Paytm Shares | ఆర్బీఐ చర్యల ఎఫెక్ట్.. భారీగా పతనమైన పేటీఎం షేర్లు..
Paytm Shares | డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్ పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంకు బ్యాంకింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ ఆర్బీఐ చర్యలు చేపట్టడంతో ఆ కంపెనీకి చెందిన మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ షేర్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌లో భారీగా పతనమయ్యాయి.
Paytm Shares | డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్ పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంకు బ్యాంకింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ ఆర్బీఐ చర్యలు చేపట్టడంతో ఆ కంపెనీకి చెందిన మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ షేర్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌లో భారీగా పతనమయ్యాయి. దాదాపు 8 శాతం మేర పతనం అయిన అనంతరం మళ్లీ కాస్త రికవర్ అయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తీసుకున్న ఈ కీలక నిర్ణయం ఆ సంస్థ షేర్లపై తీవ్రంగా ప్రభావం చూపించింది. పేటీఎం షేర్ ధర 7.96 శాతంపడిపోయి 1,052 ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. తరువాత కాస్త రికవర్ అయింది. ప్రస్తుతం 1,118 వద్ద కొనసాగుతుండగా, బెంచ్‌మార్క్ సూచీ నిఫ్టీ50 మాత్రం 0.63 శాతం లాభాల్లో ఉండటం విశేషం.
కస్టమర్లకు నష్టం లేదు: ఆర్‌బీఐ
ఆర్బీఐ ఏప్రిల్ 24 నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసినట్లు ప్రకటించింది. బ్యాంక్ కార్యకలాపాలపై ఇప్పటికే పలు పరిమితులు విధించిన నేపథ్యంలో ఈ చర్య మరింత కఠినంగా మారింది. బ్యాంక్‌ను పూర్తిగా మూసివేయడానికి (వైండింగ్-అప్) చర్యలు ప్రారంభిస్తామని ఆర్బీఐ తెలిపింది. కేంద్ర బ్యాంక్ ఆదేశాల ప్రకారం బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 కింద నిర్వచించిన బ్యాంకింగ్ కార్యకలాపాలు లేదా ఇతర అనుమతించిన సేవలను కొనసాగించడంపై తక్షణమే నిషేధం విధించింది. అయితే కస్టమర్లకు ఎలాంటి నష్టం లేదని, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వద్ద లిక్విడిటీ సరిపడా ఉందని ఆర్బీఐ పేర్కొంది. బ్యాంక్ మూసివేత ప్రక్రియలో అన్ని డిపాజిట్ లను పేటీఎం పేమెఎంట్స్ బ్యాంక్ చెల్లిస్తుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






