PAN | పాన్ అంటే కేవలం ఐటీ రిటర్న్స్ కు మాత్రమే కాదు, ఈ సందర్భాల్లోనూ వివరాలను ఇవ్వాల్సిందే
PAN | దేశంలో పాన్ (పర్మనెంట్ అకౌంట్ నంబర్) ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే 10 అక్షరాల అల్ఫాన్యూమరిక్ గుర్తింపు సంఖ్య. ఇది వ్యక్తులు, కంపెనీలు, ఇతర సంస్థలకు సంబంధించిన కీలక పత్రం. చాలా మందికి ఇది కేవలం ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్) ఫైల్ చేయడానికి మాత్రమే అవసరమని అనిపించవచ్చు.
PAN | దేశంలో పాన్ (పర్మనెంట్ అకౌంట్ నంబర్) ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే 10 అక్షరాల అల్ఫాన్యూమరిక్ గుర్తింపు సంఖ్య. ఇది వ్యక్తులు, కంపెనీలు, ఇతర సంస్థలకు సంబంధించిన కీలక పత్రం. చాలా మందికి ఇది కేవలం ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్) ఫైల్ చేయడానికి మాత్రమే అవసరమని అనిపించవచ్చు. అయితే వాస్తవానికి పాన్ అనేది మరెన్నో ఆర్థిక లావాదేవీలలో తప్పనిసరిగా అవసరమవుతుంది. ఆదాయపు పన్ను నియమం 114బి ప్రకారం, నిర్దిష్ట పరిమితులకు మించి జరిగే హై-వాల్యూ ఆర్థిక లావాదేవీలలో పాన్ వివరాలు ఇవ్వడం తప్పనిసరి. ఇది పారదర్శకతను పెంచడం, అలాగే పన్ను ఎగవేతను నివారించడం లక్ష్యంగా అమలులో ఉంది.
వివరాలు ఇవ్వకపోతే రూ.10వేలు జరిమానా..
ప్రధానంగా బ్యాంక్ డిపాజిట్లు లేదా విత్‌డ్రాయల్స్ రూ.50వేలకు మించితే, స్థిరాస్తి కొనుగోలు (రూ.10 లక్షల కంటే ఎక్కువ), వాహనాల కొనుగోలు, పెద్ద మొత్తంలో పెట్టుబడులు, విదేశీ ప్రయాణ ఖర్చులు వంటి సందర్భాల్లో పాన్ తప్పనిసరిగా అవసరం అవుతుంది. పాన్ వివరాలు ఇవ్వకపోతే రూ.10వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఒకే రోజులో రూ.50వేల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేయడం లేదా బ్యాంకు, పోస్టాఫీస్ డిపాజిట్ల ద్వారా రూ.2.50 లక్షలకు పైగా ఒకే ఏడాదిలో ఆదాయం ఉన్నా పాన్ వివరాలను తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే రూ.10 లక్షలకు మించిన విలువ కలిగిన భూమి లేదా ఇల్లు కొనుగోలు లేదా విక్రయం చేసినప్పుడు, లేదా స్టాంప్ విలువ కూడా అదే స్థాయిలో ఉన్నప్పుడు పాన్ వివరాలను సమర్పించాలి.
ఏయే సందర్బాల్లో పాన్ వివరాలను ఇవ్వాలి..
టైమ్ డిపాజిట్ ఖాతాలు, బేసిక్ సేవింగ్స్ ఖాతాలను మినహాయించి, ఇతర బ్యాంక్ లేదా కోఆపరేటివ్ బ్యాంక్ ఖాతా తెరవడానికి, ద్విచక్ర వాహనాలను మినహాయించి, రూ.5 లక్షలకు మించిన విలువ కలిగిన వాహనం కొనుగోలు లేదా విక్రయం చేసినప్పుడు, విదేశీ ప్రయాణానికి సంబంధించి రూ.50వేల కంటే ఎక్కువ నగదు చెల్లింపు లేదా విదేశీ కరెన్సీ కొనుగోలు చేసినప్పుడు, ఒకేసారి రూ.50వేల కంటే ఎక్కువ నగదును హోటల్స్ లేదా రెస్టారెంట్లలో బిల్లుగా చెల్లించినప్పుడు, ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50వేల కంటే ఎక్కువ బీమా ప్రీమియం చెల్లించినప్పుడు, మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు కొనుగోలు చేయడానికి రూ.50వేల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టినప్పుడు లేదా బాండ్లు, డిబెంచర్లు కొనుగోలు చేసినప్పుడు, ఏవైనా వస్తువులు లేదా సేవలను రూ.2 లక్షలకు మించిన విలువతో కొనుగోలు లేదా విక్రయం చేసినప్పుడు, ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50వేల కంటే ఎక్కువ మొత్తంలో ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ కొనుగోలు కోసం నగదు లేదా బ్యాంక్ డ్రాఫ్ట్, పే ఆర్డర్ ద్వారా చెల్లించినప్పుడు పాన్ వివరాలను కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది.
ఈ నిబంధనలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కాన్సులర్ కార్యాలయాలకు వర్తించవు. పాన్ కేవలం పన్ను దాఖలు పత్రం మాత్రమే కాదు, దేశంలో పెద్ద ఆర్థిక లావాదేవీలకు కీలక గుర్తింపు సాధనంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి ఈ నిబంధనలను తెలుసుకుని, సరైన సందర్భాల్లో పాన్ వినియోగించడం ద్వారా జరిమానాలను నివారించవచ్చు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Income Tax Department | మీ సేవింగ్స్ అకౌంట్‌పై ‘ఐటీ’ కన్ను.. ఈ 10 లావాదేవీలు చేస్తే నోటీసులు గ్యారెంటీ..
మే 21, 2026

SEBI | విదేశీ ఇన్వెస్టర్లకు సెబీ గుడ్‌న్యూస్.. పాన్ అప్లికేషన్ నిబంధనలు సడలింపు..
మే 16, 2026

ITR Filing 2026 | ఐటీఆర్ ఫైలింగ్ ప్రారంభం.. ఐటీఆర్-1, ఐటీఆర్-4 యుటిలిటీస్ విడుదల..
మే 15, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



