Stock Markets | ట్రంప్ ప్రకటన ఎఫెక్ట్.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
Stock Markets | అమెరికాలో జరగనున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో తాము కొద్ది రోజుల పాటు ఇరాన్‌పై దాడి చేయబోమని, హోర్ముజ్ జలసంధిలో చమురు సరఫరా యథావిధిగా కొనసాగుతుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచ స్టాక్ మార్కెట్లకు బూస్ట్ లభించింది. ఒక్కసారిగా చమురు ధరలు పతనమవ్వగా ఈక్విటీ మార్కెట్లు ఉవ్వెత్తున ఎగిశాయి. దీంతో శుక్రవారం ఆసియా మార్కెట్లు సైతం లాభాల్లో ప్రారంభం అయ్యాయి.
Stock Markets | అమెరికాలో జరగనున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో తాము కొద్ది రోజుల పాటు ఇరాన్‌పై దాడి చేయబోమని, హోర్ముజ్ జలసంధిలో చమురు సరఫరా యథావిధిగా కొనసాగుతుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచ స్టాక్ మార్కెట్లకు బూస్ట్ లభించింది. ఒక్కసారిగా చమురు ధరలు పతనమవ్వగా ఈక్విటీ మార్కెట్లు ఉవ్వెత్తున ఎగిశాయి. దీంతో శుక్రవారం ఆసియా మార్కెట్లు సైతం లాభాల్లో ప్రారంభం అయ్యాయి. దేశీయ ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ50 భారీ లాభాల్లో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 369 పాయింట్లు (0.53) శాతం లాభపడి 71,998 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ50 సూచీ 131 పాయింట్లు (0.58 శాతం) ఎగబాకి 22,360 వద్ద ట్రేడవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక పరిణామాల్లో పెను మార్పులు రావడం, పాజిటివ్ సంకేతాలు నెలకొనడం, ముడి చమురు ధరలు భారీగా తగ్గడం ఈక్విటీ మార్కెట్ల పెరుగుదలకు కారణం అయ్యాయి.
విస్తృత మార్కెట్లలోనూ భారీగా కొనుగోళ్లు..
విస్తృత మార్కెట్లలోనూ భారీ కొనుగోళ్లు కనిపించాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్50 సూచీ 0.12 శాతం పెరగ్గా, మిడ్‌క్యాప్ 150 సూచీ 0.07 శాతం లాభపడింది. రంగాలవారిగా చూస్తే నిఫ్టీ ఐటీ షేర్లు భారీగా లాభపడ్డాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ ఐటీ కంపెనీలపై పలు ఆంక్షలను విధించిన నేపథ్యంలో శుక్రవారం ఈ షేర్లలో భారీ పతనం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేశారు. అయితే వారి అంచనాలు తలకిందులు అయ్యాయి. అన్నింటి కన్నా ఐటీ షేర్లే ఎక్కువగా లాభపడడం విశేషం. ఇన్వెస్టర్లు ఆ విషయాన్ని సైతం భారత్‌కు అనుకూలంగా ఉంటుందని అంచనా వేశారు. దీంతో ఆ రంగంలో కొనుగోళ్లు భారీగా పెరిగాయి. నిఫ్టీ ఐటీ సూచీ ఏకంగా 2.79 శాతం ఎగబాకింది. తరువాతి స్థానాల్లో నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ బ్యాంక్ సూచీలు నిలిచాయి. ఇక నిఫ్టీ ఎనర్జీ, ఫార్మా, పీఎస్ఈ, మెటల్, మీడియా రంగాలకు చెందిన షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.
చమురు ధరలు పతనం..
ముడి చమురు ధరలు భారీగా పతనం అవడం ఈక్విటీ మార్కెట్లకు ఊపు తెచ్చింది. డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో చమురుపై తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొనగా ధరలు ఒక్కసారిగా క్షీణించాయి. గత సెషన్‌లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 104 డాలర్లకు ఎగబాకగా, ఈ సెషన్‌లో భారీగా తగ్గి 101 డాలర్లకు దిగి వచ్చింది. అలాగే డబ్ల్యూటీఐ క్రూడ్ ధర గత సెషన్‌తో పోలిస్తే 0.86 శాతం మేర పతనమై బ్యారెల్‌కు 91 డాలర్లకు చేరింది. ఫారెక్స్ మార్కెట్‌లోనూ అనుకూల సంకేతాలే కనిపించాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే 96.73 వద్ద ఉన్న భారత రూపాయి ఈ సెషన్‌లో 0.05 శాతం లాభపడింది. అయితే నవంబర్‌లో జరగనునన్న అమెరికా మధ్యంతర ఎన్నికల అనంతరం పరిస్థితి ఏంటన్నది ప్రస్తుతం నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్పటి వరకు మార్కెట్లు లాభాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు
- ●POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు
- ●Horoscope | అక్టోబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?
- ●CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్

Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు

POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు

Horoscope | అక్టోబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!

Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?






