Nandan Nilekani | ఏఐ వల్ల 9 కోట్ల ఉద్యోగాలకు ముప్పు: ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని
Nandan Nilekani | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా ప్రపంచవ్యాప్తంగా 9 కోట్లకు పైగా ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని అన్నారు. సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇన్ఫోసిస్ ఇన్వెస్టర్ ఏఐ డే 2026 కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఏఐ వల్ల భారీ ఎత్తున ఉద్యోగాలకు ముప్పు ఉందని అన్నారు.
Nandan Nilekani | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా ప్రపంచవ్యాప్తంగా 9 కోట్లకు పైగా ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని అన్నారు. సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇన్ఫోసిస్ ఇన్వెస్టర్ ఏఐ డే 2026 కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఏఐ వల్ల భారీ ఎత్తున ఉద్యోగాలకు ముప్పు ఉందని అన్నారు. కానీ కొత్తగా 17 కోట్ల ఉద్యోగాలు ఏర్పడే అవకాశం కూడా ఉందన్నారు. ఉద్యోగ ప్రపంచంలో ఇది పెను మార్పులకు సంకేతమని అన్నారు. ఏఐ విప్లవాన్ని గతంలో వచ్చిన స్మార్ట్ ఫోన్లు, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సాంకేతిక మార్పులతో పోల్చలేమని అన్నారు.
ఏఐ అంటే టెక్నాలజీ అప్‌గ్రేడ్ కాదు..
ఏఐ అంటే టెక్నాలజీకి అప్ గ్రేడ్ కాదని, ఇది నైపుణ్యాలు, నియామక విధానాలు, పనితీరును పూర్తిగా మార్చేస్తుందని నందన్ నీలేకని స్పష్టం చేశారు. ఎంటర్‌ప్రైజ్‌లలో ఇప్పటికీ లెగసీ సిస్టమ్స్ పెద్ద సమస్యగా ఉన్నాయని గుర్తుచేశారు. ఏఐని సమర్థవంతంగా అమలు చేయాలంటే ఈ పాత సిస్టమ్స్‌ను ఆధునీకరించడం అత్యంత కీలకమని చెప్పారు.
కాగా ఇన్ఫోసిస్ సంస్థ తన ఏఐ-ఫస్ట్ వాల్యూ ఫ్రేమ్ వర్క్స్‌ను ప్రకటించినట్లు తెలియజేసింది. జనరేటివ్, ఏజెంటిక్ ఏఐ సూట్ అయిన ఇన్ఫోసిస్ టోపాజ్ ద్వారా గ్లోబల్ ఎంటర్ ప్రైజ్‌లు ఏఐని విస్తృత స్థాయిలో ఉపయోగించుకునేలా ఈ వ్యూహం సహాయం చేస్తుందని స్పష్టం చేసింది. నాస్‌కామ్, మెక్‌కిన్సీ అండ్ కంపెనీ నివేదికలను ఉటంకిస్తూ 2030 నాటికి ఏఐ-ఫస్ట్ సేవల ద్వారా 300 నుంచి 400 బిలియన్ డాలర్ల వరకు అదనపు మార్కెట్ అవకాశాలు ఏర్పడే అవకాశం ఉందని ఇన్ఫోసిస్ అంచనా వేసింది. ప్రస్తుతం ఇన్ఫోసిస్‌కు చెందిన టాప్ 200 క్లయింట్లలో 90 శాతం మందితో ఆ సంస్థ ఏఐ ప్రాజెక్టులపై పనిచేస్తుండగా, మొత్తం 4600కు పైగా ఏఐ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి.
సంబంధిత వార్తలు

AI Impact on Indian Jobs | 20 కోట్ల ఉద్యోగాలపై ఏఐ ఎఫెక్ట్.. ఆటోమేషన్ ముప్పులో యువత
అక్టోబర్ 13, 2026

Nandan Nilekani NEET Paper Leak Reforms | పరీక్ష రోజే చివరి నిమిషంలో క్వశ్చన్ పేపర్.. AIతో లీకేజీలకు ఫుల్స్టాప్
అక్టోబర్ 13, 2026

6G Network | భారత్‌లో 6జీ నెట్వర్క్ విస్తరణ కష్టమే..
అక్టోబర్ 10, 2026
తాజావార్తలు
- ●Obstruction of Dalits | ఈ గుడి మేం కట్టించాం.. మీరెలా వస్తారు.. దళితులను అడ్డుకున్న ఎమ్మెల్యే మేనమామ
- ●Kranthi Kiran | సింగూర్‌ను ఖాళీ చేయించిన ఘనత మంత్రి దామోదరదే
- ●Sobhita Dhulipala | పెళ్లైనా తగ్గేదేలే - శోభిత ధూళిపాళ బోల్డ్ ఫొటోషూట్
- ●AI Impact on Indian Jobs | 20 కోట్ల ఉద్యోగాలపై ఏఐ ఎఫెక్ట్.. ఆటోమేషన్ ముప్పులో యువత
- ●L Murugan resigns Union Minister | కూలీల కొడుకును కేంద్ర మంత్రిని చేశారు.. ఇక చాలు : నన్ను మంత్రి పదవి నుంచి తప్పించండి
- ●DK Shivakumar Kurta Row | డీకే శివకుమార్ కుర్తా పట్టుకుని లాగిన రాహుల్ గాంధీ : వీడియో వైరల్

Obstruction of Dalits | ఈ గుడి మేం కట్టించాం.. మీరెలా వస్తారు.. దళితులను అడ్డుకున్న ఎమ్మెల్యే మేనమామ

Kranthi Kiran | సింగూర్‌ను ఖాళీ చేయించిన ఘనత మంత్రి దామోదరదే

Sobhita Dhulipala | పెళ్లైనా తగ్గేదేలే - శోభిత ధూళిపాళ బోల్డ్ ఫొటోషూట్

AI Impact on Indian Jobs | 20 కోట్ల ఉద్యోగాలపై ఏఐ ఎఫెక్ట్.. ఆటోమేషన్ ముప్పులో యువత



