iPhone 17 | మదర్ప్ డే సందర్భంగా యాపిల్ సేల్.. ఐఫోన్ 17 ధర భారీగా తగ్గింపు..
iPhone 17 | మదర్స్ డే సందర్భంగా ప్రముఖ రిటెయిల్ చెయిన్ స్టోర్స్ క్రోమా ఐఫోన్ 17ను భారీ తగ్గింపు ధరకే అందిస్తోంది. ఎవ్రీథింగ్ యాపిల్ సేల్ పేరిట ఓ ప్రత్యేకమైన సేల్‌ను ప్రారంభించిన క్రోమా అందులో భాగంగా ఈ ఆఫర్‌ను అందిస్తోంది.
iPhone 17 | మదర్స్ డే సందర్భంగా ప్రముఖ రిటెయిల్ చెయిన్ స్టోర్స్ క్రోమా ఐఫోన్ 17ను భారీ తగ్గింపు ధరకే అందిస్తోంది. ఎవ్రీథింగ్ యాపిల్ సేల్ పేరిట ఓ ప్రత్యేకమైన సేల్‌ను ప్రారంభించిన క్రోమా అందులో భాగంగా ఈ ఆఫర్‌ను అందిస్తోంది. మే 16వ తేదీ వరకు కొనసాగనున్న ఈ సేల్‌లో భాగంగా వినియోగదారులు క్రోమాకు చెందిన ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ఆ ఐఫోన్‌ను కొనుగోలు చేసి ఆఫర్ ను పొందవచ్చు. అలాగే పలు ఇతర ఐఫోన్లు, మాక్‌బుక్స్, ఐప్యాడ్స్, ఎయిర్‌పాడ్స్, యాపిల్ వాచ్‌లపై కూడా క్రోమా స్టోర్ డిస్కౌంట్లను అందిస్తోంది.
ఐఫోన్ 17ను ఇలా కొనండి..
ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్ 17కి చెందిన 256జీబీ మోడల్‌ను భారీ తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.82,900గా ఉంది. వివిధ ఆఫర్ల అనంతరం ఈ ఫోన్ రూ.48,742కి లభిస్తోంది. ఫోన్ ధర రూ.82,900కు గాను ఏదైనా పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే గరిష్టంగా రూ.23,500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే రూ.8వేల వరకు అదనపు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను ఇస్తున్నారు. కూపన్ డిస్కౌంట్ మరో రూ.1658 లభిస్తుంది. బ్యాంకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ద్వారా రూ.1వేయి వరకు పొందవచ్చు. దీంతో ఫోన్ ధర భారీగా తగ్గి రూ.50వేలకు దిగువకు వస్తుంది. అయితే మీ పాత ఫోన్ కండిషన్‌ను బట్టి ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది.
పాత ఐఫోన్ మోడల్స్‌పై కూడా..
ఈ సేల్‌లు పలు పాత ఐఫోన్ మోడల్స్‌ను కూడా వినియోగదారులు తగ్గింపు ధరలకే కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 16కి చెందిన 128జీబీ మోడల్‌ను తగ్గింపు అనంతరం రూ.43,490కి కొనవచ్చు. అలాగే ఐఫోన్ 15కు చెందిన 128జీబీ మోడల్‌ను రూ.39,990కి కొనుగోలు చేయవచ్చు. ఎక్స్‌ఛేంజ్, బ్యాంకు ఆఫర్లు, ఇతర కూపన్లతో ఫోన్ల ధరలు భారీగా తగ్గుతాయి. మాక్‌బుక్ నియోపై కూడా ఈ సేల్‌లో భాగంగా ఆఫర్‌ను ఇస్తున్నారు. దీంతో తగ్గింపు అనంతం ఈ ల్యాప్ టాప్‌ను రూ.39,410కే కొనుగోలు చేయవచ్చు. ఈ తగ్గింపులో 10 శాతం స్టూడెంట్ లేదా టీచర్ డిస్కౌంట్, రూ.7వేల వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ.4వేల వరకు బ్యాంక్ క్యాష్ బ్యాక్, పాత డివైస్‌పై రూ.12,500 వరకు ఎక్స్‌ఛేంజ్ విలువ వంటి ఆఫర్లు ఉన్నాయి.
మాక్‌బుక్ ఎయిర్‌పై..
ఈ సేల్‌లో మాక్‌బుక్ ఎయిర్ ఎం5 (13 ఇంచ్) ని కూడా తగ్గింపు ధరకు పొందవచ్చు. ఈ డివైస్ అసలు ధర రూ.1,19,900 ఉండగా, తగ్గింపు అనంతరం సేల్‌లో రూ.75,910కి తీసుకోవచ్చు. ఇందులో 10 శాతం స్టూడెంట్ లేదా టీచర్ డిస్కౌంట్, రూ.15వేల వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ.21వేల వరకు పాత డివైస్‌పై ఎక్స్‌ఛేంజ్ విలువ, రూ.7వేల వరకు క్యాష్ బ్యాక్ వంటి ఆఫర్లను ఇస్తున్నారు. అందువల్ల యాపిల్ డివైస్‌లను కొనాలని చూస్తున్న వినియోగదారులకు ఇది సదవకాశంగా చెప్పవచ్చు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Saroornagar Yuva Sangrama Sadassu | సరూర్‌నగర్ యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
- ●Stock Markets | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల జోరు..
- ●Madhya Pradesh High Court | అందరికీ తెలిసేలా.. రిలేషన్ షిప్లో ఉన్నారు.. రేప్ కేసు కుదరదు
- ●Employees Health Scheme | 'ఈహెచ్ఎస్' పథకం ప్రారంభం.. ప్రతి జిల్లాలో వెల్నెస్ సెంటర్
- ●Women's Hockey WC | మహిళల హాకీ ప్రపంచకప్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా సలీమా టెటే
- ●CBDT | విదేశీ ఆస్తుల వివరాలు ఇక ఏఐఎస్‌లో.. ఐటీఆర్ ఫైలింగ్‌కు సీబీడీటీ కొత్త సౌకర్యం..

Saroornagar Yuva Sangrama Sadassu | సరూర్‌నగర్ యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

Stock Markets | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల జోరు..

Madhya Pradesh High Court | అందరికీ తెలిసేలా.. రిలేషన్ షిప్లో ఉన్నారు.. రేప్ కేసు కుదరదు

Employees Health Scheme | 'ఈహెచ్ఎస్' పథకం ప్రారంభం.. ప్రతి జిల్లాలో వెల్నెస్ సెంటర్






