Danam Nagender | మంత్రి కూల్ కూల్ అంటున్నడు.. కాంగ్రెస్ సర్కార్‌పై దానం ఎదురుదాడి
Danam Nagender | ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో పారదర్శకత లోపించిందని, నా నియోజకవర్గం పరిధిలో అలాట్ అయిన ఇళ్లను ఇతర నియోజకవర్గాల వారికి కేటాయించారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని సంబంధిత మంత్రికి చెబితే కూల్ కూల్ అంటున్నడు.. కూల్‌గా ఉన్నందుకే మా పరిస్థితి ఇక్కడి దాకా వచ్చిందని కాంగ్రెస్ సర్కార్‌పై దానం నాగేందర్ ఎదురుదాడి చేశారు.
Danam Nagender | త్రినేత్ర.న్యూస్ : ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో పారదర్శకత లోపించిందని, నా నియోజకవర్గం పరిధిలో అలాట్ అయిన ఇళ్లను ఇతర నియోజకవర్గాల వారికి కేటాయించారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని సంబంధిత మంత్రికి చెబితే కూల్ కూల్ అంటున్నడు.. కూల్‌గా ఉన్నందుకే మా పరిస్థితి ఇక్కడి దాకా వచ్చిందని కాంగ్రెస్ సర్కార్‌పై దానం నాగేందర్ ఎదురుదాడి చేశారు. శాసనసభలో జీరో అవర్‌లో దానం నాగేందర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. దానం నాగేందర్‌కు మైక్ ఇవ్వగానే.. ఆయన ఇలా స్పందించారు. సర్.. నోట్ చేసుకుంటామని చెప్తరు కాబట్టి మాట్లాడొద్దు అనుకున్నా.. జీరో అవర్‌కు విలువ, ప్రాధాన్యత లేకుండా పోయింది. గతంలో జీరో అవర్లలో ఇచ్చిన వాటికి రిప్లై వచ్చిందా అడగండి. రిప్లై రావాలి. ప్రోసిజర్స్ అదే.. కానీ మేం ప్రోసిజర్స్ మార్చమని చెప్పట్లేదు. నోట్ చేసుకంటామని చెప్తరు.. సిస్టమ్ ఏంటంటే.. రిప్లై ఇచ్చే ఆనవాయితీ ఉంది అని దానం నాగేందర్ తెలిపారు.
అందరి ఎమ్మెల్యేల సమస్య ఇది
నిజానికి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మా నియోజవర్గంలో 480 వరకు అలాట్ అయ్యాయి. డ్రా చేసే సమయంలో ఎమ్మెల్యేలు లేరు. హైదరాబాద్‌లో ఉన్న అందరి ఎమ్మెల్యేల సమస్య ఇది.. నా నియోజకవర్గంలో కార్వాన్, కూకట్‌పల్లి, మలక్‌పేట ప్రాంతాలకు చెందిన వారికి ఇండ్లు కేటాయించారు. అధికారులు నిర్లక్ష్యంగా డ్రా తీసేశారు. ఎమ్మెల్యేలకు ప్రివిలేజ్ ఇచ్చి ఏం లాభం అని దానం నిలదీశారు.
ఎంఐంఎం అంటే పడిపోతున్నది
ఎవరి నియోజకవర్గంలో వారికే ఇల్లు ఇవ్వాలి. కార్వాన్ ఎమ్మెల్యేను అడిగాను.. మాకు మాత్రం మా ప్రజలకే వచ్చాయన్నారు. మీకు భయపడి చేశారని చెప్పిన. ఎంఐంఎం అంటే పడిపోతున్నది. అమ్మనా బూతులు తిడుతరు.. అందుకే కేటాయించారు. మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు కూడా అదే రెస్పెక్ట్ దొరకాలి. ఎంఐఎం ఎమ్మెల్యేలను చూసి అధికారులు భయపడిపోతున్నారు. ప్రజాప్రతినిధులుగా వారికి హక్కుంది.. సేమ్ టైమ్ మాకు కూడా హక్కు ఉందని ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే తెలిపారు.
అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తది
మా నియోజకవర్గంలో 360 డిగ్రీలో స్క్రూట్నీ జరిగితే ఎక్కడ పొరపాటు జరిగింది. అధికారులపై చర్యలేవి.. మంత్రికి చెబితే కూల్ కూల్ అంటున్నరు.. కూల్ ఉన్నందుకే మా పరిస్థితి ఇక్కడి దాకా వచ్చింది.. మనకు సీఎం ఆదేశాలు ఇచ్చారు ఇల్లు లేని వారు ఉండొద్దని. ఆ ప్రక్రియ 100 శాతం పూర్తి చేస్తేనే.. అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తది. కానీ అధికారులు పెడచెవిన పెడుతున్నారు అని దానం నాగేందర్ మండిపడ్డారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Delhi | మైనర్‌పై గ్యాంగ్‌రేప్.. ఆపై హత్య.. శవాన్ని పీక్కుతిన్న కుక్కలు
- ●KTR | ఫార్ములా ఈ రేస్ కేసు.. నాంపల్లి కోర్టుకు హాజరైన కేటీఆర్
- ●Stock Markets | తగ్గిన ముడి చమురు ధరలు.. స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
- ●CM Revanth Reddy | మిగిలిన 9.56 లక్షల ఇండ్లను కేటాయించండి.. కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
- ●Nizamabad | పొరపాటున పేలిన తుపాకీ.. ఇన్స్పెక్టర్ మృతి
- ●Hyderabad | వనస్థలిపురంలో పాల వ్యాపారిపై కత్తితో దాడి

Delhi | మైనర్‌పై గ్యాంగ్‌రేప్.. ఆపై హత్య.. శవాన్ని పీక్కుతిన్న కుక్కలు

KTR | ఫార్ములా ఈ రేస్ కేసు.. నాంపల్లి కోర్టుకు హాజరైన కేటీఆర్

Stock Markets | తగ్గిన ముడి చమురు ధరలు.. స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

CM Revanth Reddy | మిగిలిన 9.56 లక్షల ఇండ్లను కేటాయించండి.. కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి




