త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | ప్రపంచ మార్కెట్ల పతనం ఎఫెక్ట్.. 615 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కంపెనీల అధిక వాల్యుయేషన్లపై ఆందోళనలు, ఇటీవల మార్కెట్లలో వచ్చిన ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు కుప్పకూలాయి.

S

Business | Published On Nov 20, 2026, 10.55 am IST

Stock Markets | ప్రపంచ మార్కెట్ల పతనం ఎఫెక్ట్.. 615 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కంపెనీల అధిక వాల్యుయేషన్లపై ఆందోళనలు, ఇటీవల మార్కెట్లలో వచ్చిన ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు కుప్పకూలాయి. ఉదయం ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 615 పాయింట్లు (0.74 శాతం) నష్టపోయి 82,403 పాయింట్ల కనిష్ట స్థాయికి చేరుకుంది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ50 సుమారు 170 పాయింట్లు (0.66 శాతం) క్షీణించి 25,345 వద్ద ట్రేడైంది.

మెటల్, బ్యాంకింగ్ షేర్లలో భారీ అమ్మకాలు..

రంగాలవారీగా చూస్తే నిఫ్టీ మెటల్ ఇండెక్స్ అత్యధికంగా 1.8 శాతం పడిపోయి నష్టాల్లో అగ్రస్థానంలో నిలిచింది. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ 0.97 శాతం, నిఫ్టీ రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు చెరో 0.79 శాతం చొప్పున క్షీణించాయి. అయితే ఐటీ రంగ షేర్లు మాత్రం కొంత ఊరటనిచ్చాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 0.76 శాతం లాభపడింది. సెన్సెక్స్, నిఫ్టీ పరిధిలో టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టైటాన్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్‌అండ్‌టీ, హిందాల్కో, ఎస్‌బీఐ, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు ప్రధానంగా నష్టాలను చవిచూశాయి. అమెరికా మార్కెట్లలోనూ అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి నాస్‌డాక్ 2.25 శాతం పడిపోగా, ఎస్‌అండ్‌పీ 500 సూచీ దాదాపు 2 శాతం నష్టపోయింది. ఏఐ రంగంలో కంపెనీల అధిక వాల్యుయేషన్లపై పెరుగుతున్న ఆందోళనలు, ఆంథ్రోపిక్ కంపెనీ మార్కెట్ అరంగేట్రం తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు టెక్నాలజీ ఆధారిత షేర్లపై ప్రభావం చూపాయి. ఆసియా మార్కెట్లలోనూ ఇదే ప్రతికూల ధోరణి కనిపించింది. జపాన్‌కు చెందిన నిక్కీ, హాంకాంగ్ హాంగ్‌సెంగ్, దక్షిణ కొరియా కోస్పీ సూచీలు గరిష్ఠంగా 5 శాతం వరకు నష్టపోయాయి.

దీర్ఘకాలికంగా దేశీయ మార్కెట్లకు మద్దతు..

అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా సమీప కాలంలో మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగుతాయ‌ని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ నెలలో ఇప్పటివరకు భారత మార్కెట్లు ప్రపంచంలోని పలు ప్రధాన మార్కెట్లతో పోలిస్తే మెరుగైన పనితీరు కనబరిచాయని పేర్కొన్నారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్ఐఐ) పెట్టుబడుల ప్రవాహం, దేశీయ కంపెనీల మెరుగైన ఆర్థిక ఫలితాలు మార్కెట్లకు మద్దతుగా నిలుస్తున్నాయని విశ్లేషించారు.

Advertisement
Advertisement