త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | మ‌ధ్య‌ప్రాచ్యంలో పెరిగిన ఉద్రిక్త‌త‌లు.. మ‌ళ్లీ స్టాక్ మార్కెట్ల ప‌త‌నం..

Stock Markets | మధ్యప్రాచ్యంలోని తాజా భౌగోళిక ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. యెమెన్‌కు చెందిన హౌతి తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో సౌదీ అరేబియా చమురు ట్యాంకర్లపై దాడి చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి.

S

Business | Published On Jul 23, 2026, 10.16 am IST

Stock Markets | మ‌ధ్య‌ప్రాచ్యంలో పెరిగిన ఉద్రిక్త‌త‌లు.. మ‌ళ్లీ స్టాక్ మార్కెట్ల ప‌త‌నం..
Advertisement

Stock Markets | మధ్యప్రాచ్యంలోని తాజా భౌగోళిక ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. యెమెన్‌కు చెందిన హౌతి తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో సౌదీ అరేబియా చమురు ట్యాంకర్లపై దాడి చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. దీంతో గురువారం ఉదయం దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. బుధవారం 76,755.05 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ గురువారం 76,515.10 వద్ద ప్రారంభమై 76,397.13 వద్ద ట్రేడవుతూ 357.92 పాయింట్లు (0.47 శాతం) నష్టపోయింది. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 సూచీ 23,996.25 నుంచి 23,904.80 వద్ద ప్రారంభమై 23,896.55 వద్ద ట్రేడవుతూ 99.70 పాయింట్లు (0.42 శాతం) పడిపోయింది.

పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

హౌతి దాడుల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 95 డాలర్లను దాటగా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర‌ 88 డాలర్లకు చేరువైంది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థపై అధిక చమురు ధరల భారం మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. రూపాయి కూడా ఒత్తిడికి గురై అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూ.96.5 స్థాయికి చేరువైంది. నిఫ్టీలో డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ 4.43 శాతం పతనంతో అత్యధిక నష్టాన్ని నమోదు చేసింది. సిప్లా, టాటా స్టీల్, ఇండిగో, ఇన్ఫోసిస్ షేర్లు కూడా నష్టాల్లో ట్రేడయ్యాయి. ఇన్ఫోసిస్ త్రైమాసిక ఫలితాలు మార్కెట్ ముగిసిన తర్వాత విడుదల కానుండటంతో పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బజాజ్ ఆటో, ఓఎన్‌జీసీ, ఎటర్నల్, హిందాల్కో షేర్లు స్వల్ప లాభాల్లో కొనసాగాయి. రంగాల వారీగా చూస్తే గత సెషన్‌లో నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ, నిఫ్టీ ఆటో మెరుగైన ప్రదర్శన కనబర‌చగా, నిఫ్టీ మీడియా, నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు 2.5 శాతానికి పైగా క్షీణించాయి.

పెట్టుబ‌డిదారుల‌పై అమ్మ‌కాల ఒత్తిడి..

విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) బుధవారం రూ.819 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (డీఐఐలు) కూడా రూ.418 కోట్ల షేర్లను విక్రయించారు. సాంకేతికంగా నిఫ్టీ 20 రోజుల సింపుల్ మూవింగ్ యావరేజ్ 24,100 కంటే దిగువకు రావడంతో బలహీనత కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిఫ్టీ 23,800 స్థాయి వరకు మరింత దిద్దుబాటు కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement
Advertisement