త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IndiGo | విమానం గాల్లో ఉండ‌గా ఇంజిన్ ఫెయిల్‌.. ప్ర‌యాణికుల్లో టెన్ష‌న్‌

IndiGo | ఇండిగో (IndiGo) విమానానికి పెను ప్ర‌మాదం త‌ప్పింది. విమానం గాల్లో ఉండ‌గా ఇంజిన్ ఫెయిల్ (Engine Issue) అయింది. అప్ర‌మ‌త్త‌మైన అధికారులు చెన్నై ఎయిర్‌పోర్టులో (Chennai Airport) ఫుల్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించారు.

D

National | Published On Aug 12, 2026, 3.53 pm IST

IndiGo | విమానం గాల్లో ఉండ‌గా ఇంజిన్ ఫెయిల్‌.. ప్ర‌యాణికుల్లో టెన్ష‌న్‌
Advertisement

IndiGo | త్రినేత్ర‌.న్యూస్ : ఇండిగో (IndiGo) విమానానికి పెను ప్ర‌మాదం త‌ప్పింది. కోల్‌క‌తా నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో 6ఈ-723 విమానం గాల్లో ఉండ‌గా ఇంజిన్ ఫెయిల్ (Engine Issue) అయింది. దీంతో చెన్నై ఎయిర్‌పోర్టులో (Chennai Airport) అధికారులు ఫుల్ ఎమ‌ర్జెన్సీ (Full Emergency) ప్ర‌క‌టించారు. ఆ స‌మ‌యంలో విమానంలో 224 మంది ప్ర‌యాణికులు, సిబ్బంది ఉన్నారు.

విమానం రాత్రి 11:30 గంట‌ల‌కు చెన్నై ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉంది. మ‌రికాసేప‌ట్లో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంద‌నంగా దాని ఎడ‌మ‌వైపు ఇంజిన్ ఫెయిల్ అయిన‌ట్లు పైల‌ట్ గుర్తించారు. వెంట‌నే అధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు. అప్ర‌మ‌త్త‌మైన అధికారులు చెన్నై విమానాశ్ర‌యంలో ఫుల్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించారు. పోలీసులు, అంబులెన్స్‌, ఫైర్ సిబ్బందిని సిద్ధం చేశారు. మ‌రోవైపు ఇంజిన్ ఫెయిల్ అయ్యింద‌న్న స‌మాచారంతో ప్ర‌యాణికులు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. అయితే విమానం రాత్రి 11:37 గంట‌ల స‌మ‌యంలో విమానం సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. దీంతో ప్ర‌యాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘ‌ట‌న‌తో చెన్నై విమానాశ్ర‌యంలో కాసేపు టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

Also Read..

జేపీసీకి ఎఫ్‌సీఆర్ఏ బిల్లు

ఒకే ఫ్లాట్‌లో 37 కుక్కలను పెంచుతున్న యువతి.. స్థానికుల ఫిర్యాదుతో హైకోర్టు సీరియస్

మా కంటే అర్జంట్ ప‌నేం ఉంట‌ది స‌ర్.. కోదండ‌రాంను నిల‌దీసిన నిరుద్యోగులు

Advertisement
Advertisement