Nvidia | ఎన్విడియా సీఈఓ రాజీనామా.. కంపెనీ భవిష్యత్తేమిటి..?
Nvidia | ప్రపంచంలోనే అత్యంత విలువైన చిప్ తయారీ సంస్థ ఎన్విడియాలో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ జెన్సన్ హువాంగ్ 33 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలుకుతూ రాజీనామా చేశారు. ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలు, విదేశీ నిఘా సంస్థల ప్రమేయంపై అనుమానాలు, కంపెనీ షేర్ల పతనం నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. తాత్కాలిక సీఈఓగా ఆర్థిక విభాగం అధిపతి కొలెట్ క్రెస్ బాధ్యతలు చేపట్టారు.
Nvidia | ప్రపంచంలోనే అత్యంత విలువైన చిప్ తయారీ సంస్థ ఎన్విడియాలో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ జెన్సన్ హువాంగ్ 33 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలుకుతూ రాజీనామా చేశారు. ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలు, విదేశీ నిఘా సంస్థల ప్రమేయంపై అనుమానాలు, కంపెనీ షేర్ల పతనం నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. తాత్కాలిక సీఈఓగా ఆర్థిక విభాగం అధిపతి కొలెట్ క్రెస్ బాధ్యతలు చేపట్టారు.
మరో ఇద్దరు మహిళలతోనూ సంబంధాలు..?
1993లో ఎన్విడియాను స్థాపించిన 63 ఏళ్ల జెన్సన్ హువాంగ్ నవంబర్ 12న తన సీఈఓ పదవికి రాజీనామా చేశారు. నవంబర్ 8న తన వివాహేతర సంబంధాన్ని అంగీకరిస్తూ ప్రకటన చేసిన కొద్ది రోజులకే ఈ నిర్ణయం వెలువడింది. ఆలిస్ హువాంగ్‌తో సంబంధం ఉందని, ఆమె చైనాకు పనిచేస్తున్నారనే అనుమానాలు అమెరికా నిఘా అధికారులు వ్యక్తం చేసినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అనంతరం ఎన్విడియా హెల్త్‌కేర్ విభాగం వైస్ ప్రెసిడెంట్ కింబర్లీ పావెల్‌తో సంబంధం ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. మరో ఉద్యోగితోనూ సంబంధం ఉన్నట్లు రాయిటర్స్ నివేదించింది. అయితే ఈ ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలు స్వతంత్రంగా నిర్ధారణ కాలేదు. రాజీనామా అనంతరం జెన్సన్ హువాంగ్ కంపెనీలో ఎలాంటి హోదాలోనూ పనిచేయరని ఎన్విడియా స్పష్టం చేసింది.
తదుపరి సీఈఓ ఎవరు..?
తాత్కాలిక సీఈఓగా కొలెట్ క్రెస్ బాధ్యతలు చేపట్టగా, నవంబర్ 17న ప్రకటించనున్న మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఆమె నాయకత్వంలో వెలువడనున్నాయి. హువాంగ్ నాయకత్వంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విదేశీ నిఘా సంస్థలు ఆయనను లక్ష్యంగా చేసుకున్నాయా అనే అంశంపై స్వతంత్ర డైరెక్టర్లు, బయటి న్యాయ నిపుణుల నేతృత్వంలో కంపెనీ బోర్డు విచారణ ప్రారంభించింది. ఎన్విడియా ఏఐ చిప్స్ చైనా కంపెనీలకు మళ్లించబడుతున్నాయనే నివేదికలు కూడా సంస్థపై ఒత్తిడిని పెంచాయి. శాశ్వత సీఈఓ ఎంపిక కోసం బోర్డు అన్వేషణ ప్రారంభించింది. కొలెట్ క్రెస్‌తోపాటు సీనియర్ ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ఇయాన్ బక్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. 2013లో ఎన్విడియాలో చేరిన క్రెస్‌కు మైక్రోసాఫ్ట్, సిస్కో, టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్ సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది. మరోవైపు 2004లో కంపెనీలో చేరిన ఇయాన్ బక్, ఎన్విడియా పోటీ సామర్థ్యానికి కీలకమైన కుడా సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్ అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషించారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసిన ఆయన ప్రస్తుతం హైపర్‌స్కేల్ ఏఐ ఉత్పత్తులకు నాయకత్వం వహిస్తున్నారు.

600 బిలియన్ డాలర్లు ఆవిరి..
శాశ్వత సీఈఓ పదవికి ఆర్మ్ సీఈఓ రెనే హాస్, ఎన్విడియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ జెఫ్ ఫిషర్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. హువాంగ్ ఇద్దరు పిల్లలు కూడా కంపెనీలో పదవులు నిర్వహిస్తుండడంతో వారి పేర్లపై కూడా ఊహాగానాలు సాగుతున్నాయి. క్రెస్ ఆర్థిక నిర్వహణ అనుభవం, బక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిపి సహ సీఈఓల విధానం అమలు చేసే అవకాశంపైనా చర్చ జరుగుతోంది. మరోవైపు హువాంగ్ రాజీనామా ప్రకటన అనంతరం ఎన్విడియా షేర్లు ఒక దశలో 16 శాతం వరకు పడిపోయి, చివరకు 4.3 శాతం నష్టంతో ముగిశాయి. అక్టోబర్ ప్రారంభంలో నమోదైన గరిష్ఠ స్థాయితో పోలిస్తే షేరు విలువ 30 శాతానికి పైగా తగ్గినట్లు రాయిటర్స్ వెల్లడించింది. ఈ వారంలో కంపెనీ మార్కెట్ విలువ సుమారు 600 బిలియన్ డాలర్లు తగ్గినట్లు నివేదికలు పేర్కొన్నాయి. కంపెనీ అభివృద్ధికి జెన్సన్ హువాంగ్ అందించిన సేవలు అపారమైనవని, ప్రపంచ సాంకేతిక రంగంలో ఎన్విడియా కీలక సంస్థగా ఎదగడంలో ఆయన పాత్ర మరువలేనిదని బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది.
ఎన్‌విడియా భవిష్యత్తేమిటి..?
ఈ నాయకత్వ మార్పు ఎన్విడియా భవిష్యత్తుపై స్వల్పకాలంలో గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా కృత్రిమ మేధ రంగంలో కంపెనీ సాధించిన విజయాలు, పెట్టుబడిదారుల విశ్వాసం, వ్యూహాత్మక నిర్ణయాల్లో జెన్సన్ హువాంగ్ కీలక పాత్ర పోషించారు. ఆయన నిష్క్రమణతో కంపెనీ భవిష్యత్ వ్యూహాలపై అనిశ్చితి ఏర్పడడంతో షేర్లలో ఒడిదుడుకులు పెరగనున్నాయి. అయితే ఎన్విడియా వద్ద బలమైన సాంకేతిక బృందం, కుడా సాఫ్ట్‌వేర్ ఎకోసిస్టమ్, భారీ ఏఐ చిప్ డిమాండ్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. కొత్త సీఈఓ సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించి, కీలక కస్టమర్లతో సంబంధాలను కొనసాగిస్తూ ఉత్పత్తుల అభివృద్ధిని వేగవంతం చేయగలిగితే కంపెనీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంది. మరోవైపు నాయకత్వ వివాదాలు, అంతర్గత విచారణలు, చైనా సంబంధిత ఆరోపణలు కొనసాగితే వ్యాపార విస్తరణతోపాటు పెట్టుబడిదారుల విశ్వాసంపైనా ప్రతికూల ప్రభావం పడనుంది.
ఎన్విడియా దీర్ఘకాలిక భవిష్యత్తును నిర్ణయించేది హువాంగ్ నిష్క్రమణ కంటే కొత్త నాయకత్వం కంపెనీ వృద్ధిని ఎంత సమర్థవంతంగా కొనసాగిస్తుందనేదే కీలకం. అందువల్ల పెట్టుబడిదారులు ఎన్విడియా షేర్ల ధరలు తగ్గాయని కొనుగోలు చేసు ముందు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!
- ●Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..
- ●Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!
- ●Silent Heart Attack Causes | గుండెపోటు సడన్‌గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!
- ●Gold Price | వరుసగా నాలుగో రోజూ తగ్గిన బంగారం ధర.. తులంపై రూ.2,500 డౌన్..!
- ●IAS Rajiv Hanumanthu Road Accident | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తెలంగాణ ఐఏఎస్ రాజీవ్ హనుమంతు.. ఫోన్లో పరామర్శించి భరోసా ఇచ్చిన పొంగులేటి

Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!

Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..

Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!

Silent Heart Attack Causes | గుండెపోటు సడన్‌గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!






