Bharat Pe | బ్యాంకు ఖాతాలో డబ్బు లేకున్నా యూపీఐ ద్వారా చెల్లింపులు.. భారత్‌పే ఫ్లెక్స్‌తో కొత్త సౌకర్యం..
Bharat Pe | భారత్‌లో ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ భారత్ పే తన వినియోగదారుల కోసం ప్రత్యేక సేవను ప్రారంభించింది. సంస్థ యెస్ బ్యాంకుతో భాగస్వామ్యం కుదుర్చుకుని భారత్‌పే ఫ్లెక్స్ (BharatPe Flex)ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Bharat Pe | భారత్‌లో ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ భారత్ పే తన వినియోగదారుల కోసం ప్రత్యేక సేవను ప్రారంభించింది. సంస్థ యెస్ బ్యాంకుతో భాగస్వామ్యం కుదుర్చుకుని భారత్‌పే ఫ్లెక్స్ (BharatPe Flex)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది క్రెడిట్-ఆన్-యూపీఐ (Credit-on-UPI) సేవ. దీని ద్వారా వినియోగదారులు తమ రోజువారీ చెల్లింపులను యూపీఐ ద్వారా క్రెడిట్ సహాయంతో చేయవచ్చు. బ్యాంక్ ఖాతాలో డబ్బు లేకపోయినా ఈ సేవ ద్వారా ఆన్‌లైన్ షాపింగ్, విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు, మొబైల్ రీచార్జ్‌లు వంటి చెల్లింపులను సులభంగా పూర్తి చేయవచ్చు. అలాగే దుకాణాల్లో క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా చెల్లింపులు చేయడం సాధ్యమవుతుంది. సాధారణంగా చెప్పాలంటే, ఇది మీ యూపీఐ యాప్‌లోనే అందుబాటులో ఉండే ఒక క్రెడిట్ కార్డు లేదా డిజిటల్ లోన్ సదుపాయం లాంటిది. దీనికోసం కొత్త యాప్‌ను డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే చెల్లింపు విధానాన్ని కూడా మార్చాల్సిన అవసరం ఉండదు.
క్రెడిట్ లిమిట్ నుంచి చెల్లింపులు..
ఇప్పటివరకు యూపీఐ ద్వారా ఎలా చెల్లింపులు చేసేవారో అలాగే కొనసాగించవచ్చు. అయితే డబ్బు మీ బ్యాంక్ ఖాతా నుంచి కాకుండా మీకు మంజూరైన క్రెడిట్ లిమిట్ నుంచి డెబిట్ అవుతుంది. వినియోగదారుల సౌకర్యం, బడ్జెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సేవను రూపొందించారు. ఇందులో పలు ముఖ్యమైన ఫీచర్లను అందిస్తున్నారు. భారత్‌పే ఫ్లెక్స్ ద్వారా చేసిన ఖర్చులను తిరిగి చెల్లించడానికి 45 రోజుల వరకు గడువు ఉంటుంది. ఈ వ్యవధిలో ఎలాంటి వడ్డీ వసూలు చేయరు. మొత్తం బకాయిని ఒకేసారి చెల్లించలేని పరిస్థితిలో, ఖర్చులను చిన్న చిన్న ఈఎంఐలుగా మార్చుకుని సులభంగా చెల్లించవచ్చు. ఎలాంటి పేపర్‌వర్క్ అవసరం లేదు. మొత్తం ప్రక్రియ డిజిటల్ విధానంలో జరుగుతుంది. అర్హత కలిగిన వినియోగదారులకు కేవలం 3 నిమిషాల్లోనే ఆమోదం లభిస్తుంది. వినియోగదారులు తమ ఖర్చులు, మిగిలిన క్రెడిట్ లిమిట్, రీపేమెంట్ వివరాలను నేరుగా భారత్‌పే యాప్‌లో చూడవచ్చు. అర్హత కలిగిన ప్రతి చెల్లింపుపై రివార్డ్స్ కూడా పొందవచ్చు.
మరింత సులభంగా ఖర్చుల నిర్వహణ..
ఈ సేవ ప్రారంభ సందర్భంగా భారత్‌పే సీఈఓ నళిన్ నెగి మాట్లాడుతూ యూపీఐ భారత్‌లో లావాదేవీల విధానాన్ని పూర్తిగా మార్చేసిందన్నారు. ఇప్పుడు వినియోగదారులు తమ రోజువారీ ఖర్చులను మరింత సౌకర్యవంతంగా నిర్వహించుకునేందుకు అదనపు నియంత్రణ, ఫ్లెక్సిబిలిటీ అవసరమని, ఆ అవసరాన్ని భారత్‌పే ఫ్లెక్స్ తీరుస్తుందని చెప్పారు. యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ కంట్రీ హెడ్ అనిల్ సింగ్ మాట్లాడుతూ, డిజిటల్ చెల్లింపుల రంగంలో తమ బ్యాంక్ ఎప్పుడూ ముందంజలో ఉంటుందని తెలిపారు. భారత్‌పేతో ఈ భాగస్వామ్యం ద్వారా వినియోగదారులకు మరింత మెరుగైన క్రెడిట్-ఆన్-యూపీఐ అనుభవం లభిస్తుందని, నగదు ప్రవాహాన్ని సమర్థంగా నిర్వహించుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ సేవ ప్రారంభానికి అనుగుణంగా సంస్థ పే నౌ, సెటిల్ లేటర్ అనే థీమ్‌తో కొత్త ప్రకటనను కూడా విడుదల చేసింది.
ఈ సేవను ఉపయోగించాలనుకునే వారు ఈ 5 సులభమైన దశలను అనుసరించాలి. మీ ఫోన్‌లో భారత్‌పే యాప్‌ను ఓపెన్ చేసి భారత్‌పే ఫ్లెక్స్ ఆప్షన్‌పై ట్యాప్ చేయండి. పూర్తి డిజిటల్ ఆన్‌బోర్డింగ్, కేవైసీ ప్రక్రియను పూర్తి చేయండి. ఆమోదం పొందిన మీ క్రెడిట్ లైన్ (లోన్ లిమిట్)ను యూపీఐతో లింక్ చేయండి. యూపీఐ పిన్‌ను సెట్ చేయండి. అనంతరం ఏ యూపీఐ వ్యాపారి లేదా దుకాణంలోనైనా చెల్లింపులు చేయవచ్చు.
సంబంధిత వార్తలు

Flipkart Pay Later | అకౌంట్లో డబ్బులు లేకున్నా ఫ్లిప్‌కార్ట్‌లో వస్తువులను కొనవచ్చు.. పే లేటర్ సర్వీస్ లాంచ్..
జులై 30, 2026

PhonePe | ఫోన్‌పే యూజర్లకు షాక్.. వాలెట్ వాడకపోతే రూ.100 చార్జీలు కట్టాల్సిందే..
జూన్ 20, 2026

BHIM App | భీమ్ యాప్‌లో కొత్త ఫీచర్.. పిన్ లేకుండానే పేమెంట్స్ చేసుకోవచ్చు
మార్చి 24, 2026
తాజావార్తలు
- ●Ramayana | రామాయణలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు - సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ
- ●criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా
- ●Sanjay Jaju | పేరు సంజయ్ జాజు.. రాష్ట్రానికే సీఎస్.. అయినా అధికారిక నివాసం ఇస్తలేరట
- ●Tollywood | మణిరత్నం, రామ్‌గోపాల్ వర్మ కలిసి కథను అందించిన ఒకే ఒక తెలుగు మూవీ ఏదో తెలుసా?
- ●Vaddiraju Ravichandra | పరీక్ష అంటే ఏండ్ల కష్టం.. అందుకే ప్రజా పరీక్షల సవరణ బిల్లుకు మద్దతిస్తున్నం
- ●KTR | యువ ఇంజినీర్ల ప్రతిభను క్రిమినల్ వేస్ట్ అని అవమానిస్తారా..? : రేవంత్‌పై కేటీఆర్ ఫైర్

Ramayana | రామాయణలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు - సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ

criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా

Sanjay Jaju | పేరు సంజయ్ జాజు.. రాష్ట్రానికే సీఎస్.. అయినా అధికారిక నివాసం ఇస్తలేరట

Tollywood | మణిరత్నం, రామ్‌గోపాల్ వర్మ కలిసి కథను అందించిన ఒకే ఒక తెలుగు మూవీ ఏదో తెలుసా?



