త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Stock Markets | దీపావళి బలిప్రతిపద.. నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. రేపు కొన‌సాగ‌నున్న ర్యాలీ..?

Indian Stock Markets | దీపావళి బలిప్రతిపద పర్వదినం సందర్భంగా మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో ఈక్విటీ, డెరివేటివ్స్ సహా అన్ని విభాగాల్లో ట్రేడింగ్ నిలిచిపోనుంది. బుధవారం నుంచి యథావిధిగా ట్రేడింగ్ ప్రారంభం కానుంది.

S

Business | Published On Nov 10, 2026, 9.52 am IST

Indian Stock Markets | దీపావళి బలిప్రతిపద.. నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. రేపు కొన‌సాగ‌నున్న ర్యాలీ..?
Advertisement

Indian Stock Markets | దీపావళి బలిప్రతిపద పర్వదినం సందర్భంగా మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో ఈక్విటీ, డెరివేటివ్స్ సహా అన్ని విభాగాల్లో ట్రేడింగ్ నిలిచిపోనుంది. బుధవారం నుంచి యథావిధిగా ట్రేడింగ్ ప్రారంభం కానుంది.

ఎంసీఎక్స్‌లో సాయంత్రం సెష‌న్‌..

దీపావళి బలిప్రతిపద సందర్భంగా మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మూతపడ్డాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)ల్లో ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్, సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్ (ఎస్ఎల్‌బీ), కరెన్సీ డెరివేటివ్స్ విభాగాల్లో ట్రేడింగ్ జరగదు. బుధవారం మార్కెట్లు తిరిగి ప్రారంభమవుతాయి. మరోవైపు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రేడింగ్ నిలిచిపోనుంది. అయితే సాయంత్రం సెషన్‌లో 5 గంటల నుంచి రాత్రి 11.55 గంటల వరకు, సంబంధిత కమోడిటీని బట్టి ట్రేడింగ్ కొనసాగుతుంది. 2026లో స్టాక్ మార్కెట్లకు మరో రెండు సెలవులు మిగిలి ఉన్నాయి. నవంబర్ 24న ప్రకాశ్ గురుపురబ్ శ్రీ గురునానక్ దేవ్ జయంతి సందర్భంగా, డిసెంబర్ 25న క్రిస్మస్ పర్వదినం సందర్భంగా మార్కెట్లకు సెలవు ఉంటుంది. ఈ రెండు రోజులకు మరుసటి పని దినం నుంచి సాధారణ ట్రేడింగ్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయి.

గ‌త సెష‌న్‌లో లాభాలు..

ఇక గత ట్రేడింగ్ సెషన్ లో దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 107.25 పాయింట్లు (0.13 శాతం) పెరిగి 81,106.65 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 81,339.41 గరిష్ఠ స్థాయిని, 80,519.31 కనిష్ఠ స్థాయిని తాకింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా 58.25 పాయింట్లు (0.23 శాతం) లాభపడి 25,044.65 వద్ద ముగిసింది. రంగాల వారీగా నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ 3.73 శాతం లాభంతో అగ్రస్థానంలో నిలిచింది. నిఫ్టీ మిడ్‌స్మాల్ హెల్త్‌కేర్ 1.71 శాతం, నిఫ్టీ ఫార్మా 1.65 శాతం, నిఫ్టీ హెల్త్‌కేర్ 1.33 శాతం, నిఫ్టీ 500 హెల్త్‌కేర్ 1.30 శాతం పెరిగాయి. మరోవైపు నిఫ్టీ సిమెంట్ 1.42 శాతం, నిఫ్టీ ఐటీ 1.22 శాతం నష్టపోయాయి.

బుధ‌వారం మార్కెట్ల‌లో ర్యాలీ..?

దేశీయ స్టాక్ మార్కెట్ల‌కు మంగ‌ళ‌వారం సెల‌వు ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ విదేశీ నిఫ్టీ సూచీ గిఫ్ట్ నిఫ్టీ మాత్రం లాభాల్లో ట్రేడ‌వుతోంది. అయితే ఈ సూచీ గ‌త సెష‌న్‌తో పోలిస్తే ఇప్ప‌టికే 190 పాయింట్ల లాభంలో కొన‌సాగుతోంది. దీంతో బుధ‌వారం దేశీయ స్టాక్ మార్కెట్ల‌లో ర్యాలీ కొన‌సాగుతుంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. మార్కెట్లు గ్యాప్ అప్ ఓపెనింగ్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంటున్నారు. అయితే ఇవాళ్టి సెష‌న్‌లో గిఫ్ట్ నిఫ్టీ ఏ స్థాయిలో ముగ‌స్తుంద‌న్న విష‌యం కీల‌కంగా మారింది. గ‌రిష్ట స్థాయిలో ముగిస్తే బుధ‌వారం మార్కెట్ల‌లో ర్యాలీ ఉంటుంద‌ని చెబుతున్నారు. కాగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఏఐ ఆధారిత కంపెనీలు, చిప్ కంపెనీల షేర్ల‌లో న‌మోద‌వుతున్న ప‌త‌నాలు భార‌త మార్కెట్ల‌కు మేలు చేస్తున్నాయ‌ని, మ‌రోవైపు ప‌శ్చిమ ఆసియాలో యుద్ధం ముగిసే ప‌రిస్థితులు ఏర్ప‌డ‌డం, హోర్ముజ్ జ‌ల‌సంధిని తిరిగి తెరిచే ప్ర‌య‌త్నాలు వేగ‌వంతం అవ‌డం, ముడి చ‌మురు ధ‌ర‌లు త‌గ్గుతుండ‌డం అన్నీ భార‌త మార్కెట్ల‌కు క‌ల‌సి వ‌చ్చే అంశాలుగా పేర్కొంటున్నారు. అయితే ఈ వారంలో మార్కెట్లు ఎలా ముగుస్తాయ‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Advertisement
Advertisement