Liquor Sector Stocks | లిక్కర్ స్టాక్స్‌లో భారీగా లాభాలు.. ఇన్వెస్టర్లు దెబ్బకు షాక్..
Liquor Sector Stocks | ఫ్రాన్స్‌కు చెందిన ఆల్కోబెవ్ దిగ్గజం పెర్నోడ్ రికార్డ్ 2026 మార్చి త్రైమాసికంలో భారత్‌లో 11 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. ఇంపీరియల్ బ్లూ వ్యాపారాన్ని విక్రయించడమే ఈ వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచింది.
Liquor Sector Stocks | ఫ్రాన్స్‌కు చెందిన ఆల్కోబెవ్ దిగ్గజం పెర్నోడ్ రికార్డ్ 2026 మార్చి త్రైమాసికంలో భారత్‌లో 11 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. ఇంపీరియల్ బ్లూ వ్యాపారాన్ని విక్రయించడమే ఈ వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచింది. కాగా భారత ఆల్కోబెవ్ మార్కెట్‌లో పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్, ప్రీమియం బ్రాండ్ల పట్ల భారతీయుల ఆసక్తి కూడా కంపెనీ వ్యాపారానికి మద్దతు ఇచ్చాయని పెర్నోడ్ రికార్డ్ తన మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో పేర్కొంది. ఈ సంస్థ జూలై నుంచి జూన్ వరకు ఆర్థిక సంవత్సరాన్ని అనుసరిస్తుంది. ప్రముఖ బ్రాండ్లు అబ్సల్యూట్, చివాస్ రీగల్, గ్లెన్‌లివెట్‌లను కలిగి ఉన్న ఈ ఫ్రెంచ్ స్పిరిట్ తయారీ సంస్థకు భారత్ పరిమాణ పరంగా అతిపెద్ద మార్కెట్ కాగా, విలువ పరంగా రెండవ అతిపెద్ద మార్కెట్‌గా మారింది.
సీగ్రామ్ ఇండియా నుంచే ఎక్కువ ఆదాయం..
మూడో త్రైమాసికంలో బలమైన డిమాండ్, ప్రీమియం బ్రాండ్ల పట్ల ఆసక్తి కొనసాగడం, అలాగే ఇంపీరియల్ బ్లూ వ్యాపారం విక్రయం కారణంగా వృద్ధి నమోదైందని కంపెనీ ఆదాయ నివేదికలో పేర్కొంది. ఇంపోర్టెడ్ స్పిరిట్స్ విభాగంలో జేమ్సన్, అబ్సల్యూట్, స్కాచ్ బ్రాండ్లు బలమైన డబుల్ డిజిట్ వృద్ధిని నమోదు చేశాయి. అలాగే సీగ్రామ్ పోర్ట్‌ఫోలియోలోని బ్లెండర్స్ ప్రైడ్, కొత్తగా ప్రవేశపెట్టిన ఎక్స్‌క్లమేషన్ బ్రాండ్ కూడా మంచి వృద్ధిని సాధించాయి. సుమారు రెండు దశాబ్దాల క్రితం సీగ్రామ్ ఇండియా వ్యాపారాన్ని కొనుగోలు చేసిన పెర్నోడ్ రికార్డ్, ప్రస్తుతం తన మొత్తం ఆదాయంలో, పరిమాణంలో ఎక్కువ భాగాన్ని ఈ విభాగం నుంచే పొందుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో పెర్నోడ్ రికార్డ్ ఇండియా తన ఇంపీరియల్ బ్లూ వ్యాపారాన్ని దేశీయ సంస్థ తిలక్‌నగర్ ఇండస్ట్రీస్‌కు విక్రయించింది. ప్రస్తుతం కంపెనీ సీగ్రామ్ పోర్ట్‌ఫోలియోలో రాయల్ స్టాగ్, బ్లెండర్స్ ప్రైడ్, 100 పైపర్స్, లాంగిట్యూడ్ 77, ఎక్స్‌క్లమేషన్ వంటి బ్రాండ్లు ఉన్నాయి.
రికార్డు స్థాయిలో ఆదాయం..
భారత స్పిరిట్స్ మార్కెట్ ఇంకా బలమైన వినియోగదారుల వృద్ధిని కలిగి ఉందని పెర్నోడ్ రికార్డ్ పేర్కొంది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కంపెనీ 6 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే, మూడో త్రైమాసికంలో పెర్నోడ్ రికార్డ్ నికర అమ్మకాలు 1.94 బిలియన్ యూరోలుగా నమోదై, కేవలం 0.1 శాతం ఆర్గానిక్ వృద్ధి మాత్రమే కనిపించింది. జూలై నుంచి మార్చి వరకు మొత్తం నికర అమ్మకాలు 7.1 మిలియన్ యూరోలుగా ఉండగా, ఆర్గానిక్ పరంగా 4.4 శాతం తగ్గుదల నమోదైంది. పెర్నోడ్ రికార్డ్ ఇండియా 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 27,446 కోట్ల ఆదాయంతో దేశంలోనే ప్రముఖ ఆల్కోబెవ్ సంస్థగా నిలిచింది. గత ఐదేళ్లుగా ఇది సుమారు 8 శాతం సీఏజీఆర్‌తో స్థిరంగా వృద్ధిని కొనసాగిస్తోంది.
లిక్కర్ స్టాక్స్ లాభాలు చూసి ఇన్వెస్టర్లు షాక్..
పెర్నోడ్ రికార్డ్ భారీగా ఆదాయం పొందడంతో ఆ రంగానికి చెందిన ఇతర కంపెనీల షేర్లు కూడా భారీగా పెరిగాయి. శుక్రవారం నాడు ముగిసిన ట్రేడింగ్ సెషన్‌లో లిక్కర్ సెక్టార్ అనూహ్యంగా 7 శాతం మేర ర్యాలీని కొనసాగించింది. దీంతో ఈ రంగంలో పెట్టుబడులు పెట్టిన మదుపర్లు భారీగా లాభం పొందారు. ముఖ్యంగా గ్లోబస్ స్పిరిట్స్ అత్యధికంగా లాభపడగా, రాడికో ఖైతాన్, అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్ (ఏబీడీఎల్), తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీల షేర్లు 6 శాతం లాభపడ్డాయి. అలాగే మార్కెట్ దిగ్గజ సంస్థలు యునైటెడ్ స్పిరిట్స్, యునైటెడ్ బ్రూవరీస్ షేర్లు కూడా 4 శాతం మేర పైకి ఎగబాకాయి. మద్యం రంగంలో భారత వినియోగదారుల ఆసక్తి రోజు రోజుకీ పెరుగుతుండడం, ప్రీమియం బ్రాండ్ల పట్ల వారిలో పెరుగుతున్న ఆసక్తి వంటి కారణాల వల్ల లిక్కర్ సెక్టార్ షేర్లు భారీగా లాభపడ్డాయి. అయితే భవిష్యత్తులో ఈ రంగం ఇంకా గణనీయమైన వృద్ధిని సాధిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






