Kavitha | రేట్ల విషయంలో పట్టిపీడిస్తున్న అగ్రిగేటర్లు.. ప్రభుత్వం గిగ్ వర్కర్స్ పక్షాన నిలబడాలి: కవిత
Kavitha | ఉబర్, ఓలా, ర్యాపిడో నడిపేవారికి అగ్రిగేటర్లు సరైన ధర ఇవ్వడంలేదని, స్విగ్గీ, జొమాటో వంటి సంస్థలూ డెలివరీ బాయ్స్‌ను పట్టి పీడిస్తున్నాయని తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కవిత (Kavitha) అన్నారు.
Kavitha | త్రినేత్ర.న్యూస్: ఉబర్, ఓలా, ర్యాపిడో నడిపేవారికి అగ్రిగేటర్లు సరైన ధర ఇవ్వడంలేదని, స్విగ్గీ, జొమాటో వంటి సంస్థలూ డెలివరీ బాయ్స్‌ను పట్టి పీడిస్తున్నాయని తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కవిత (Kavitha) అన్నారు. గిగ్ వర్కర్లు (Gig Workers) రోజంతా కష్టపడినా వారి ఆదాయం కుటుంబ పోషణకు కూడా సరిపోవడం లేదని, మూడేండ్లుగా రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిగేటర్ సంస్థలు వారికి సరిపడ ఆదాయం ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నాయని చెప్పారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని, ఆయా సంస్థలతో మాట్లాడి సరైన ధర ఇప్పించాలని డిమాండ్ చేశారు. గిగ్ వర్కర్లకు తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం గిగ్ వర్కర్లు, ఆటో, క్యాబ్ డ్రైవర్ల (Cab Drivers) పక్షాన నిలబడాలని డిమాండ్ చేశారు. గిగ్‌వర్కర్లు బుధవారం మధ్యాహ్నం వరకు బ్రేక్ డౌన్ చేస్తున్నారని, ఇలాంటి ఉద్యమాలు చేసే పరిస్థితి లేకుండా వారి పక్షాన ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని హెచ్చరించారు. వారి బ్రేక్ డౌన్ ఆందోళనకు టీఆర్‌ఎస్ మద్దతుగా ఉంటుందని చెప్పారు.
స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి సంస్థల్లో పనిచేస్తున్న లక్షలాది గిగ్ వర్కర్లు, డ్రైవర్లు రోజంతా కష్టపడినా వారి ఆదాయం కుటుంబ పోషణకు కూడా సరిపోవడం లేదు. అగ్రిగేటర్ సంస్థలు వారికి సరిపడ ఆదాయం ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నాయి.
ఈ వ్యవహారంలో ప్రభుత్వం వెంటనే జోక్యం… pic.twitter.com/wJJDtlb2IK
— Kavitha Kalvakuntla (@RaoKavitha) July 22, 2026
సంబంధిత వార్తలు

Flipkart | ఫుడ్ డెలివరీ రంగంలోకి ఫ్లిప్‌కార్ట్.. జొమాటో, స్విగ్గీలకు భారీ షాక్..
జులై 24, 2026

Stock Markets | వరుసగా 5వ రోజు నష్టాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 4 నెలల్లో అతి పెద్ద పతనం..
జులై 24, 2026

Kavitha | కమీషన్ల కక్కుర్తితో సింగరేణిని నిర్వీర్యం చేస్తున్న సీఎం రేవంత్: కవిత
జులై 19, 2026
తాజావార్తలు
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?

Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు



