త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold Loan | బంగారంపై లోన్ తీసుకుంటున్నారా..? ఈ విష‌యాల‌ను కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!

బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు ప్ర‌జ‌ల‌కు అనేక ర‌కాలుగా రుణాల‌ను ఇస్తుంటాయి. వాటిల్లో గోల్డ్ లోన్స్ కూడా ఒక‌టి. ప్ర‌జ‌లు తాక‌ట్టుపెట్టే బంగారానికి గాను బ్యాంకులు, ఇత‌ర సంస్థ‌లు విలువ క‌ట్టి దాంట్లో నిర్దిష్ట‌మైన మొత్తం విలువ మేర‌కు వినియోగ‌దారుల‌కు రుణాన్ని ఇస్తుంటాయి.

S

Business | Published On Dec 19, 2025, 8.47 am IST

Gold Loan | బంగారంపై లోన్ తీసుకుంటున్నారా..? ఈ విష‌యాల‌ను కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!
Advertisement

Gold Loan | బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు ప్ర‌జ‌ల‌కు అనేక ర‌కాలుగా రుణాల‌ను ఇస్తుంటాయి. వాటిల్లో గోల్డ్ లోన్స్ కూడా ఒక‌టి. ప్ర‌జ‌లు తాక‌ట్టుపెట్టే బంగారానికి గాను బ్యాంకులు, ఇత‌ర సంస్థ‌లు విలువ క‌ట్టి దాంట్లో నిర్దిష్ట‌మైన మొత్తం విలువ మేర‌కు వినియోగ‌దారుల‌కు రుణాన్ని ఇస్తుంటాయి. ఈ క్ర‌మంలో ఖాతాదారులు తీసుకున్న రుణానికి గాను కాల ప‌రిమితి ఉంటుంది. ఆ ప‌రిమితి లోగా రుణం చెల్లించాలి. అప్ప‌టి వ‌ర‌కు వ‌డ్డీని కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా బంగారం రుణాలు ప‌నిచేస్తాయి. ఈ విష‌యాలు అంద‌రికీ తెలిసిందే. అయితే బంగారంపై రుణాల‌ను తీసుకునే వారు ప‌లు ఇత‌ర ముఖ్య‌మైన విష‌యాల‌ను కూడా క‌చ్చితంగా తెలుసుకోవాల‌ని ఆర్థిక నిపుణులు వెల్ల‌డిస్తున్నారు.

సెక్యూర్డ్ లోన్‌..

బంగారంపై రుణం అంటే అది సెక్యూర్డ్ లోన్ కింద‌కు వ‌స్తుంది. దీని వ‌ల్ల రుణం సుల‌భంగా ల‌భిస్తుంది. వినియోగ‌దారుల‌ సిబిల్ స్కోరు అవ‌స‌రం లేకుండానే ఈ రుణం పొంద‌వ‌చ్చు. బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు ప్ర‌జ‌లు తాక‌ట్టు పెట్టే బంగారాన్ని సెక్యూరిటీగా తీసుకుని లోన్ ఇస్తాయి. క‌నుక సిబిల్ అవ‌స‌రం ఉండ‌దు. బంగారాన్ని ప్ర‌జ‌లు తాక‌ట్టు పెడుతున్నారు క‌నుక దాన్నే సెక్యూరిటీ కింద భావించాలి. దీని వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు అప్పు ఇచ్చే వారికి ఎలాంటి రిస్క్ ఉండ‌దు. క‌నుక వారు వినియోగ‌దారుల‌కు సుల‌భంగా లోన్ ఇస్తారు. బంగారంపై తీసుకునే రుణానికి గాను సాధార‌ణంగా వడ్డీ నెల‌కు 80 పైస‌ల నుంచి రూ.2 వ‌ర‌కు ఉంటుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు అందించే గోల్డ్ లోన్ స్కీమ్‌ల‌ను బ‌ట్టి వ‌డ్డీ విలువ మారుతుంది. చాలా వ‌ర‌కు బ్యాంకులు, సంస్థ‌లు వినియోగ‌దారుల‌కు దాదాపుగా రూ.1 నుంచి రూ.1.50 మ‌ధ్య వ‌డ్డీతో లోన్ ఇస్తుంటాయి. అయితే త‌క్కువ వ‌డ్డీ ఎక్క‌డ ల‌భిస్తుందో వారి వ‌ద్ద నుంచి రుణం తీసుకుంటే మంచిది.

కొన్ని గంట‌ల్లోనే రుణం..

బంగారంపై రుణం తీసుకునేందుకు పెద్ద‌గా ప‌త్రాలు అవ‌స‌రం ఉండ‌దు. ఆధార్‌, పాన్ కార్డు ఇస్తే స‌రిపోతుంది. లోన్ తీసుకునే స‌మ‌యంలో మొబైల్ నంబ‌ర్‌కు వ‌చ్చే ఓటీపీల‌ను బ్యాంక‌ర్ల‌కు చెప్పి వాటిని వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇక రూ.10 ల‌క్ష‌ల‌కు మించి రుణం తీసుకుంటే ఖాతాదారులు ఉండే నివాసం ధ్రువీక‌ర‌ణ‌కు బ్యాంకు లేదా రుణ సంస్థ‌కు చెందిన సిబ్బంది వ‌చ్చి వెరిఫై చేసుకుంటారు. మోసాల‌ను నియంత్రించేందుకు ఈ నిబంధ‌న‌ను అమ‌లు చేస్తున్నారు. అలాగే బంగారంపై తీసుకునే రుణాన్ని త‌క్ష‌ణ‌మే మంజూరు చేస్తారు. కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంట‌ల స‌మ‌యంలోగా రుణం ఇస్తారు. ఇది కూడా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ‌ను బ‌ట్టి ఉంటుంది. ఇక బంగారంపై లోన్ తీసుకుంటే సిబిల్ స్కోరు ముంద‌స్తుగా ఉండాల్సిన అవ‌స‌రం లేదు. సిబిల్ లేకున్నా ఈ లోన్ పొంద‌వ‌చ్చు. అయితే రుణం తీసుకున్నాక మాత్రం ప్ర‌తి నెలా సిబిల్ స్కోరు అప్‌డేట్ అవుతుంది. క‌నుక వ‌డ్డీ స‌రిగ్గా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే తెలిపిన స‌మ‌యంలోగా రుణం చెల్లించాలి. దీంతో సిబ‌ల్ స్కోరు పెరుగుతుంది.

75 నుంచి 85 శాతం వ‌ర‌కు లోన్‌..

సాధార‌ణంగా ఆర్‌బీఐ నిబంధ‌న‌ల మేర‌కు చాలా వ‌ర‌కు బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు ప్ర‌జ‌లు తాక‌ట్టు పెట్టే బంగారం విలువ‌లో 75 శాతం మేర మొత్తాన్ని రుణంగా ఇస్తాయి. అయితే కొన్ని సంస్థ‌లు 80 నుంచి 85 శాతం వ‌ర‌కు కూడా రుణాన్ని ఇస్తాయి. ఇక బంగారంపై రుణం తీసుకోవాలంటే 18 నుంచి 22 క్యారెట్ల బంగారాన్ని మాత్ర‌మే తాక‌ట్టు పెట్టాల్సి ఉంటుంది. అంత‌క‌న్నా త‌క్కువ స్వ‌చ్ఛ‌మైన బంగారంపై లోన్ల‌ను ఇవ్వ‌రు. అదేవిధంగా బంగారంపై తీసుకునే రుణాన్ని కూడా వినియోగ‌దారులు కావాల‌నుకుంటే ఈఎంఐల రూపంలో చెల్లించ‌వ‌చ్చు. లేదా నెల నెలా వ‌డ్డీ చెల్లిస్తూ ఒకేసారి మొత్తం రుణాన్ని చెల్లించ‌వ‌చ్చు. ఇక వినియోగ‌దారులు తాక‌ట్టు పెట్టే బంగారాన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు క‌చ్చితంగా సుర‌క్షితమైన వాల్ట్‌ల‌లో భ‌ద్ర ప‌ర‌చాలి. దీనికి వారే ఇన్సూరెన్స్ బ్యాధ‌త‌ను తీసుకోవాలి. దీని వ‌ల్ల బంగారం పోయినా వినియోగ‌దారుల‌కు ఆ మొత్తం విలువైన న‌గ‌దు ల‌భిస్తుంది. అలాగే వినియోగ‌దారులు గోల్డ్ లోన్ చెల్లించ‌డంలో విఫలం అయితే ముందుగా నోటీసు ఇస్తారు. దానికి కూడా స్పంద‌న లేక‌పోతే అప్పుడు బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌ల‌కు వినియోగ‌దారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేసేందుకు అధికారం ఉంటుంది. దాన్ని విక్ర‌యించ‌డం ద్వారా లోన్ మొత్తానికి సంబంధిన న‌గ‌దును వారు రిక‌వ‌రీ చేస్తారు. ఇలా బంగారం రుణాలు ప‌నిచేస్తాయి.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement