NSE IX | ఇక రోజుకు 23.5 గంటల పాటు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్.. ఎన్ఎస్ఈ కీలక ప్రకటన..
NSE IX | అంతర్జాతీయ పెట్టుబడిదారులకు మరింత చేరువయ్యే లక్ష్యంతో ఎన్ఎస్ఈ ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈఐఎక్స్) కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో ట్రేడింగ్ సమయాలను రోజుకు 23 గంటల 30 నిమిషాలకు పొడిగించింది. సోమవారం నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకు దాదాపు 24 గంటల పాటు మార్కెట్లలో ట్రేడింగ్ చేసే అవకాశం కల్పించినట్లయింది.
NSE IX | అంతర్జాతీయ పెట్టుబడిదారులకు మరింత చేరువయ్యే లక్ష్యంతో ఎన్ఎస్ఈ ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈఐఎక్స్) కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో ట్రేడింగ్ సమయాలను రోజుకు 23 గంటల 30 నిమిషాలకు పొడిగించింది. సోమవారం నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకు దాదాపు 24 గంటల పాటు మార్కెట్లలో ట్రేడింగ్ చేసే అవకాశం కల్పించినట్లయింది.
సమయాలు ఇవే..
ఎన్ఎస్ఈ ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈఐఎక్స్) తన మార్కెట్ కార్యకలాపాలను విస్తరించింది. తాజాగా అమల్లోకి వచ్చిన ఈ విధానంలో ట్రేడింగ్ ఉదయం 3.15 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు తెల్లవారుజామున 2.45 గంటలకు ముగుస్తుంది. ఆసియా, యూరప్, అమెరికా మార్కెట్ల ట్రేడింగ్ సమయాలకు అనుగుణంగా పెట్టుబడిదారులు లావాదేవీలు నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ పరిణామాలకు వెంటనే స్పందించడంతోపాటు వివిధ టైమ్ జోన్లలో తమ పెట్టుబడులపై రిస్క్‌ను నిర్వహించుకునేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని ఎక్స్ఛేంజ్ వెల్లడించింది. గిఫ్ట్ సిటీని అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేయడంలో ఇది మరో కీలక అడుగుగా పేర్కొంది.
పెట్టుబడిదారులకు నిరంతర మార్కెట్..
ఈ కొత్త విధానం ద్వారా అంతర్జాతీయ పెట్టుబడిదారులకు నిరంతర మార్కెట్ అందుబాటులోకి రానుంది. ప్రపంచ మార్కెట్లతో భారత్‌కు ఉన్న ఆర్థిక అనుసంధానం మరింత బలోపేతం కానుంది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకునే పరిణామాలకు అనుగుణంగా పెట్టుబడిదారులు తమ ట్రేడింగ్ నిర్ణయాలను తీసుకునేందుకు ఎక్కువ సమయం లభించనుంది. సాంకేతికంగా కూడా ఎన్ఎస్ఈఐఎక్స్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రెండు ట్రేడింగ్ సెషన్ల మధ్య సిస్టమ్ నిర్వహణ, అప్‌డేట్లను కేవలం మూడు నిమిషాల్లో పూర్తి చేయగల సామర్థ్యం ఉందని వెల్లడించింది. రోజు ముగింపులో నిర్వహణ పనులకు కూడా 15 నిమిషాల కంటే తక్కువ సమయం పడుతుందని తెలిపింది.
అన్ని జోన్లలో మార్కెట్ అందుబాటులో..
ఈ సందర్భంగా ఎన్ఎస్ఈఐఎక్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ వి. బాలసుబ్రమణియం మాట్లాడుతూ, 23.5 గంటల ట్రేడింగ్ విధానం అంతర్జాతీయ స్థాయిలో అందుబాటులో ఉండే మార్కెట్ వ్యవస్థను నిర్మించాలనే లక్ష్యంలో కీలక మైలురాయని పేర్కొన్నారు. అన్ని టైమ్ జోన్లలో మార్కెట్ అందుబాటులో ఉండడం ద్వారా పెట్టుబడిదారులకు మరింత సౌలభ్యం కలుగుతుందని, ప్రపంచ ఆర్థిక మార్కెట్లతో గిఫ్ట్ సిటీ అనుసంధానం బలపడుతుందని తెలిపారు. పొడిగించిన ట్రేడింగ్ సమయాలకు అవసరమైన సాంకేతిక, నిర్వహణ ఏర్పాట్లను కూడా పూర్తి చేసినట్లు సంస్థ వెల్లడించింది. భవిష్యత్తులో అంతర్జాతీయ మార్కెట్ ప్రాప్యతను మరింత విస్తరించడం, ప్రపంచ పెట్టుబడిదారుల అవసరాలకు అనుగుణంగా పటిష్టమైన మార్కెట్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం కొనసాగిస్తామని ఎన్ఎస్ఈఐఎక్స్ స్పష్టం చేసింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●PM Modi | దేశంలోనే మొట్టమొదటి.. మహిళా ఆపరేటర్లతో నడిచే మెట్రో లైన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
- ●Radhika Apte | మొన్న జాన్వీ కపూర్... నేడు రాధిక ఆప్టే - టాలీవుడ్‌పై బాలీవుడ్ హీరోయిన్ విమర్శలు
- ●TRAI | టెలికాం వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఫిర్యాదులను పరిష్కరించకపోతే సంస్థలకు భారీ జరిమానాలు..
- ●Devireddy Sudheer Reddy | రేవంత్! ధరలు తగ్గించేందుకు ఏం చేస్తవో చెప్పు
- ●Supreme Court | ఢిల్లీ మార్కెట్లలో యథేచ్ఛగా టపాసుల అమ్మకాలు.. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
- ●Anurag Kashyap | చిక్కుల్లో చిరంజీవి "కాకా" విలన్ - వారెంట్ జారీ చేసిన కోర్టు

PM Modi | దేశంలోనే మొట్టమొదటి.. మహిళా ఆపరేటర్లతో నడిచే మెట్రో లైన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

Radhika Apte | మొన్న జాన్వీ కపూర్... నేడు రాధిక ఆప్టే - టాలీవుడ్‌పై బాలీవుడ్ హీరోయిన్ విమర్శలు

TRAI | టెలికాం వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఫిర్యాదులను పరిష్కరించకపోతే సంస్థలకు భారీ జరిమానాలు..

Devireddy Sudheer Reddy | రేవంత్! ధరలు తగ్గించేందుకు ఏం చేస్తవో చెప్పు






