Mahindra ATV | సైన్యంలోకి మహీంద్రా థార్..! ఫొటోలను షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర..!
Mahindra ATV | భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో మహీంద్రా థార్‌కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆఫ్‌రోడింగ్ ప్రియులు మాత్రమే కాకుండా.. రోడ్‌పై ప్రత్యేక గుర్తింపు కోరుకునే వారిలో కూడా ఈ వాహనానికి విపరీతమైన ఆదరణ ఉంది.
Mahindra ATV | భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో మహీంద్రా థార్‌కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆఫ్‌రోడింగ్ ప్రియులు మాత్రమే కాకుండా.. రోడ్‌పై ప్రత్యేక గుర్తింపు కోరుకునే వారిలో కూడా ఈ వాహనానికి విపరీతమైన ఆదరణ ఉంది. అయితే. ఈ థార్‌ను సైనిక వినియోగానికి అనుగుణంగా టాక్టికల్ రూపంలో చూడాలని చాలామంది కోరిక. తాజాగా ఆ కోరిక నెరవేరినట్టే కనిపిస్తోంది. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ‘మహీంద్రా ఏటీవీ’ (ఆల్-టెర్రెయిన్ వెహికల్) ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. మహీంద్రా డిఫెన్స్ నిర్వహించిన ‘రక్షా త్రివేణి సంగమం’లో ఈ వాహనాన్ని ప్రదర్శించారు.
థార్ రాక్స్ మోడల్‌ను ఆధారంగా తీసుకుని రూపొందించిన ఈ వెర్షన్ ఇప్పటివరకు వచ్చిన వాటిలో అత్యంత టాక్టికల్ వేరియంట్‌గా నిలుస్తోంది. బెంగళూరుకు చెందిన ప్రాడ్ 4x4 సంస్థతో కలిసి దీన్ని అభివృద్ధి చేశారు. ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా హ్యాండింగ్‌లో ఈ వాహనం ఫీచర్స్‌ను వివరించారు. సాధారణ థార్ తరహాలో ఎలాంటి హంగులు లేకుండా చర్యలు తీసుకున్నారు. కేవలంపై పనితీరుపైనే దృష్టి సారించి రూపొందించినట్లు తెలిపారు. ప్రతి భాగం ఒక నిర్దిష్ట అవసరాన్ని తీర్చేలా రూపొందించినట్లు పేర్కొన్నారు. ఎయిర్‌డ్రాప్‌కు అనుకూలంగా ఉండటం, మిషన్ లెవెల్ సెక్యూరిటీ, గన్ మౌంట్, వాహనం కింద భాగానికి రక్షణ కవచం, ముందు భాగంలో వించ్, విండ్‌షీల్డ్ రక్షణ వంటి ఏర్పాట్లున్నాయి.
అదనంగా, వెనుక భాగంలో స్పేర్ టైర్లు, ఫ్యూయల్ డబ్బాలను మోసుకెళ్లే సదుపాయం కల్పించారు. సాధారణ థార్‌లో ఉండే రూఫ్, క్యాబిన్‌కు బదులుగా బలమైన రోల్ కేజ్ అమర్చారు. ముందూ వెనుకా హెవీ డ్యూటీ మెటల్ బంపర్లు ఏర్పాటు చేశారు. రాత్రి ఆపరేషన్లలో గుర్తుపట్టకుండా ఉండేందుకు బ్లాక్‌అవుట్ లైట్లు అమర్చారు. కఠిన భూభాగాల్లో ప్రయాణించేందుకు స్టీల్ వీల్స్‌తో పాటు ఆఫ్‌రోడ్‌కు అనుకూలమైన టైర్లు ఉపయోగించారు. ఇంజిన్ పరంగా చూస్తే, 2.2 లీటర్ల డీజిల్ ఇంజిన్‌తో ఈ వాహనం పనిచేస్తుంది. ఇది సుమారు 172 హెచ్‌పీ పవర్, 400 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రాడ్ 4x4 సంస్థ దీన్ని ‘ఎయిర్‌డ్రాప్ రెడీ’గా పేర్కొనడం విశేషం.
అంటే, అవసరమైతే గగనతలం నుంచి యుద్ధ ప్రాంతాల్లో నేరుగా తరలించేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక వీల్ సెటప్ విషయానికి వస్తే.. స్టీల్ వీల్స్‌తో పాటు కఠిన భూభాగాల్లో ప్రయాణించేందుకు అనుకూలమైన ఆర్టీ-గ్రేడ్ టైర్లను అమర్చారు. ఇవి వాహనం ఆఫ్‌రోడ్ సామర్థ్యాన్ని మరింత పెంచుతున్నాయి. అయితే, మరింత ఎత్తు కోసం లిఫ్ట్ కిట్‌ను జోడించి ఉంటే ఇంకా మెరుగైన పనితీరు సాధ్యమయ్యేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ మహీంద్రా ఏటీవీ భద్రతా దళాల అవసరాలకు అనుగుణంగా రూపొందిన ఆధునిక టాక్టికల్ వాహనంగా నిలుస్తోంది. కఠిన పరిస్థితుల్లోనూ సమర్థంగా పనిచేసే సామర్థ్యంతో ఇది ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది.
Presenting the Mahindra ATV (All-Terrain Vehicle)
No excess. No ornamentation.
Just focussed capability.Every bar, every mount, every inch of clearance has a job to do. From airdrop readiness to mission-grade protection, a gun mount, complete underbody protection, tandem tyre… pic.twitter.com/ZT5EmFJ5f3
— anand mahindra (@anandmahindra) May 4, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●NIMS | చిన్నారులకు విజయవంతంగా గుండె శస్త్రచికిత్సలు
- ●CM Revanth Reddy | రోశయ్య దూర దృష్టి వల్లే తెలంగాణకు మిగులు బడ్డెట్
- ●RGV on Artificial Intelligence | జేబులో చిల్లిగవ్వ లేనప్పుడు ఎదురుగా నగదుతో నిండిన పెద్ద లాకర్ ఉంటే దాన్ని తెరవకుండా ఎంతసేపు ఉండగలరు?
- ●TG Weather | మరో మూడురోజులు తెలంగాణలో భారీ వర్షాలు.. ఐఎండీ వార్నింగ్..!
- ●Rashmika Mandanna | ఆనంద్ దేవరకొండ ఎపిక్‌కు రష్మిక మందన్న రివ్యూ - కన్నీళ్లు పెట్టుకున్నా విజయ్ దేవరకొండ
- ●iPhone 17 Pro Max | ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్.. రూ.రూ.74,990కే ఫోన్..!

NIMS | చిన్నారులకు విజయవంతంగా గుండె శస్త్రచికిత్సలు

CM Revanth Reddy | రోశయ్య దూర దృష్టి వల్లే తెలంగాణకు మిగులు బడ్డెట్

RGV on Artificial Intelligence | జేబులో చిల్లిగవ్వ లేనప్పుడు ఎదురుగా నగదుతో నిండిన పెద్ద లాకర్ ఉంటే దాన్ని తెరవకుండా ఎంతసేపు ఉండగలరు?

TG Weather | మరో మూడురోజులు తెలంగాణలో భారీ వర్షాలు.. ఐఎండీ వార్నింగ్..!




