Loan On Fixed Deposit | మీకు ఎఫ్‌డీ ఉందా..? దానిపై ఎంత వరకు రుణం పొందవచ్చంటే..?
Loan On Fixed Deposit | మెడికల్ బిల్లుల చెల్లింపు, ఇతర అత్యవసర ఖర్చులు వచ్చినప్పుడు చాలా మంది డబ్బుల కోసం రుణాలను తీసుకుంటుంటారు. ముఖ్యంగా వ్యక్తిగత రుణాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. అయితే వాటి కన్నా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రుణం తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
Loan On Fixed Deposit | మెడికల్ బిల్లుల చెల్లింపు, ఇతర అత్యవసర ఖర్చులు వచ్చినప్పుడు చాలా మంది డబ్బుల కోసం రుణాలను తీసుకుంటుంటారు. ముఖ్యంగా వ్యక్తిగత రుణాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. అయితే వాటి కన్నా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రుణం తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే పొదుపు చేసుకుని ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) రూపంలో ముందుగా దాచుకుని ఉంటేనే దానిపై రుణం తీసుకునేందుకు వీలవుతుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ లేని వారు ఈ రుణం తీసుకోలేరు. కానీ కాస్త శ్రమతో ఎఫ్‌డీ వేస్తే మాత్రం అది కష్టకాలంలో ఎంతో సహాయం చేస్తుంది. దాన్ని బ్రేక్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అత్యవసరం అనుకున్న సమయంలో దానిపై లోన్ తీసుకోవచ్చు. పైగా వడ్డీ కూడా తక్కువగానే ఉంటుంది. ఆ లోన్‌ను ఎమర్జెన్సీ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.
90 శాతం వరకు రుణం..
అనేక బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై రుణాలను అందిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా ఈ డిపాజిట్‌ను బ్రేక్ చేయకుండా, దాని మీద రుణం పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. వినియోగదారులు తమ డిపాజిట్ విలువలో గరిష్టంగా 90 శాతం వరకు రుణాన్ని పొందవచ్చు. అవసరాన్ని బట్టి డిమాండ్ లోన్ లేదా ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అయితే నాన్-కాలబుల్ డిపాజిట్లపై కేవలం డిమాండ్ లోన్ మాత్రమే లభిస్తుంది. వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం ఈ రుణానికి ప్రత్యేకత. రోజువారీ తగ్గుతూ ఉండే బ్యాలెన్స్‌పై వడ్డీ లెక్కించబడుతుంది. ప్రాసెసింగ్ ఛార్జీలు ఉండవు. ముందస్తు చెల్లింపులకు ఎటువంటి పెనాల్టీలు ఉండవు. ఆన్‌లైన్ ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కింద కనిష్ట రుణ మొత్తం రూ.5వేలు కాగా, గరిష్ట పరిమితి రూ.5 కోట్లుగా ఉంది. ఆ మేర వినియోగదారులు ఈ రుణాన్ని పొందవచ్చు.
డిపాజిట్‌పై లీయిన్..
డిమాండ్ లోన్, ఓవర్‌డ్రాఫ్ట్ రెండింటికీ రుణ కాలపరిమితి 5 సంవత్సరాల వరకు లేదా డిపాజిట్ మిగిలిన మెచూరిటీ కాలం (ఏది ముందుగా వస్తే అది) వరకు కనిష్ట మార్జిన్ 10 శాతంగా ఉంటుంది. డిమాండ్ లోన్ విషయంలో రుణ కాలపరిమితి 5 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండి గరిష్టంగా 10 సంవత్సరాల వరకు (లేదా డిపాజిట్ మిగిలిన మెచూరిటీ కాలం, ఏది ముందుగా వస్తే అది) అయితే కనిష్ట మార్జిన్ 15 శాతంగా ఉంటుంది. ఈ రుణానికి భద్రతగా ఆధారిత డిపాజిట్‌పై లీయిన్ ఉంచబడుతుంది. రుణ రకం డిమాండ్ లోన్ ఓవర్‌డ్రాఫ్ట్ రూపంలో ఉంటుంది.
అన్ని బ్యాంకుల్లోనూ అందుబాటులో..
టైమ్ డిపాజిట్‌కు వర్తించే వడ్డీ రేటుపై 1 శాతం అదనంగా ఈ రుణానికి వడ్డీ విధించబడుతుంది. ఇక ఎస్‌బీఐ కస్టమర్లు అయితే తమకు ఎఫ్‌డీ కూడా అదే బ్యాంకులో ఉంటే కేవలం నిమిషాల వ్యవధిలోనే ఎఫ్‌డీపై రుణం పొందవచ్చు. ఇందుకు యోనో యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను ఆశ్రయించాల్సి ఉంటుంది. ఇక డిమాండ్ లోన్ లేదా ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం పొందాలంటే బ్రాంచ్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. అయితే ఎస్‌బీఐ మాత్రమే కాదు, అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు ఎఫ్‌డీలపై సులభంగా రుణ సౌకర్యాన్ని అందిస్తున్నాయి.
సంబంధిత వార్తలు

SBI Recruitment | ఎస్‌బీఐ ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్.. రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక..
మే 14, 2026

SBI | భారీగా పెరిగిన ఎస్‌బీఐ ఆదాయం.. ఒక్కో షేరుకు రూ.17.35 డివిడెండ్ ప్రకటన..
మే 8, 2026

HDFC Bank | హెచ్డీఎఫ్సీ బ్యాంకులో లోన్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్.. తగ్గిన వడ్డీ రేట్లు..
మే 8, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



