Reliance Industries | ఇన్వెస్టర్లను కోటీశ్వరులను చేసిన రిలయన్స్ షేర్లు.. అప్పట్లో రూ.10వేలు పెట్టి ఉంటే ఇప్పుడు కోట్లు లాభం..
Reliance Industries | ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరుగాంచిన పెట్టుబడిదారులు చెప్పే మాట ఒక్కటే. ఒక కంపెనీ స్టాక్‌ను నువ్వు కొన్నావు అంటే దాన్ని అమ్మడం కోసం కాదు, దాన్ని ఎప్పటికీ అలాగే ఉంచాలి, తరతరాలకూ అది సంపదను సృష్టిస్తూనే ఉంటుంది. ఈ విషయం ముమ్మాటికీ నిజమేనని రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధరను చూస్తే స్పష్టమవుతోంది.
Reliance Industries | ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరుగాంచిన పెట్టుబడిదారులు చెప్పే మాట ఒక్కటే. ఒక కంపెనీ స్టాక్‌ను నువ్వు కొన్నావు అంటే దాన్ని అమ్మడం కోసం కాదు, దాన్ని ఎప్పటికీ అలాగే ఉంచాలి, తరతరాలకూ అది సంపదను సృష్టిస్తూనే ఉంటుంది. ఈ విషయం ముమ్మాటికీ నిజమేనని రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధరను చూస్తే స్పష్టమవుతోంది. ఈ కంపెనీ ప్రారంభం అయినప్పుడు షేర్ ధర రూ.10 ఉండగా, అప్పుడు రూ.10వేలు పెట్టి 1వేయి షేర్లను కొని ఉంటే అదిప్పుడు దాదాపు రూ.3.50 కోట్లు అయి ఉండేది. షాకింగ్‌గా ఉన్నా ఇది నిజమే. రిలయన్స్ ఇండస్ట్రీస్ చిన్న కంపెనీగా మొదలై ఇప్పుడు భారీ సంస్థగా అవతరించింది. యజమానులు భారీ ఎత్తున సంపాదించడమే కాదు, అందులో షేర్ల రూపంలో పెట్టుబడులు పెట్టిన వారు కూడా ఇప్పుడు కోటీశ్వరులు అయ్యారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర ఈ మధ్య కాలంలో 15 శాతం మేర క్షీణించినప్పటికీ మొత్తంగా చూసుకుంటే ఇప్పటికీ ఈ సంస్థ లాభాల్లోనే ఉంది. దేశంలోని అతి పెద్ద కార్పొరేట్ సంస్థల్లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ చరిత్ర చూస్తే ఇప్పటికే ఈ కంపెనీ షేర్ సురక్షితమైన పెట్టుబడి మార్గంగా నిలిచింది.
బోనస్ షేర్లుగా మారి భారీగా ఆదాయం..
గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర భారీగా పెరిగింది. ఈ కంపెనీ గణనీయమైన వృద్ధి రేటును సాధిస్తోంది. ఈ సంస్థ ప్రస్తుతం రూ.18 లక్షల కోట్లకు పైగా మార్కెట్ క్యాపిటల్‌ను కలిగి ఉంది. ఈ క్రమంలోనే కంపెనీ ప్రారంభంలో వేల రూపాయల్లో పెట్టుబడులు పెట్టిన వారికి ఇప్పుడు కోట్లు వస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ 1977లో స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ సంస్థ ఐపీవోకు వచ్చినప్పుడు ఒక్కో షేర్ ధర రూ.10గా ఉండేది. ఇప్పుడు ధర భారీగా పెరిగి రూ.1343కు చేరింది. ఈ సంవత్సరం ప్రారంభంలో కంపెనీ షేర్ ధర రూ.1600 మార్కును సైతం చేరుకుంది. 1977లో కంపెనీ లిస్ట్ అయిన తరువాత ఇప్పటి వరకు ఆ సంస్థ 5 సార్లు బోనస్ షేర్లను తన వాటాదారులకు అందజేసింది. 1983లో తొలిసారి బోనస్ షేర్లను ఇవ్వగా వాటాదారులు తమ వద్ద ఉన్న ప్రతి 5 రిలయన్స్ షేర్లకు 3 బోనస్ షేర్లను పొందారు. తరువాత 1997, 2009, 2017, 2024లలో 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ఇచ్చారు. దీంతో ప్రారంభంలో 100 షేర్లు ప్రస్తుతం 2,560 షేర్లుగా మారగా, 1000 షేర్లు ఇప్పుడు 25,600 షేర్లుగా మారాయి.
రూ.10వేలకు రూ.3.50 కోట్లు..
1977లో ఒక్క షేర్ ధర రూ.10 చొప్పున లెక్కిస్తే 1000 షేర్లకు రూ.10వేలు అవుతుంది. ప్రస్తుతం షేర్ ధర రూ.1343 ఉంది. ఇప్పుడు ఆ 1000 షేర్లు బోనస్ రూపంలో 25,600 షేర్లుగా మారాయి. కనుక ఇప్పుడు 25,600 షేర్లను 1343తో గుణిస్తే ఆ మొత్తం రూ.3,43,80,800 అవుతుంది. అంటే దాదాపు రూ.3.50 కోట్లు అన్నమాట. ఇలా కంపెనీ ప్రారంభంలో పెట్టిన రూ.10వేల పెట్టుబడి పెట్టుబడిదారులను కోటీశ్వరులుగా మార్చింది. అందుకనే వారెన్ బఫెట్ లాంటి వారు షేర్లను కొన్నాక అమ్మకూడదని, వాటిని అలాగే ఉండనివ్వాలని, దీర్ఘకాలంలో భారీ ఎత్తున సంపదను సృష్టిస్తాయని చెబుతారు. అయితే అన్ని కంపెనీలకు ఇలా సాధ్యం కాదు. కనుక పెట్టుబడిదారులు స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టేముందు సొంతంగా ఆలోచించాలి. లేదా ఆర్థిక నిపుణుల సలహా పొందాలి. దీని వల్ల రిస్క్ లేకుండా దీర్ఘకాలంలో సంపద సృష్టి సాధ్యమవుతుంది. అయితే రిలయన్స్ కేవలం అక్కడితో ఆగలేదు, రిలయన్స్ రిటెయిల్, టెలికాం, డిజిటల్, ట్రెండ్స్ ద్వారా అన్ని రంగాల్లోనూ తన సేవలను విస్తరించి మరింత ఆదాయాన్ని పొందుతోంది. అలాగే ఇటీవల బ్లాక్ రాక్ అనే విదేశీ కంపెనీతో భాగస్వామ్యమై దేశంలోని పౌరులకు ఫైనాన్షియల్ సేవలను కూడా అందిస్తోంది. అయితే ఏ కంపెనీ అయినా దీర్ఘకాలంలో నిలబడితేనే అటు యజమానులకు, ఇటు పెట్టుబడిదారులకు సంపదను సృష్టించి ఇస్తుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



