త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | బంగారం ర్యాలీకి బ్రేక్‌.. ఒక మోస్త‌రుగా తగ్గిన ప‌సిడి ధ‌ర‌లు.. పెట్టుబ‌డుల‌కు స‌రైన స‌మ‌య‌మా..?

Gold And Silver Prices Today | ప‌శ్చిమ ఆసియాలో అమెరికా, ఇరాన్‌ల మ‌ధ్య స‌యోధ్య కుదిరే దిశ‌గా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం అవ‌డం, ముడి చ‌మురు ధ‌ర‌లు భారీగా త‌గ్గ‌డం, భౌగోళిక, రాజ‌కీయ ప‌రిణామాల్లో మార్పులు వంటి అనేక కార‌ణాల‌తో ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాల్లో కొన‌సాగుతుండ‌గా, బులియ‌న్ మార్కెట్ల‌లోనూ కొనుగోళ్ల జోరు క‌నిపిస్తోంది. పెట్టుబ‌డిదారులు మ‌ళ్లీ బంగారం, వెండిల‌పై పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు.

S

Business | Published On Nov 10, 2026, 11.16 am IST

Gold And Silver Prices Today | బంగారం ర్యాలీకి బ్రేక్‌.. ఒక మోస్త‌రుగా తగ్గిన ప‌సిడి ధ‌ర‌లు.. పెట్టుబ‌డుల‌కు స‌రైన స‌మ‌య‌మా..?
Advertisement

Gold And Silver Prices Today | ప‌శ్చిమ ఆసియాలో అమెరికా, ఇరాన్‌ల మ‌ధ్య స‌యోధ్య కుదిరే దిశ‌గా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం అవ‌డం, ముడి చ‌మురు ధ‌ర‌లు భారీగా త‌గ్గ‌డం, భౌగోళిక, రాజ‌కీయ ప‌రిణామాల్లో మార్పులు వంటి అనేక కార‌ణాల‌తో ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాల్లో కొన‌సాగుతుండ‌గా, బులియ‌న్ మార్కెట్ల‌లోనూ కొనుగోళ్ల జోరు క‌నిపిస్తోంది. పెట్టుబ‌డిదారులు మ‌ళ్లీ బంగారం, వెండిల‌పై పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. దీంతో గ‌త 10 రోజుల నుంచి వీటి ధ‌ర‌ల్లో పెరుగుద‌ల క‌నిపిస్తోంది. అయితే అమ్మ‌కాల ఒత్తిడి పెరుగుద‌ల‌ను ప‌రిమితం చేస్తోంది. అయిన‌ప్ప‌టికీ స‌మీప‌కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా పెరిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. దీంతో ఆయా లోహాల‌పై పెట్టుబ‌డులు పెట్టేందుకు పెట్టుబ‌డిదారులు ఆస‌క్తి చూపిస్తున్నారు. అయితే తీవ్ర హెచ్చుత‌గ్గుల‌తో ధ‌ర‌లు ఉన్నందున అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచిస్తున్నారు.

ఇక అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్ల‌లో ఔన్స్ బంగారం ధ‌ర స్వ‌ల్పంగా త‌గ్గింది. మంగ‌ళ‌వారం సెష‌న్‌లో 0.55 శాతం త‌గ్గిన ధ‌ర 4,117 డాల‌ర్ల‌కు చేరింది. వెండి ధ‌ర 0.32 శాతం త‌గ్గి 53 డాల‌ర్ల‌కు దిగి రాగా, దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌కు ఇవాళ ఉద‌యం సెష‌న్ సెల‌వు ప్ర‌క‌టించారు. ఇక గ‌త సెష‌న్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు స్వ‌ల్పంగా 614 పాయింట్లు లాభ‌ప‌డి 1,43,166కు చేరింది. సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 2,027 పాయింట్లు పెరిగి 1,87,127 వ‌ద్ద ముగిసింది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధ‌రలు ఒక మోస్త‌రుగా త‌గ్గగా, వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,411 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,15,288 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,44,110 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,41,100 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.4,900 త‌గ్గింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.13,210 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,05,680గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,32,100 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.13,21,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.4,500 త‌గ్గింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.10,808 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.86,464గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,08,080 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.10,80,800గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.3,700 త‌గ్గింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,05,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,050గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,05,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,050 గా ఉంది.

Advertisement
Advertisement