ఒక‌సారి ప‌రిశీలించాల‌ని, మ‌న నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను విదేశాల నుంచి వ‌చ్చిన‌వేన‌న్నారు. అన్నింటి దిగుమ‌తుల‌పైనే ఆధార‌ప‌డితే దేశాభివృద్ధి ఎలా సాధ్య‌మ‌ని ప్ర‌శ్నించారు. స్వ‌దేశీ వ‌స్తువుల‌ను వినియోగిస్తామ‌ని ప్ర‌తిజ్ఞ చేయాల‌ని కోరారు. స్వ‌దేశీ అనేది కేవ‌లం బీజేపీ నినాదం కాద‌ని, ఇది దేశ విధాన‌మ‌న్నారు.

Advertisement
Advertisement