EGR | గోల్డ్‌లో కొత్త డిజిటల్ విప్లవం.. NSE EGRలతో పెట్టుబడిదారులకు భారీ లాభాల ఛాన్స్!
EGR | బంగారంపై భారతీయులకు ఉన్న ఆకర్షణతో పాటు, ఇది లాభదాయకమైన ఇన్వెస్ట్‌మెంట్ సాధనంగా మారుతున్న నేపథ్యంలో, పెట్టుబడిదారులకు మరింత పారదర్శకంగా, సురక్షితంగా, సులభంగా ఉండేలా నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (NSE) ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ (EGR)ను ప్రవేశపెట్టింది.
EGR | బంగారంపై భారతీయులకు ఉన్న ఆకర్షణతో పాటు, ఇది లాభదాయకమైన ఇన్వెస్ట్‌మెంట్ సాధనంగా మారుతున్న నేపథ్యంలో, పెట్టుబడిదారులకు మరింత పారదర్శకంగా, సురక్షితంగా, సులభంగా ఉండేలా నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (NSE) ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ (EGR)ను ప్రవేశపెట్టింది. కొత్త గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫార్మాట్‌గా వచ్చిన ఈ ఈజీఆర్‌లు ప్రస్తుతం అత్యంత సమర్థవంతమైన డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ సాధనంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. ఫిజికల్ గోల్డ్, ఇతర డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులతో పోలిస్తే కూడా ఈజీఆర్‌లు మరింత బలమైన పెట్టుబడి అవకాశంగా నిలుస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా చెప్పాలంటే, ఈజీఆర్‌లు అనేవి సెబీ గుర్తింపు పొందిన వాల్ట్‌లలో భద్రంగా నిల్వ ఉంచిన ఫిజికల్ గోల్డ్‌కు సంబంధించిన డీమ్యాటరైజ్డ్ రూపం. ప్రతి ఈజీఆర్‌కు సమానమైన ఫిజికల్ గోల్డ్ బ్యాకప్‌గా ఉంటుంది. ఈ రిసీట్స్‌ను ఎక్స్చేంజ్‌లో ట్రేడ్ చేయవచ్చు. దీంతో గోల్డ్‌ను అధికారిక ఫైనాన్షియల్ సిస్టమ్‌లో భాగంగా మార్చే అవకాశం కలుగుతుంది. ఎన్‌ఎస్‌ఈ టెక్నాలజీ, లిక్విడిటీ ఫ్రేమ్‌వర్క్ ఆధారంగా రూపొందిన ఈ ఇన్నోవేటివ్ సాధనం ద్వారా గోల్డ్‌ను డిజిటల్ రూపంలో హోల్డ్ చేయవచ్చు. అవసరమైతే డిజిటల్ నుంచి ఫిజికల్ గోల్డ్‌గా మార్చుకునే సౌకర్యం కూడా ఉంటుంది.
ఎన్‌ఎస్‌ఈ ఈజీఆర్‌ల ముఖ్య విశేషాలు..
డిజిటల్ ఫార్మాట్‌లో ఉన్నప్పటికీ ఎప్పుడైనా ఫిజికల్ గోల్డ్‌గా రిడీమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎక్స్చేంజ్ ట్రేడింగ్‌కు కూడా అందుబాటులో ఉంటుంది. దేశంలోని అతిపెద్ద ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌లలో ఒకటైన ఎన్‌ఎస్‌ఈ మద్దతు ఉండటంతో విశ్వసనీయత పెరుగుతుంది. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనే కమోడిటీ ఆధారిత ఆస్తిగా ఇది పనిచేస్తుంది. ప్రతి వర్గానికి చెందిన పెట్టుబడిదారులకు అందుబాటులో ఉండటం ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌కు దోహదం చేస్తుంది. భారీ పెట్టుబడి అవసరం లేకుండా చిన్న మొత్తాలతో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు.
ఇతర డిజిటల్ గోల్డ్ ఫార్మాట్‌లతో పోలిస్తే ఎలా ప్రత్యేకం?
ఈజీఆర్‌ల ద్వారా అనుభవజ్ఞులైన ట్రేడర్ల నుంచి కాలేజ్ స్టూడెంట్స్ వరకు, గృహిణుల నుంచి చిన్న పెట్టుబడిదారుల వరకు ప్రతి ఒక్కరూ ఎక్స్చేంజ్ ద్వారా డిజిటల్‌గా గోల్డ్ కొనుగోలు చేయవచ్చు. ప్రతి యూనిట్‌కు నిజమైన, సర్టిఫైడ్ ఫిజికల్ గోల్డ్ బ్యాకప్‌గా ఉంటుంది. ఈ గోల్డ్ సెబీ నియంత్రిత వాల్ట్‌లలో భద్రంగా నిల్వ ఉంటుంది. అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఇతర డిజిటల్ గోల్డ్ ఉత్పత్తుల మాదిరిగా కాకుండా, ఈజీఆర్ హోల్డర్లు ఎప్పుడైనా తమ రిసీట్స్‌ను రిడీమ్ చేసుకుని నిజమైన ఫిజికల్ గోల్డ్ డెలివరీ తీసుకునే అవకాశం పొందుతారు.

చిన్న పెట్టుబడిదారులకు కూడా భారీ అవకాశం..
పృథ్వీ ఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్ హెడ్ మనోజ్ జైన్ మాట్లాడుతూ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టడానికి ఎన్‌ఎస్‌ఈ ఈజీఆర్‌లు అత్యుత్తమ మార్గాల్లో ఒకటని తెలిపారు. కేవలం హెచ్‌ఎన్‌ఐలకే కాకుండా చిన్న పెట్టుబడిదారులకు కూడా ఇవి అనుకూలమని చెప్పారు. ఈజీఆర్‌లు 1 గ్రాము నుంచి 1 కిలో వరకు చిన్న డినామినేషన్‌లలోనూ అందుబాటులో ఉంటాయని, 995, 999 స్టాండర్డ్ ప్యూరిటీ ఆప్షన్‌లు కూడా ఉన్నాయని ఆయన వివరించారు. అలాగే గోల్డ్ ఈటీఎఫ్‌లు లేదా పేపర్ గోల్డ్‌లతో పోలిస్తే, ఈజీఆర్‌లలో ఫిజికల్ గోల్డ్ తీసుకునే అవకాశం ఉండటం ప్రధాన బలమని చెప్పారు. ఎలక్ట్రానిక్ గోల్డ్ సాధారణంగా రెగ్యులేటెడ్ కాకపోయినా, ఈజీఆర్‌లు మాత్రం సెబీ పరిధిలోకి వస్తాయని పేర్కొన్నారు.
టాక్సేషన్ ఎలా ఉంటుంది?
పెట్టుబడిదారులు ఈజీఆర్‌లను డీమ్యాట్ అకౌంట్‌లో 24 నెలలకుపైగా హోల్డ్ చేస్తే 12.5 శాతం పన్ను వర్తిస్తుంది. 24 నెలల కంటే తక్కువ కాలం హోల్డ్ చేస్తే సంబంధిత టాక్స్ స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారని మనోజ్ జైన్ తెలిపారు.
సెబీ హెచ్చరికల నేపథ్యంలో ఈజీఆర్‌లకు ప్రాధాన్యం..
పూణేకు చెందిన పర్సనల్ ఫైనాన్స్ నిపుణుడు కిరణ్ గాంధీ మాట్లాడుతూ యాప్ ఆధారిత అనేక డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులు గుర్తింపు పొందిన సెక్యూరిటీస్ కావని సెబీ ఇప్పటికే హెచ్చరించిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఈజీఆర్‌లు నిర్మాణాత్మకంగా మరింత బలమైన పెట్టుబడి సాధనంగా నిలుస్తాయని చెప్పారు. గోల్డ్ పెట్టుబడిదారులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత పారదర్శకమైన, నియంత్రిత, విశ్వసనీయమైన గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ రూపంగా ఈజీఆర్‌లు మారుతున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






