Metals And Metal Stocks | లోహాలు, లోహపు షేర్ల ధరలు ఢమాల్.. కారణాలు ఇవే..!
Metals And Metal Stocks | బడ్జెట్ 2026-27 సందర్భంగా ఆదివారం (ఫిబ్రవరి 1, 2026) నిర్వహించిన ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ లో లోహ రంగానికి చెందిన షేర్లు భారీగా నష్టపోయాయి.
Metals And Metal Stocks | బడ్జెట్ 2026-27 సందర్భంగా ఆదివారం (ఫిబ్రవరి 1, 2026) నిర్వహించిన ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ లో లోహ రంగానికి చెందిన షేర్లు భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా వేదాంత లిమిటెడ్, హిందుస్థాన్ జింక్, హిందాల్కో, నేషనల్ అల్యూమినియం కంపెనీ, జిందాల్ స్టీల్ వంటి కంపెనీల షేర్ల ధరలు భారీగా తగ్గాయి. గత సెషన్‌లోనూ లోహ రంగ షేర్లు పోడిపోగా, అంతర్జాతీయ కమోడిటీల ధరలు బలహీన పడడం ఇందుకు ప్రధాన కారణాలని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
భారీగా తగ్గిన మార్కెట్ క్యాప్..
ఆదివారం నిర్వహించిన ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌లో హిందుస్థాన్ జింక్ షేర్లు సుమారుగా 9.55 శాతం మేర నష్టపోగా, వేదాంత షేర్లు 3.8 శాతం మేర క్షీణించాయి. నాల్కో షేర్ల ధరల్లో 7.2 శాతం మేర పతనం కనిపించింది. అలాగే ఎన్ఎండీసీ షేర్లు 0.99 శాతం మేర క్షీణించాయి. కమోడిటీ మార్కెట్లలో బలహీన సెంటిమెంట్ కారణంగా లోహ స్టాక్స్‌పై అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలోనే ఉదయం 10 గంటల సమయంలో నిఫ్టీ మెటల్ సూచీ గత రెండు ట్రేడింగ్ సెషన్లతో పోలిస్తే సుమారు 2.58 శాతం మేర తగ్గింది. కాగా ఈ పతనం వల్ల హిందుస్థాన్ కాపర్ మార్కెట్ క్యాప్ రూ.18వేల కోట్లు తగ్గగా, హిందుస్థాన్ జింక్ రూ.63వేల కోట్లు, నాల్కో రూ.15,200 కోట్లు, వేదాంత రూ.54వేల కోట్ల మేర మార్కెట్ క్యాప్‌లో నష్టపోయాయి.
లాభాల బుకింగ్ ప్రధాన కారణం..
ఆర్థిక సర్వే భారత ఆర్థిక వ్యవస్థకు స్థిర వృద్ధి సంకేతాలు ఇచ్చినా, అంతర్జాతీయంగా పలు సూచనలు, కొన్ని రంగాల్లో అమ్మకాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ముఖ్యంగా నెలరోజుల ర్యాలీ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల బుకింగ్‌కు దిగడం ప్రధాన కారణం. జనవరి 29, 2026 నాటికి కొన్ని షేర్లు ఆల్‌టైమ్ హైలను తాకగా, కొన్ని సెక్టార్ స్టాక్స్ గురువారం నాటికి 56 శాతం వరకు పెరిగాయి. దీంతో లాభాల బుకింగ్ ఒత్తిడి పెరిగింది. కాగా అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో బేస్ మెటల్స్, విలువైన లోహాల ధరలు కూడా తగ్గాయి.
MCX కాపర్ (మార్చి ఎక్స్‌పైరీ) సుమారుగా 6 శాతం తగ్గి ఇంట్రాడే లో రూ.1217.85/కిలో కనిష్టానికి చేరుకుంది. అలాగే MCX అల్యూమినియం (మార్చి) రూ.299.5/కిలో వరకు తగ్గింది. MCX గోల్డ్ (మార్చి)7.75 శాతం తగ్గగా, MCX సిల్వర్ (మార్చి) 7.75 శాతం మేర తగ్గుదల నమోదు చేసింది. ఈ క్రమంలోనే జనవరిలో భారీ ర్యాలీ తర్వాత ఈ సెగ్మెంట్‌లో వచ్చిన కరెక్షన్‌గా దీన్ని భావిస్తున్నారు. అందుకనే మెటల్ స్టాక్స్, మెటల్స్ ధరలు భారీగా తగ్గాయని, ఇది తాత్కాలిక తగ్గుదల మాత్రమేనని విశ్లేషిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Gold And Silver Prices Today | కమోడిటీ మార్కెట్లలో తీవ్ర అస్థిరత.. పెట్టుబడిదారుల్లో సందిగ్ధత..
మే 20, 2026

Gold And Silver Prices Today | దిగి వస్తున్న బంగారం ధరలు.. పెట్టుబడిదారుల చూపు ఎటు..?
మే 18, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



