Amazon World Cup Sale 2026 | అమెజాన్‌లో వరల్డ్ కప్ సేల్.. టీవీలు, ప్రొజెక్టర్లపై 65 శాతం డిస్కౌంట్..
Amazon World Cup Sale 2026 | ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీని దృష్టిలో ఉంచుకుని ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లపై ఏకంగా 65 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది.
Amazon World Cup Sale 2026 | ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీని దృష్టిలో ఉంచుకుని ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లపై ఏకంగా 65 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది. వినియోగదారులు తమ అమెజాన్ ఖాతాలో అందుబాటులో ఉన్న కూపన్లతోపాటు బ్యాంకు ఆఫర్లతో ఆయా ఉత్పత్తులను భారీ తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చని అమెజాన్ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఈ సేల్‌ను పరిమిత కాలం పాటు, ఫిబ్రవరి 5వ తేదీ వరకు మాత్రమే నిర్వహిస్తున్నామని, కనుక వినియోగదారులు త్వరపడాలని అమెజాన్ తెలిపింది.
రూ.9వేల నుంచి మొదలు..
ఈ సేల్‌లో ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లు అన్ని బడ్జెట్ శ్రేణుల్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచకప్ మ్యాచ్‌లను ఇంట్లోనే థియేటర్ అనుభూతితో చూడాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రూ. 15 వేల లోపు స్మార్ట్ టీవీ ఆఫర్లలో 32 ఇంచుల హెచ్‌డీ రెడీ, గూగుల్ టీవీ మోడళ్లు ఆకర్షణీయ ధరల్లో లభిస్తున్నాయి. రూ.9 వేల నుంచే ప్రారంభమయ్యే టీవీలు వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అలాగే రూ. 15 వేల నుంచి రూ. 50 వేల మధ్య రేంజ్‌లో 43 నుంచి 55 ఇంచుల వరకు ఫుల్ హెచ్‌డీ, 4కే అల్ట్రా హెచ్‌డీ, క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి. పెద్ద స్క్రీన్, అధునాతన ఫీచర్లతో కూడిన టీవీలు ఈ విభాగంలో ఎక్కువగా అమ్ముడవుతున్నాయని అమెజాన్ వెల్లడించింది.
ప్రీమియం శ్రేణి టీవీలపై కూడా..
రూ. 50 వేల నుంచి రూ. 70 వేల మధ్యలో 65 ఇంచుల వరకు పెద్ద స్క్రీన్ టీవీలు, మినీ ఎల్ఈడీ, క్యూఎల్ఈడీ మోడళ్లు ఉన్నాయి. అలాగే రూ. 70 వేల పైబడిన విభాగంలో 75, 85, 98, 100 ఇంచుల వరకు భారీ స్క్రీన్ టీవీలు కూడా ఈ సేల్‌లో లభిస్తున్నాయి. 8కె అల్ట్రా హెచ్‌డీ టీవీలు సైతం ప్రత్యేక ధరలకు అందుబాటులో ఉన్నాయి. ఇక ఇంట్లోనే పెద్ద స్క్రీన్ అనుభూతి కోరుకునే వారికి ప్రొజెక్టర్లపై కూడా అమెజాన్ భారీ తగ్గింపు ధరలను అందిస్తోంది. రూ.8 వేల నుంచి ప్రారంభమయ్యే ఫుల్ హెచ్‌డీ ప్రొజెక్టర్లు, పోర్టబుల్ లేజర్ ప్రొజెక్టర్లు ఈ సేల్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ వరల్డ్ కప్ సేల్‌లో భాగంగా క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 5,550 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ వంటి బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో వినియోగదారులు మరింత తక్కువ ధరకు తమకు ఇష్టమైన టీవీ లేదా ప్రొజెక్టర్ ను కొనుగోలు చేసే అవకాశం కల్పించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●ఎర్రకోట విచారణల నుండి నేవీ తిరుగుబాటు దాకా: తెల్లదొరల గుండెల్లో నిద్రపోయిన 5 సంచలన ఘట్టాలు!
- ●Horoscope | ఆగస్టు 15 రాశి ఫలాలు.. ఈ రాశివారికి ప్రమాదం పొంచి ఉంది!
- ●Geetu Mohandas | టాక్సిక్ డైరెక్టర్ భర్త ఫేమస్ సినిమాటోగ్రాఫర్ - అల్లు అర్జున్ సినిమాకు కెమెరామెన్‌గా...
- ●Srinivasa Rao | ముగిసిన జోగినపల్లి శ్రీనివాస్ రావు అంత్యక్రియలు
- ●Telugu OTT | సైలెంట్‌గా ఓటీటీలో వచ్చిన తెలుగు థ్రిల్లర్ మూవీ - భార్యాభర్తల మధ్యలోకి లేడీ సైకో ఎంటరైతే!
- ●Maheshkumar Goud | పార్టీ గీత దాటితే ఎవరైనా ఒకటే.. రాజగోపాల్‌రెడ్డికి టీపీసీసీ చీఫ్ వార్నింగ్

ఎర్రకోట విచారణల నుండి నేవీ తిరుగుబాటు దాకా: తెల్లదొరల గుండెల్లో నిద్రపోయిన 5 సంచలన ఘట్టాలు!

Horoscope | ఆగస్టు 15 రాశి ఫలాలు.. ఈ రాశివారికి ప్రమాదం పొంచి ఉంది!

Geetu Mohandas | టాక్సిక్ డైరెక్టర్ భర్త ఫేమస్ సినిమాటోగ్రాఫర్ - అల్లు అర్జున్ సినిమాకు కెమెరామెన్‌గా...

Srinivasa Rao | ముగిసిన జోగినపల్లి శ్రీనివాస్ రావు అంత్యక్రియలు






