త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Suresh Gopi | పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పట్లో తగ్గవు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన..

Suresh Gopi | దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించడం సాధ్యం కాదని కేంద్ర మంత్రి సురేష్ గోపి స్పష్టం చేశారు. చమురు కంపెనీలు ఇప్పటికే రూ.42వేల కోట్ల నష్టాలను ఎదుర్కొన్నాయని, ఆ నష్టాలను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. పెట్రోల్‌పై పన్నులను తగ్గించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు కొంత ఉపశమనం కల్పించవచ్చని సూచించారు.

S

Business | Published On Nov 16, 2026, 7.17 pm IST

Suresh Gopi | పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పట్లో తగ్గవు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన..
Advertisement

Suresh Gopi | దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించడం సాధ్యం కాదని కేంద్ర మంత్రి సురేష్ గోపి స్పష్టం చేశారు. చమురు కంపెనీలు ఇప్పటికే రూ.42వేల కోట్ల నష్టాలను ఎదుర్కొన్నాయని, ఆ నష్టాలను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. పెట్రోల్‌పై పన్నులను తగ్గించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు కొంత ఉపశమనం కల్పించవచ్చని సూచించారు.

పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను త‌గ్గించ‌లేం..

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్ర మంత్రి సురేష్ గోపి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంధన ధరలను వెంటనే తగ్గించడం సాంకేతికంగా సాధ్యం కాదని స్పష్టం చేశారు. చమురు కంపెనీలు ఇప్పటికే రూ.42వేల కోట్ల నష్టాలను చవిచూశాయని, ధరలు తగ్గించాలంటే ముందుగా ఈ నష్టాలను భర్తీ చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. సోమ‌వారం మీనంబాక్కం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజలు మరుసటి రోజే ఇంధన ధరలు తగ్గాలని కోరుకుంటార‌ని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని పేర్కొన్నారు. పెట్రోల్‌పై పన్నులను తగ్గించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగదారులకు కొంత ఉపశమనం కల్పించవచ్చని సూచించారు. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఇంధన ధరలు పెరిగాయని, అయితే తమిళనాడులో ధరల పెరుగుదలకు కారణం ఏమిటో తనకు తెలియదని వ్యాఖ్యానించారు.

ఉత్ప‌త్తుల స‌ర‌ఫ‌రాలోనూ స‌మ‌స్య‌లు..

మరోవైపు దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాలోనూ సమస్యలు ఉన్నాయని సురేష్ గోపి తెలిపారు. ఇంధన ఉత్పత్తుల సరఫరాలో గందరగోళం నెలకొందని, సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఈ సరఫరా సమస్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా ఇథనాల్ రంగంలో సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి ఎం.బి. పాటిల్ ఆరోపించారు. తగిన కొనుగోళ్లకు హామీ ఇవ్వకుండా ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాలను పెంచారని విమర్శించారు. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న ఇథనాల్‌లో 20 నుంచి 30 శాతం కొనుగోలు చేయడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆరోపిస్తూ, బ్లెండింగ్ కార్యక్రమంలో జరిగినట్లు భావిస్తున్న అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement