త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | వరుసగా ఏడో రోజూ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. పెట్టుబ‌డిదారుల‌పై అమ్మ‌కాల ఒత్తిడి..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడో సెషన్‌లోనూ నష్టాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, పెరిగిన ముడి చమురు ధరలు మార్కెట్లపై ఒత్తిడి పెంచాయి. గ‌తేడాది సెప్టెంబర్ తర్వాత నిఫ్టీ వరుసగా ఏడు సెషన్ల పాటు నష్టపోవడం ఇదే తొలిసారి. బుధవారం నిఫ్టీ 50 సూచీ 77 పాయింట్లు (0.32 శాతం) నష్టపోయి 24,078.30 వద్ద ముగిసింది.

S

Business | Published On Aug 19, 2026, 4.02 pm IST

Stock Markets | వరుసగా ఏడో రోజూ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. పెట్టుబ‌డిదారుల‌పై అమ్మ‌కాల ఒత్తిడి..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడో సెషన్‌లోనూ నష్టాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, పెరిగిన ముడి చమురు ధరలు మార్కెట్లపై ఒత్తిడి పెంచాయి. గ‌తేడాది సెప్టెంబర్ తర్వాత నిఫ్టీ వరుసగా ఏడు సెషన్ల పాటు నష్టపోవడం ఇదే తొలిసారి. బుధవారం నిఫ్టీ 50 సూచీ 77 పాయింట్లు (0.32 శాతం) నష్టపోయి 24,078.30 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 326 పాయింట్లు (0.42 శాతం) క్షీణించి 76,909.68 వద్ద స్థిరపడింది.

భారీగా పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగాలు కూడా బెంచ్‌మార్క్ సూచీల బాటలోనే నష్టాలను నమోదు చేశాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 సూచీ 0.25 శాతం పడిపోగా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 సూచీ 0.63 శాతం క్షీణించింది. వరుసగా ఏడు సెషన్లలో నిఫ్టీ మొత్తం 2 శాతం నష్టపోయింది. మరోవైపు సెన్సెక్స్ వరుసగా నాలుగో సెషన్‌లో నష్టాలను చవిచూసింది. ఈ నాలుగు సెషన్లలో సెన్సెక్స్ మొత్తం 1.5 శాతం పతనమైంది. అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌లో ముడి చ‌మురు ధ‌ర‌లు పెరుగుతుండ‌డం మార్కెట్ల ప‌త‌నానికి కార‌ణ‌మైంది. ప‌శ్చిమ ఆసియాలో నెల‌కొన్న యుద్ధ ఉద్రిక్త‌త‌ల కార‌ణంగా ముడి చ‌మురు ధ‌ర‌లు పెరుగుతుండ‌డం పెట్టుబ‌డిదారుల్లో ఆందోళ‌న క‌లిగిస్తోంది. దీంతో వారిపై తీవ్ర అమ్మ‌కాల ఒత్తిడి నెల‌కొంది. అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌లో బ్రెంట్ క్రూడ్ ధ‌ర ఈ ఒక్క సెష‌న్‌లోనే 0.49 శాతం మేర పెరిగి బ్యారెల్‌కు 90 డాల‌ర్ల‌కు చేర‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 0.58 శాతం మేర పెరిగి బ్యారెల్‌కు 85 డాల‌ర్ల‌కు చేరింది. ఫారెక్స్ మార్కెట్‌లో భార‌త రూపాయి మళ్లీ నిరాశాజ‌న‌క ప్ర‌ద‌ర్శ‌న చేసింది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 95.74 వ‌ద్ద ఉన్న రూపాయి ఈ సెష‌న్‌లో 0.08 శాతం మేర న‌ష్టోయింది.

Advertisement
Advertisement