NYTTA | తెలంగాణ సంస్కృతిని అమెరికాలోని భావితరాలకు తెలియజేయడమే లక్ష్యం
NYTTA | తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టతను అమెరికాలోని భావితరాలకు పరిచయం చేయడమే నైటా (NYTTA) ప్రధాన లక్ష్యమని నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల (Ravindar Kodela) తెలిపారు.
- న్యూయార్క్‌లో ఘనంగా అలయ్ బలయ్
- నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల
NYTTA త్రినేత్ర న్యూస్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టతను అమెరికాలోని భావితరాలకు పరిచయం చేయడమే నైటా (NYTTA) ప్రధాన లక్ష్యమని నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల (Ravindar Kodela) తెలిపారు. న్యూయార్క్ లో ఆరేళ్లుగా తెలంగాణ సంస్కృతి పరిరక్షణకు కృషి చేస్తూనే తెలుగు ప్రజలందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దసరా, దీపావళి పండగల సందర్భంగా వేడుకలు న్యూయార్క్ రాడిసన్ హోటల్ లో వందలాది మంది తెలుగు ప్రజల సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించినట్లు చెప్పారు.
ఈ సంవత్సరం కూడా పండగల మహోత్సవాన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద గీతాలు, ఆధ్యాత్మిక అలంకరణలు, సంప్రదాయ విందుతో ప్రత్యేకంగా నిర్వహించామని పేర్కొన్నారు. NYTTA అభివృద్ధికి, సంస్థ కార్యక్రమాల విజయానికి సహకరిస్తున్న దాతలు, శ్రేయోభిలాషులు, వాలంటీర్ల సేవలను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. సంస్థకు అండగా నిలుస్తున్న దాతలను ఈ సందర్భంగా సత్కరించి వారి సేవలకు కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా మరిన్ని అర్థవంతమైన, వైవిధ్యభరితమైన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ తెలుగు అసోసియేషన్ (TTA) వ్యవస్థాపకులు, ప్రముఖ వ్యాపారవేత్త, నైటా శ్రేయోభిలాషి డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. TTA జాతీయ నాయకత్వం, కార్యవర్గ సభ్యులు, స్థానిక కౌంటీ ప్రతినిధులు, నైటా సంస్థకు అండగా నిలుస్తున్న దాతలు, స్థానిక తెలుగు సంస్థలైన TLCA, TANA ప్రతినిధులు, ప్రముఖులు, ఆహ్వానితులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చారు.
అలరించిన వేడుకలు
దసరా వేడుకల్లో భాగంగా తెలంగాణ జానపద గాయకులు రాజు, లావణ్యల బృందం అందించిన జానపద గీతాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వారి పాటలు, ప్రదర్శనలతో సభా ప్రాంగణం తెలంగాణ పల్లె సంస్కృతి, జానపద కళల సందడిని సంతరించుకుంది. కార్యక్రమానికి కోమలి వ్యాఖ్యాతగా వ్యవహరించి ఆద్యంతం ఆకట్టుకున్నారు. ప్రముఖ గాయకుడు మిట్టపల్లి సురేందర్ ఆలపించిన బతుకమ్మ పాటలు, తన స్వీయ రచనలతో రూపొందించిన గీతాలు, డాక్టర్ మల్లారెడ్డిపై ప్రత్యేకంగా పాడిన పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
పద్మ కోడెల రూపొందించిన అష్టలక్ష్మి అమ్మవారి ప్రత్యేక అలంకరణ కార్యక్రమానికి ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చింది. అమ్మవారి అలంకరణను చూసి అతిథులు, మహిళలు ప్రత్యేకంగా అభినందించారు. వేడుకలకు హాజరైన వారందరికీ నిర్వాహకులు చక్కటి విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు.
NYTTA నాయకత్వాన్ని అభినందించిన TTA
కార్యక్రమానికి హాజరైన TTA జాతీయ నాయకత్వం, NYTTA నిర్వహణను, తెలంగాణ పండుగల ప్రాధాన్యతను, దసరా మహోత్సవాన్ని, వైవిధ్యభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలను అభినందించారు. విదేశీ గడ్డపై తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేస్తూ ఇలాంటి వేడుకలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ వేడుకలను విజయవంతం చేసిన ముఖ్య అతిథులు, TTA జాతీయ నాయకత్వం, స్థానిక సంస్థల ప్రతినిధులు, దాతలు, శ్రేయోభిలాషులు, ఆహ్వానితులు, తెలుగు కుటుంబాలందరికీ NYTTA అధ్యక్షుడు రవీందర్ కోడెల, కార్యదర్శి మహేష్ బాబు దోమల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో NYTTA కార్యవర్గ సభ్యులు, బోర్డు సభ్యులు, డైరెక్టర్లు, సలహాదారులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని వేడుకల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.
తెలంగాణ పండుగల వైభవం, జానపద కళల సౌరభం, ఆధ్యాత్మికత, ఆత్మీయత, తెలుగు ప్రజల ఐక్యతను ప్రతిబింబించిన ఈ దసరా మహోత్సవం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగి, న్యూయార్క్ తెలుగు ప్రజలకు మధురమైన జ్ఞాపకంగా నిలిచింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను అమెరికా గడ్డపై సజీవంగా నిలబెట్టాలనే NYTTA సంకల్పానికి ఈ వేడుక నిదర్శనంగా నిలిచింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●SIR | రాజస్థాన్ ఓటర్ల జాబితాలో భారీ తేడా.. 30 లక్షల మంది పేర్లు మాయం
- ●Ram Gopal Varma Diwali Tweet | "చేతులు కాల్చుకునే వారికి నా విషెస్ వర్తించవు".. దీపావళి వేళ పొల్యూషన్, టపాసులపై ఆర్జీవీ ట్వీట్!
- ●Deepika Chikhli | సాయిపల్లవి యాక్షన్ సీన్లపై దీపికా చిఖ్లియా ఆసక్తికర వ్యాఖ్యలు
- ●Diwali Firecracker Safety Tips | టపాసులు కాల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు మరవకండి.. కాలిన గాయాలకు టూత్‌పేస్ట్, ఐస్ పెడితే ఏమవుతుందో తెలుసా?
- ●Gadi Eizenkot | నెతన్యాహుకు షాక్.. ప్రభుత్వ ఏర్పాటుకు ఎయిజెన్కాట్కు తొలి అవకాశం
- ●Diwali Snack Ideas | దీపావళి హౌస్ పార్టీకి గెస్టులు వస్తున్నారా? గంటల తరబడి వంట వద్దు.. ఈ 3 వెరైటీ స్నాక్స్ పెడితే గెస్టులు ఫిదా!

SIR | రాజస్థాన్ ఓటర్ల జాబితాలో భారీ తేడా.. 30 లక్షల మంది పేర్లు మాయం

Ram Gopal Varma Diwali Tweet | "చేతులు కాల్చుకునే వారికి నా విషెస్ వర్తించవు".. దీపావళి వేళ పొల్యూషన్, టపాసులపై ఆర్జీవీ ట్వీట్!

Deepika Chikhli | సాయిపల్లవి యాక్షన్ సీన్లపై దీపికా చిఖ్లియా ఆసక్తికర వ్యాఖ్యలు

Diwali Firecracker Safety Tips | టపాసులు కాల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు మరవకండి.. కాలిన గాయాలకు టూత్‌పేస్ట్, ఐస్ పెడితే ఏమవుతుందో తెలుసా?








