E20 Petrol | ఈ20 పెట్రోల్‌పై ఆయిల్ కంపెనీల స్పష్టత.. నీరు ఉందా, లేదా..?
E20 Petrol | ఇటీవల ఈ20 పెట్రోల్‌లో అధిక స్థాయిలో క్లోరైడ్ ఉండటం, తేమ (మాయిశ్చర్) కలుషితం అయ్యిందంటూ వస్తున్న ఆరోపణలను ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) ఖండించాయి.
E20 Petrol | ఇటీవల ఈ20 పెట్రోల్‌లో అధిక స్థాయిలో క్లోరైడ్ ఉండటం, తేమ (మాయిశ్చర్) కలుషితం అయ్యిందంటూ వస్తున్న ఆరోపణలను ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) ఖండించాయి. దేశవ్యాప్తంగా నిర్వహించిన విస్తృత స్థాయి శాస్త్రీయ పరీక్షల్లో ఇంధన కలుషితానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశాయి. ఈ20 ఇంధన సరఫరా వ్యవస్థ మొత్తం మీద శాస్త్రీయ పద్ధతిలో యాదృచ్ఛిక నమూనాలను సేకరించి నిర్వహించిన పరీక్షల్లో ఇంధన నాణ్యత నిర్దేశిత ప్రమాణాల పరిధిలోనే ఉన్నట్లు తేలిందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మూడు సంస్థలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి.
ఫ్రీక్వెన్సీ మానిటరింగ్ వ్యవస్థ..
ఇటీవల ఎథనాల్ బ్లెండెడ్ మోటార్ స్పిరిట్ (ఈబీఎంఎస్), సాధారణంగా ఈ20 పెట్రోల్‌గా విక్రయించే ఇంధనంలో కలుషితం జరిగి ఉండొచ్చన్న వార్తల నేపథ్యంలో ఈ వివరణ ఇచ్చాయి. పెట్రోల్‌లో కలిపే ఎథనాల్‌కు కేంద్ర ప్రభుత్వం కఠినమైన క్లోరైడ్ ప్రమాణాలను నిర్దేశించిందని, రిఫైనరీలు, డిస్టిలరీలు, డిపోలు, టెర్మినల్స్, రిటైల్ అవుట్‌లెట్ల వరకు మొత్తం సరఫరా గొలుసులో అధిక ఫ్రీక్వెన్సీ మానిటరింగ్ వ్యవస్థ అమల్లో ఉందని వెల్లడించాయి. ఇంధన నాణ్యత పర్యవేక్షణను మరింత బలోపేతం చేస్తూ ప్రతి రిటైల్ అవుట్‌లెట్‌లో రోజుకు ఎనిమిది నుంచి పన్నెండు సార్లు వాటర్ ఇన్‌గ్రెస్, డెన్సిటీ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపాయి. దేశవ్యాప్తంగా మొబైల్ ఫ్యుఫ్యూయల్ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబొరేటరీలను కూడా వినియోగిస్తున్నామని, పరీక్షల ఫలితాలను గుర్తింపు పొందిన ఇంధన ప్రయోగశాలల ద్వారా స్వతంత్రంగా ధ్రువీకరిస్తున్నామని పేర్కొన్నాయి.
తక్కువగానే క్లోరైడ్ స్థాయిలు..
దేశంలోని రిఫైనరీల నుంచి యాదృచ్ఛికంగా సేకరించిన 100కు పైగా పెట్రోల్ నమూనాల్లో క్లోరైడ్ స్థాయి ఒక పీపీఎం లేదా అంతకంటే తక్కువగా నమోదైందని ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ వెల్లడించాయి. దీంతో దేశంలోని రిఫైనరీల నుంచి విడుదలయ్యే పెట్రోల్ నిర్దేశిత నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగానే ఉందని స్పష్టమవుతోందని పేర్కొన్నాయి. గత పది రోజులుగా మూడు చమురు మార్కెటింగ్ సంస్థలు, సెంటర్ ఫర్ హై టెక్నాలజీ (సీహెచ్‌టీ) అధికారులతో కూడిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ దేశవ్యాప్తంగా 80 డిస్టిలరీల నుంచి ఎథనాల్ నమూనాలను పరిశీలించింది. అన్ని నమూనాల్లోనూ క్లోరైడ్ స్థాయి మూడు పీపీఎంకు దిగువన నమోదైందని, ఇది నిర్దేశిత పరిమితికంటే చాలా తక్కువని తెలిపాయి. దీంతో ఎథనాల్ ఉత్పత్తి దశలో కూడా నాణ్యత నియంత్రణ సమర్థంగా అమలవుతోందని వెల్లడించాయి.

3 పీపీఎం కన్నా తక్కువగానే..
డిపోలు, ట్యాంక్ ట్రక్ టెర్మినల్స్‌లో పరీక్షించిన ఎథనాల్, ఈ20 పెట్రోల్ నమూనాల్లో కూడా క్లోరైడ్ స్థాయి మూడు పీపీఎంకు లోపే ఉందని సంస్థలు తెలిపాయి. దేశవ్యాప్తంగా చమురు మార్కెటింగ్ సంస్థల టెర్మినల్స్ నుంచి సేకరించిన 80కు పైగా నమూనాలు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని పేర్కొన్నాయి. నిల్వ, పంపిణీ దశల్లో కూడా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని వెల్లడించాయి. రిటైల్ అవుట్‌లెట్లలో ప్రత్యేక పర్యవేక్షణ కార్యక్రమం కింద వెయ్యికి పైగా నమూనాలను సేకరించామని, ఇప్పటివరకు విశ్లేషించిన 160 నమూనాల్లో క్లోరైడ్ స్థాయి సున్నా నుంచి మూడు పీపీఎం మధ్యే నమోదైందని తెలిపాయి. ఈ20 పెట్రోల్‌లో వందల పీపీఎంల క్లోరైడ్ ఉందన్న ఆరోపణలను ఈ ఫలితాలు పూర్తిగా ఖండిస్తున్నాయని పేర్కొన్నాయి.
నాలుగింటిలోనే సమస్యలు..
మొత్తం పర్యవేక్షణలో కేవలం నాలుగు ప్రాంతాల్లో మాత్రమే క్లోరైడ్ స్థాయి ఎక్కువగా నమోదైనట్లు గుర్తించామని వెల్లడించాయి. ఆ ప్రాంతాల్లో వెంటనే ఇంధన సరఫరాను నిలిపివేసి, సమస్యకు మూల కారణాన్ని గుర్తించి, అవసరమైన సరిదిద్దే చర్యలు తీసుకున్న తర్వాతే తిరిగి కార్యకలాపాలను ప్రారంభించామని వివరించాయి. తేమ కలుషితంపై వచ్చిన ఆరోపణలకూ సంస్థలు స్పందించాయి. దేశవ్యాప్తంగా సుమారు 90 వేల రిటైల్ అవుట్‌లెట్లలో భూగర్భ నిల్వ ట్యాంకుల తనిఖీ, పర్యవేక్షణను తప్పనిసరి చేశామని తెలిపాయి. ఈ ట్యాంకులను రోజుకు ఎనిమిది నుంచి పన్నెండు సార్లు పరిశీలిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎక్కడా నీరు చొరబడినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశాయి.
సంబంధిత వార్తలు

E20 Petrol | కేంద్రం తీసుకొచ్చిన ఇథనాల్ పెట్రోల్‌కు పొన్నం ప్రభాకర్ మద్దతు.. అదంతా అపోహే అన్న మంత్రి
సెప్టెంబర్ 9, 2026

Supreme Court | పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని కచ్చితంగా వెల్లడించాలి.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
ఆగస్టు 31, 2026

E20 Petrol | పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని నాజిల్స్‌పై ప్రదర్శించాలి
ఆగస్టు 29, 2026
తాజావార్తలు
- ●Telangana Auto Drivers Welfare Board | ఆటో డ్రైవర్లకు తెలంగాణ సర్కార్ శుభవార్త: త్వరలో వెల్ఫేర్ బోర్డు.. ఒక్కో ఆటోకు రూ.1.5 లక్షల సబ్సిడీ
- ●Tirumala | పెటరాసి మాసం.. తిరుమలకు పోటెత్తిన భక్తజనం..
- ●Chintala Ramachandra Reddy | "ఉపఎన్నిక కోసం కొట్లాడింది మేము.. గెలిచేదీ మేమే": విజయా రెడ్డి పిటిషన్లో ఇంప్లీడ్ అవుతాం
- ●Sanjay Malhotra | ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సవాళ్లు.. అప్రమత్తతే కీలకం: ఆర్బీఐ గవర్నర్
- ●Bollywood Debut | అడవి నుంచి కెమెరా ముందుకు..! మాజీ మహిళా మావోయిస్టులకు బాలీవుడ్ ఛాన్స్
- ●Parliamentary Committee on Defence 2026 | పార్లమెంట్ రక్షణ కమిటీ పునర్వ్యవస్థీకరణ: తెలంగాణ నుంచి దామోదర్ రావు, ఏపీ నుంచి కేశినేని చిన్నికి చోటు.. చైర్మన్‌గా రాధా మోహన్ సింగ్

Telangana Auto Drivers Welfare Board | ఆటో డ్రైవర్లకు తెలంగాణ సర్కార్ శుభవార్త: త్వరలో వెల్ఫేర్ బోర్డు.. ఒక్కో ఆటోకు రూ.1.5 లక్షల సబ్సిడీ

Tirumala | పెటరాసి మాసం.. తిరుమలకు పోటెత్తిన భక్తజనం..

Chintala Ramachandra Reddy | "ఉపఎన్నిక కోసం కొట్లాడింది మేము.. గెలిచేదీ మేమే": విజయా రెడ్డి పిటిషన్లో ఇంప్లీడ్ అవుతాం

Sanjay Malhotra | ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సవాళ్లు.. అప్రమత్తతే కీలకం: ఆర్బీఐ గవర్నర్



