త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PhonePe | ఇక ఫోన్‌పేలో యూపీఐ పిన్ లేకుండా పేమెంట్స్ చేయ‌వ‌చ్చు..!

PhonePe | ప్ర‌ముఖ డిజిట‌ల్ చెల్లింపుల యాప్ ఫోన్‌పే (PhonePe) మ‌రో కీల‌క ఫీచ‌ర్‌ను నూత‌నంగా త‌న వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి తెచ్చింది. ఇక‌పై యూజ‌ర్లు ఫోన్‌పే యాప్‌లో బ‌యోమెట్రిక్ ఆథెంటికేష‌న్ ద్వారా చెల్లింపులు చేయ‌వ‌చ్చు.

S

Technology | Published On Feb 20, 2026, 7.26 am IST

PhonePe | ఇక ఫోన్‌పేలో యూపీఐ పిన్ లేకుండా పేమెంట్స్ చేయ‌వ‌చ్చు..!
Advertisement

PhonePe | ప్ర‌ముఖ డిజిట‌ల్ చెల్లింపుల యాప్ ఫోన్‌పే (PhonePe) మ‌రో కీల‌క ఫీచ‌ర్‌ను నూత‌నంగా త‌న వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి తెచ్చింది. ఇక‌పై యూజ‌ర్లు ఫోన్‌పే యాప్‌లో బ‌యోమెట్రిక్ ఆథెంటికేష‌న్ ద్వారా చెల్లింపులు చేయ‌వ‌చ్చు. ఫోన్‌లో డిఫాల్ట్ గా ఉండే ఫింగ‌ర్ ప్రింట్ లేదా ఫేషియ‌ల్ రికగ్నిష‌న్ వంటి సెక్యూరిటీ ఆథెంటికేష‌న్‌ల‌ను ఉప‌యోగించుకుని పేమెంట్లు కొన‌సాగించ‌వ‌చ్చు. త‌ర‌చూ పిన్ ఎంట‌ర్ చేయ‌కుండా ఫోన్ లోని ఆయా ఆథెంటికేష‌న్ ప‌ద్ధ‌తుల ద్వారా పేమెంట్ల‌ను ధ్రువీక‌రిస్తే చాలు, వెంట‌నే చెల్లింపులు జ‌రిగిపోతాయి. డిజిట‌ల్ చెల్లింపులను మ‌రింత సుర‌క్షితంగా, సుల‌భంగా అందించాల‌నే ఉద్దేశంతో ఫోన్ పే ఈ ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చిన‌ట్లు వివ‌రించింది. ఈ ఫీచ‌ర్ వ‌ల్ల వినియోగ‌దారులు మాటి మాటికీ యూపీఐ పిన్‌ను ఎంట‌ర్ చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.

రూ.5వేల వ‌ర‌కే..

బ‌యోమెట్రిక్ ఆథెంటికేష‌న్ ద్వారా చేసే చెల్లింపుల ప‌రిమితిని ప్ర‌స్తుతానికి రూ.5వేల వ‌ర‌కు మాత్ర‌మే అందిస్తున్నారు. ఆ లోపు విలువైన ఏ పేమెంట్‌ను అయినా స‌రే ఇక‌పై వినియోగ‌దారులు యూపీఐ పిన్ లేకుండా నేరుగా బ‌యోమెట్రిక్ ఆథెంటికేష‌న్ ద్వారానే చేయ‌వ‌చ్చు. అయితే వెలుతురు త‌క్కువ‌గా ఉండ‌డం, కెమెరా సెన్సార్ స‌మ‌స్యలు, ఫింగ‌ర్ ప్రింట్ స‌రిగ్గా పనిచేయ‌క‌పోవ‌డం వంటి సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదురైతే బ‌యోమెట్రిక్ ఆథెంటికేష‌న్ ప‌నిచేయ‌దు. ఆ స‌మ‌యంలో వినియోగ‌దారులు పాత ప‌ద్ధ‌తిలోనే యూపీఐ పిన్ ద్వారా చెల్లింపులు చేయ‌వ‌చ్చు. ఇలా ఈ సౌక‌ర్యానికి మెరుగులు దిద్ది అందిస్తున్నారు.

సుర‌క్షితంగా చెల్లింపులు..

బ‌హిరంగ ప్ర‌దేశాల్లో వినియోగ‌దారులు చెల్లింపులు జ‌రిపే స‌మ‌యంలో యూపీఐ పిన్‌ను ఎంట‌ర్ చేస్తే ప‌క్క‌న ఎవ‌రైనా ఉండి చూసేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని, కానీ కొత్త విధానం వ‌ల్ల యూపీఐ పిన్ ఎవ‌రికీ తెలియ‌కుండా సుర‌క్షితంగా చెల్లింపులు చేయ‌వ‌చ్చ‌ని ఫోన్‌పే తెలిపింది. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో సాధార‌ణంగా వినియోగ‌దారుల‌కు ఎదుర‌య్యే షోల్డ‌ర్ స‌ర్ఫింగ్‌, పిన్ లీక్ ప్ర‌మాదం వంటి సంఘ‌ట‌న‌ల‌ను త‌ప్పించేందుకు ఈ ఫీచ‌ర్ ప‌నిచేస్తుంద‌ని ఫోన్‌పే వెల్ల‌డించింది. ఇక ఈ ఫీచ‌ర్ ప్ర‌స్తుతం ఆండ్రాయిడ్‌ను వాడే ఫోన్‌పే వినియోగ‌దారుల‌కు మాత్ర‌మే అందుబాటులోకి రాగా దీన్ని త్వ‌ర‌లోనే ఐఓఎస్ ఫోన్‌పే యూజ‌ర్ల‌కు సైతం అందుబాటులోకి తేనున్నారు.

ఇలా సెట్ చేయాలి..

ఈ ఫీచ‌ర్‌ను ఆండ్రాయిడ్ వినియోగ‌దారులు పొందాలంటే ఫోన్ పే యాప్‌ను ఓపెన్ చేసి ముందుగా ప్రొఫైల్‌పై ట‌చ్ చేసి ఓపెన్ చేయాలి. అందులో మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్ష‌న్‌ను ఎంపిక చేసుకోవాలి. దాంట్లో బ‌యో మెట్రిక్ పే ఐకాన్ పై ట్యాప్ చేయాలి. త‌రువాత ఏ బ్యాంకుకు ఈ స‌దుపాయం కావాలో ఎంచుకుని బ‌యోమెట్రిక్ ఆథెంటికేష‌న్‌ను యూపీఐ పేమెంట్స్‌కు ఎనేబుల్ చేయాలి. చివ‌రగా యూపీఐ పిన్‌ను ఎంట‌ర్ చేసి ఒక‌సారి బ‌యోమెట్రిక్ ఆథెంటికేష‌న్ ఇవ్వాలి. దీంతో ఈ ఆథెంటికేష‌న్ ఎనేబుల్ అవుతుంది. ఆ త‌రువాత రూ.5వేల లోపు చేసే పేమెంట్ల‌ను యూపీఐ పిన్ లేకుండానే నేరుగా పూర్తి చేయ‌వ‌చ్చు.

Advertisement
Advertisement