NSE | ఎన్ఎస్ఈ నుంచి కొత్త డెరివేటివ్స్.. ఆగస్టు 12 నుంచి నిఫ్టీ ఇండియా ఎఫ్‌పీఐ 150 ఇండెక్స్‌పై ట్రేడింగ్..
NSE | నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ ఇండియా ఎఫ్‌పీఐ 150 ఇండెక్స్ (నిఫ్టీఎఫ్‌పీఐ)పై డెరివేటివ్స్‌ను ప్రారంభించేందుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నుంచి అనుమతి పొందింది. ఈ కాంట్రాక్టులను ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ఆగస్టు 12 నుంచి ప్రవేశపెట్టాలని ఎన్‌ఎస్‌ఈ లక్ష్యంగా నిర్ణయించుకుంది.
NSE | నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ ఇండియా ఎఫ్‌పీఐ 150 ఇండెక్స్ (నిఫ్టీఎఫ్‌పీఐ)పై డెరివేటివ్స్‌ను ప్రారంభించేందుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నుంచి అనుమతి పొందింది. ఈ కాంట్రాక్టులను ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ఆగస్టు 12 నుంచి ప్రవేశపెట్టాలని ఎన్‌ఎస్‌ఈ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఎక్స్చేంజ్ మూడు వరుస నెలల ఇండెక్స్ ఫ్యూచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్ కాంట్రాక్ట్ సైకిల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. నగదు ఆధారంగా సెటిల్ అయ్యే ఈ డెరివేటివ్స్ కాంట్రాక్టులు గడువు ముగిసే నెల చివరి మంగళవారం ఎక్స్‌పైరీ అవుతాయి. నిఫ్టీ ఇండియా ఎఫ్‌పీఐ 150 ఇండెక్స్ లక్ష్యం విదేశీ పెట్టుబడిదారులకు అందుబాటు, పెట్టుబడులకు అనుకూలంగా ఉండేలా నిఫ్టీ 500లోని టాప్ 150 షేర్ల పనితీరును ట్రాక్ చేయడమే. ఈ టాప్ 150 షేర్లను గత ఆరు నెలల సగటు విదేశీ పెట్టుబడులకు అర్హత కలిగిన ఫ్రీ-ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అధిక లిక్విడిటీ, ఎక్కువ ఫ్రీ-ఫ్లోట్ ఉన్న షేర్లకు ఇందులో ప్రాధాన్యం ఉంటుంది. ఇండెక్స్‌లో ప్రతి షేర్ వెయిటేజ్ ను కూడా విదేశీ పెట్టుబడులకు అర్హత కలిగిన ఫ్రీ-ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగానే నిర్ణయిస్తారు.
ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు అధిక వెయిటేజ్..
గత జూన్ నాటికి ఈ ఇండెక్స్‌లో అత్యధిక వెయిటేజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగానికి 26.15 శాతం ఉంది. ఆ తర్వాత ఆయిల్, గ్యాస్ అండ్ కన్స్యూమబుల్ ఫ్యూయల్స్ రంగానికి 10.03 శాతం, హెల్త్‌కేర్ రంగానికి 7.51 శాతం వెయిటేజ్ ఉంది. ఈ ఇండెక్స్‌ను 2025 ఆగస్టు 16న ప్రవేశపెట్టారు. దీని బేస్ డేట్ 2022 అక్టోబర్ 3 కాగా, బేస్ వ్యాల్యూను 1000గా నిర్ణయించారు. ఈ ఇండెక్స్ విధానం విదేశీ పెట్టుబడులకు అర్హత కలిగిన ఫ్రీ-ఫ్లోట్ ఆధారంగా ఉంటుంది. ప్రతి త్రైమాసికం రీబ్యాలెన్స్ చేస్తారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఈ చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ మాట్లాడుతూ నిఫ్టీ ఇండియా ఎఫ్‌పీఐ 150 ఇండెక్స్‌పై డెరివేటివ్స్ ను ప్రవేశపెట్టడం ద్వారా ప్రస్తుతం ఉన్న ఇండెక్స్ డెరివేటివ్స్ ఉత్పత్తుల శ్రేణి మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. నిఫ్టీ ఇండియా ఎఫ్‌పీఐ 150 ఇండెక్స్ భారత ఈక్విటీ మార్కెట్‌లలోని విస్తృతమైన, వైవిధ్యభరితమైన 150 లిక్విడ్ షేర్లకు ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. లిక్విడిటీ, పెట్టుబడులకు అనుకూలతపై దృష్టి కొనసాగిస్తూ హెడ్జింగ్, పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌కు ఇది అనువైన అండర్‌లైయింగ్‌గా ఉంటుందని తెలిపారు.
అనేక సేవలను అందిస్తున్న ఎన్ఎస్ఈ..
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌ఈ) 1994లో కార్యకలాపాలు ప్రారంభించించగా, దేశంలో తొలిసారిగా పూర్తిస్థాయి ఎలక్ట్రానిక్ లేదా స్క్రీన్ ఆధారిత ట్రేడింగ్‌ను అమలు చేసిన స్టాక్ ఎక్స్చేంజ్ గా కూడా పేరుగాంచింది. లిస్టింగ్స్, ట్రేడింగ్ సేవలు, క్లియరింగ్ అండ్ సెటిల్‌మెంట్ సేవలు, ఇండెక్స్‌లు, మార్కెట్‌కు సంబంధించిన సమగ్ర సేవలను అందించే సంస్థగా ఎన్‌ఎస్‌ఈ కొనసాగుతోంది.
సంబంధిత వార్తలు

Stock Markets | స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారుల్లో మొదలైన అమ్మకాల ఒత్తిడి..
జులై 15, 2026

Stock Markets | అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు..
జులై 13, 2026

Stock Markets | భారీ పతనం అనంతరం.. కాస్త కోలుకున్న స్టాక్ మార్కెట్లు, తగ్గిన చమురు ధరలు..
జులై 9, 2026
తాజావార్తలు
- ●Jagannath Rath Yatra | ఘనంగా జగన్నాథుడి రథయాత్ర.. భక్తులతో కిక్కిరిసిన పూరీ క్షేత్రం
- ●Prabhas Fauzi | అఫీషియల్ - ఫౌజీ రిలీజ్ డేట్ ఫిక్స్ - యుద్ధభూమిలో వీరుడిగా ప్రభాస్ - పోస్టర్ వైరల్
- ●IRCTC | ఐఆర్సీటీసీ కొత్త వెబ్సైట్ బీట్ వెర్షన్ లాంచ్.. ఫీడ్ బ్యాక్ కోరుతున్న రైల్వే మంత్రిత్వ శాఖ..
- ●Windfall Tax | యుద్ధ ప్రభావం.. డీజిల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ పన్ను పెంపు
- ●MLC Venkatram reddy | డ్రగ్స్ కొనుగోలుచేస్తూ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి కుమారుడు అరెస్ట్..
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. కొత్తగా పెట్టుబడి పెట్టేందుకు సమయమేనా..?

Jagannath Rath Yatra | ఘనంగా జగన్నాథుడి రథయాత్ర.. భక్తులతో కిక్కిరిసిన పూరీ క్షేత్రం

Prabhas Fauzi | అఫీషియల్ - ఫౌజీ రిలీజ్ డేట్ ఫిక్స్ - యుద్ధభూమిలో వీరుడిగా ప్రభాస్ - పోస్టర్ వైరల్

IRCTC | ఐఆర్సీటీసీ కొత్త వెబ్సైట్ బీట్ వెర్షన్ లాంచ్.. ఫీడ్ బ్యాక్ కోరుతున్న రైల్వే మంత్రిత్వ శాఖ..

Windfall Tax | యుద్ధ ప్రభావం.. డీజిల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ పన్ను పెంపు



