త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | సెన్సెక్స్ 2,000 పాయింట్లు జంప్.. 24,500 దాటిన నిఫ్టీ.. స్టాక్ మార్కెట్ల‌లో భారీ లాభాలు..

Stock Markets | అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల విజయాలు, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం భారత స్టాక్ మార్కెట్లకు ఊతమిచ్చాయి. దీంతో గురువారం దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 2,008.61 పాయింట్లు పెరగ్గా, నిఫ్టీ 576 పాయింట్లు లాభపడి 24,536.60 వద్ద స్థిరపడింది.

S

Business | Published On Nov 5, 2026, 3.52 pm IST

Stock Markets | సెన్సెక్స్ 2,000 పాయింట్లు జంప్.. 24,500 దాటిన నిఫ్టీ.. స్టాక్ మార్కెట్ల‌లో భారీ లాభాలు..
Advertisement

Stock Markets | అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల విజయాలు, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం భారత స్టాక్ మార్కెట్లకు ఊతమిచ్చాయి. దీంతో గురువారం దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 2,008.61 పాయింట్లు పెరగ్గా, నిఫ్టీ 576 పాయింట్లు లాభపడి 24,536.60 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లకు వచ్చిన విజయాలు, ముడి చమురు ధరలు తగ్గడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయి. గత ట్రేడింగ్ సెషన్‌లో సెన్సెక్స్ 77,301.40 వద్ద, నిఫ్టీ 23,960.60 వద్ద ముగిసిన విషయం తెలిసిందే.

బ్యాంకింగ్‌, ఐటీ షేర్ల ర్యాలీ..

షేర్ల వారీగా చూస్తే బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, మారుతీ సుజుకి, ఐసీఐసీఐ బ్యాంక్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. అపోలో హాస్పిటల్స్, ఓఎన్‌జీసీ, ఎన్టీపీసీ, భారత్ ఎలక్ట్రానిక్స్, కోల్ ఇండియా నష్టాలను నమోదు చేశాయి. రంగాల వారీగా చూస్తే ఎనర్జీ 0.5 శాతం, మీడియా 0.8 శాతం నష్టపోగా, మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. ఆటో, పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్ సూచీలు దాదాపు 3 శాతం చొప్పున పెరిగాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ రంగాలు 2 శాతానికి పైగా లాభపడ్డాయి.

మిడ్‌క్యాప్ సూచీ 1.8 శాతం పెరగ్గా, స్మాల్‌క్యాప్ సూచీ 0.6 శాతం లాభపడింది. మరోవైపు మార్కెట్ ఒడిదుడుకులకు సూచిక అయిన ఇండియా విక్స్ 2.83 శాతం పెరిగి 15.62కు చేరింది. కరెన్సీ మార్కెట్లో భారత రూపాయి స్వల్పంగా బలపడింది. గురువారం డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.94.47గా నమోదైంది. గత సెషన్‌లో ఇది రూ.94.64గా ఉంది.

Advertisement
Advertisement