త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | ఫెడ్ వ‌డ్డీ రేట్ల ఎఫెక్ట్‌.. భార‌త మార్కెట్ల‌లో బుల్ ర్యాలీ..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 905.01 పాయింట్లు పెరగ్గా, నిఫ్టీ 50 సూచీ 237.90 పాయింట్లు ఎగబాకింది. దీంతో బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ సుమారు రూ.4.72 లక్షల కోట్లు పెరిగింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడం మార్కెట్లకు మద్దతునిచ్చింది. అయితే, పెరుగుతున్న ముడి చమురు ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి.

S

Business | Published On Oct 29, 2026, 4.02 pm IST

Stock Markets | ఫెడ్ వ‌డ్డీ రేట్ల ఎఫెక్ట్‌.. భార‌త మార్కెట్ల‌లో బుల్ ర్యాలీ..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 905.01 పాయింట్లు పెరగ్గా, నిఫ్టీ 50 సూచీ 237.90 పాయింట్లు ఎగబాకింది. దీంతో బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ సుమారు రూ.4.72 లక్షల కోట్లు పెరిగింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడం మార్కెట్లకు మద్దతునిచ్చింది. అయితే, పెరుగుతున్న ముడి చమురు ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి.

సెన్సెక్స్ 900 పాయింట్లు జంప్‌..

గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 905.01 పాయింట్లు (1.24 శాతం) లాభపడి 74,151 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 50 సూచీ 237.90 పాయింట్లు (1.05 శాతం) పెరిగి 22,936.75 వద్ద ముగిసింది. దీంతో బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ రూ.4,72,033.20 కోట్లు (సుమారు రూ.4.72 లక్షల కోట్లు) పెరిగింది. దాదాపు అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. సెన్సెక్స్‌లో అదానీ పోర్ట్స్ అత్యధికంగా 5.17 శాతం లాభపడింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ 3.86 శాతం, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 3.70 శాతం, ఎటర్నల్ 3.46 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.56 శాతం పెరిగాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్ చెరో 2.43 శాతం, టైటాన్ 2.40 శాతం, ఎన్‌టీపీసీ 2.32 శాతం, భారత్ ఎలక్ట్రానిక్స్ 2.27 శాతం లాభపడ్డాయి. మరోవైపు ట్రెంట్ షేరు 1.44 శాతం నష్టపోయి సెన్సెక్స్‌లో అత్యధికంగా పడిపోయిన షేరుగా నిలిచింది. మారుతీ సుజుకీ 1 శాతం, టెక్ మహీంద్రా 0.20 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 0.13 శాతం నష్టపోయాయి.

రియాల్టీ సూచీ జోరు..

రంగాల వారీగా చూస్తే నిఫ్టీ రియాల్టీ సూచీ 2.75 శాతం, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ 2.34 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ 2.20 శాతం, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ 1.24 శాతం, నిఫ్టీ బ్యాంక్ 1.18 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.17 శాతం పెరిగాయి. నిఫ్టీ ఐటీ 0.99 శాతం, నిఫ్టీ మెటల్ 0.67 శాతం, నిఫ్టీ ఫార్మా 0.64 శాతం లాభాలను నమోదు చేశాయి. అయితే నిఫ్టీ ఆటో సూచీ 0.24 శాతం, నిఫ్టీ సిమెంట్ 0.08 శాతం నష్టపోయాయి. విస్తృత మార్కెట్లలోనూ కొనుగోళ్లు కొనసాగాయి. నిఫ్టీ నెక్స్ట్‌ 50 సూచీ 1.22 శాతం, నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100 సూచీ 0.99 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 100 సూచీ 0.95 శాతం పెరిగాయి. నిఫ్టీ 500 సూచీ కూడా 0.99 శాతం లాభపడింది.

భారీగా ప‌త‌న‌మైన చ‌మురు ధ‌ర‌లు..

అమెరికా ఫెడరల్ రిజర్వ్ అంచనాలకు అనుగుణంగా వడ్డీ రేట్లను 3.75-4 శాతం పరిధిలో యథాతథంగా కొనసాగించడం మార్కెట్ సెంటిమెంట్‌కు మద్దతునిచ్చింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల పెట్టుబడుల ప్రవాహం, రూపాయి మారకం విలువ, బాండ్ ఈల్డ్స్, షేర్ల విలువలు వంటి అంశాలను కూడా మదుపర్లు పరిశీలించారు. దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ) తగ్గింపులు ఉంటాయ‌న్న అంచనాలు కూడా మార్కెట్ వర్గాల్లో చర్చకు వచ్చాయి. అయితే, ముడి చమురు ధరలు అధిక స్థాయిలో కొనసాగడం దేశీయ మార్కెట్లకు ప్రధాన సవాలుగా మారింది. అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌లో ముడి చ‌మురు ధ‌ర‌లు గురువారం భారీగా ప‌త‌న‌మ‌య్యాయి. ఇది కూడా ఈక్విటీల ర్యాలీకి మ‌ద్ద‌తునిచ్చింది. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 0.27 శాతం త‌గ్గి బ్యారెల్‌కు 109 డాల‌ర్ల‌కు చేర‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 0.56 శాతం త‌గ్గి బ్యారెల్‌కు 102 డాల‌ర్ల‌కు వ‌చ్చింది. ఫారెక్స్ మార్కెట్‌లో భార‌త రూపాయి కాస్త బ‌ల‌హీన‌ప‌డింది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 95.25 వ‌ద్ద ఉన్న రూపాయి ఈ సెష‌న్‌లో 0.04 శాతం న‌ష్ట‌పోయింది.

Advertisement
Advertisement