Seethakka | డే కేర్ కేంద్రాలతో చిన్నారుల సంరక్షణ
Seethakka | పిల్లల సంరక్షణ కోసం తల్లులు తమ ఉద్యోగాలు, ఉపాధిని వదులుకునే పరిస్థితులను అధిగమించేలా ప్రభుత్వం పని చేస్తోందని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఇందులో భాగంగా చాంద్రాయణగుట్ట నియోజకవర్గ పరిధిలోని అరుంధతి నగర్‌లో అంగన్వాడీ కేంద్రం-కమ్-పాలన (డే కేర్) కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.
- వారి ఆరోగ్యం, ఆనందమే అసలైన అభివృద్ధి
- తల్లుల ఉద్యోగం, ఉపాధికి ఇబ్బంది లేకుండా సేవలు
- చాంద్రాయణగుట్ట అంగన్వాడీ-కమ్-పాలన కేంద్రం ప్రారంభోత్సవంలో మంత్రి సీతక్క
Seethakka | త్రినేత్ర.న్యూస్: పిల్లల సంరక్షణ కోసం తల్లులు తమ ఉద్యోగాలు, ఉపాధిని వదులుకునే పరిస్థితులను అధిగమించేలా ప్రభుత్వం పని చేస్తోందని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఇందులో భాగంగా చాంద్రాయణగుట్ట నియోజకవర్గ పరిధిలోని అరుంధతి నగర్‌లో అంగన్వాడీ కేంద్రం-కమ్-పాలన (డే కేర్) కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో తొలి పాలనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు సంరక్షణ, పోషకాహారం, ఆటల ద్వారా అభ్యాసం అందించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. చిన్నారులకు యూనిఫాంలు పంపిణీ చేసి, వారి అభ్యాస ప్రదర్శనలను మెచ్చుకున్నారు.

ప్రజల ఇంటి వద్దకే సేవలు..
వేల రూపాయలు ఖర్చు చేసి ప్రైవేట్ నర్సరీల్లో చేర్పించాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం ప్రజల ఇంటి వద్దకే నాణ్యమైన సేవలను తీసుకువచ్చిందని చెప్పారు. అంగన్వాడీ కేంద్రం, పాలన కేంద్రాన్ని ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేయడం ద్వారా ఒకే కుటుంబంలోని చిన్నారులందరికీ సమగ్ర సేవలు అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఉపాధి కోసం బయటకు వెళ్లే తల్లులకు ఈ డే కేర్ కేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు చిన్నారుల సంరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా పాలన కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు చిన్నారులను ఈ కేంద్రాల్లో ఉంచి వారి సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఆటవస్తువులు, అభ్యాస సామగ్రి, పోషకాహారం అందుబాటులో ఉంచామని చెప్పారు.

చిన్నారి జీవితంలోని మొదటి వెయ్యి రోజులు అత్యంత కీలకమైనవని, ఆ దశలో మెదడు ఎదుగుదలతో పాటు శారీరక, మానసిక వికాసం జరుగుతుందని పేర్కొన్నారు. అందుకే గర్భధారణ దశ నుంచి తొలి రెండు సంవత్సరాల వరకు తల్లులు, చిన్నారులకు అవసరమైన పోషకాహారం, ఆరోగ్య సేవలు, సంరక్షణ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోందని వివరించారు.
అంగన్వాడీ సేవలను మరింత బలోపేతం చేస్తూ పిల్లలకు విద్యతో పాటు పోషకాహారం, అల్పాహారం కూడా అందిస్తున్నామన్నారు. ప్రైవేట్ నర్సరీలకు దీటుగా అంగన్వాడీ కేంద్రాలను తీర్చిదిద్దుతూ 57 రకాల ఆటవస్తువులు, యూనిఫాంలు, నాణ్యమైన ప్రీ-స్కూల్ విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఆరు సంవత్సరాల లోపు పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. మహిళల సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
అమ్మకు అక్షరమాల..
మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని, ఇప్పటివరకు రూ.61 వేల కోట్లకు పైగా రుణాలు అందించామని తెలిపారు. లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను మహిళలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలు బలంగా ఉన్నట్లే పట్టణ ప్రాంతాల్లో కూడా మహిళా సంఘాలను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, టీనేజ్ బాలికల కోసం ప్రత్యేక మహిళా సంఘాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. “అమ్మకు అక్షరమాల” కార్యక్రమం ద్వారా ఇప్పటికే ఆరు లక్షల మంది మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దామని చెప్పారు. అంతకుముందు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా బోయ కార్పొరేషన్ వైస్ చైర్మన్ బోయ నగేష్, చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు.
పాలన కేంద్రాల్లో చిన్నారుల సంరక్షణ, పోషకాహారం, ప్రారంభ అభ్యాసం ప్రభుత్వ బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. “మీ పిల్లలను మాకు అప్పగిస్తే, మీరు నిశ్చింతగా మీ పనులు చేసుకొని రావచ్చు. ప్రతి చిన్నారికి సురక్షిత బాల్యం, ప్రతి తల్లికి భరోసా కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యం” అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనితా రామచంద్రన్, బోయ కార్పొరేషన్ వైస్ చైర్మన్ బోయ నగేష్, ఎస్బీఐ ఫౌండేషన్ ప్రతినిధులు, అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Pochampally Ikat stoles | ఫ్రాన్స్ అధ్యక్షుడి సతీమణికి బహుమతిగా 'పోచంపల్లి సిల్క్ స్టోల్'.. అందజేసిన ప్రధాని మోదీ
- ●Allu Arjun | సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు నోటీసులు..
- ●Save The Tigers 3 Review | సేవ్ ది టైగర్స్ సీజన్ 3 రివ్యూ - జియో హాట్‌స్టార్‌లో రిలీజైన తెలుగు కామెడీ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
- ●Gandhi Sarovar | గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్రం ఓకే
- ●Harish Rao | రాహుల్ పుట్టిన రోజునే రైతు డిక్లరేషన్‌కు బొంద పెట్టారు: హరీశ్‌రావు
- ●CM Revanth Reddy | విధ్వంసమైన విద్యాశాఖను ప్రక్షాళన చేస్తున్నా : సీఎం రేవంత్ రెడ్డి

Pochampally Ikat stoles | ఫ్రాన్స్ అధ్యక్షుడి సతీమణికి బహుమతిగా 'పోచంపల్లి సిల్క్ స్టోల్'.. అందజేసిన ప్రధాని మోదీ

Allu Arjun | సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు నోటీసులు..

Save The Tigers 3 Review | సేవ్ ది టైగర్స్ సీజన్ 3 రివ్యూ - జియో హాట్‌స్టార్‌లో రిలీజైన తెలుగు కామెడీ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

Gandhi Sarovar | గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్రం ఓకే



