త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | స్టాక్ మార్కెట్ల‌లో బ్ల‌డ్ బాత్‌.. భారీగా ప‌త‌న‌మైన సూచీలు..

Stock Markets | భారత స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. అయితే ఆటోమొబైల్ షేర్లలో ఎంపిక చేసిన కొనుగోళ్లు కొంతమేర మద్దతు అందించాయి.

S

Business | Published On Jul 22, 2026, 10.05 am IST

Stock Markets | స్టాక్ మార్కెట్ల‌లో బ్ల‌డ్ బాత్‌.. భారీగా ప‌త‌న‌మైన సూచీలు..
Advertisement

Stock Markets | భారత స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. అయితే ఆటోమొబైల్ షేర్లలో ఎంపిక చేసిన కొనుగోళ్లు కొంతమేర మద్దతు అందించాయి. మంగళవారం 77,470.11 వద్ద ముగిసిన సెన్సెక్స్ బుధవారం 77,384.95 వద్ద ప్రారంభమైంది. అనంతరం మరింత బలహీనపడి 77,064.40 స్థాయికి చేరుకుంది. దీంతో ప్రారంభ ట్రేడింగ్‌లోనే సూచీ 405.71 పాయింట్లు (0.52 శాతం) మేర నష్టపోయింది. అలాగే గత సెషన్‌లో 24,187.70 వద్ద ముగిసిన నిఫ్టీ 50, బుధవారం 24,150.45 వద్ద ప్రారంభమై మరింత కింద‌కు చేరి 24,081.50 వద్ద ట్రేడైంది. నిఫ్టీ 106.20 పాయింట్లు (0.44 శాతం) నష్టంలో కొనసాగుతోంది.

భారీగా పెరిగిన ఆటో షేర్లు..

నిఫ్టీ 50లో టాప్ గెయినర్లలో బజాజ్ ఆటో అగ్రస్థానంలో నిలిచింది. ఈ షేర్ 2.27 శాతం పెరిగి రూ.10,639.50 వద్ద ట్రేడైంది. అంతకుముందు ఇది రూ.10,403.50 వద్ద ముగిసింది. హిండాల్కో 0.79 శాతం పెరిగి రూ.958.90కు చేరుకోగా, ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఓఎన్‌జీసీ 0.76 శాతం లాభంతో రూ.251.80 వద్ద ట్రేడైంది. మారుతి సుజుకి 0.54 శాతం పెరిగి రూ.13,670కు చేరుకోగా, నెస్లే ఇండియా 0.43 శాతం లాభంతో రూ.1,458.10 వద్ద నిలిచింది. ఉదయం ట్రేడింగ్‌లో ఫార్మాసూటికల్ రంగం అత్యధిక ఒత్తిడిని ఎదుర్కొంది. ఇండిగో షేర్ అత్యధికంగా 2.75 శాతం క్షీణించి రూ.5,159కు పడిపోయింది. అంతకుముందు ఇది రూ.5,305 వద్ద ముగిసింది. సిప్లా 2.04 శాతం తగ్గి రూ.1,403.30కు చేరుకోగా, మాక్స్ హెల్త్‌కేర్ 1.73 శాతం క్షీణించి రూ.1,081.40 వద్ద ట్రేడైంది. సన్ ఫార్మా 1.59 శాతం పడిపోయి రూ.1,930.70కు చేరుకోగా, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ 1.53 శాతం తగ్గి రూ.1,187.50 వద్ద ట్రేడైంది.

పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ముడి చ‌మురు ధ‌ర‌లు మ‌ళ్లీ పెరిగాయి. ఇది కూడా మార్కెట్ల‌పై ఒత్తిడి పెరిగేందుకు కార‌ణ‌మైంది. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 0.42 శాతం మేర పెరిగి బ్యారెల్‌కు 89 డాల‌ర్ల‌కు చేర‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 0.87 శాతం పెరిగి బ్యారెల్‌కు 86 డాలర్ల‌కు చేరుకుంది. ఫారెక్స్ మార్కెట్‌లో భార‌త రూపాయి విలువ మ‌ళ్లీ త‌గ్గింది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 11 పైస‌లు న‌ష్ట‌పోయిన రూపాయి 96.32 వ‌ద్ద నిలిచింది.

Advertisement
Advertisement