త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | చమురు మంట.. మార్కెట్‌ల‌కు వరుసగా షాకులు..

Stock Markets | పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం, పెరిగిన చమురు ధరలు దేశీయ ఆర్థిక వ్యవస్థతోపాటు కంపెనీల ఆదాయాలపై చూపే ప్రభావంపై ఆందోళనలు భారత స్టాక్ మార్కెట్ల‌ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి. మంగళవారం బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 493 పాయింట్లు (0.63 శాతం) పతనమై 77,235.46 వద్ద ముగిసింది.

S

Business | Published On Aug 18, 2026, 4.11 pm IST

Stock Markets | చమురు మంట.. మార్కెట్‌ల‌కు వరుసగా షాకులు..
Advertisement

Stock Markets | పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం, పెరిగిన చమురు ధరలు దేశీయ ఆర్థిక వ్యవస్థతోపాటు కంపెనీల ఆదాయాలపై చూపే ప్రభావంపై ఆందోళనలు భారత స్టాక్ మార్కెట్ల‌ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి. మంగళవారం బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 493 పాయింట్లు (0.63 శాతం) పతనమై 77,235.46 వద్ద ముగిసింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 సూచీ వరుసగా ఆరో సెషన్‌లోనూ నష్టాలను నమోదు చేసింది. 133 పాయింట్లు (0.55 శాతం) నష్టంతో 24,154.90 వద్ద స్థిరపడింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ కూడా 0.43 శాతం నష్టపోగా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ దాదాపు మార్పు లేకుండా ముగిసింది. గత కొన్ని సెషన్లలో నిఫ్టీ 1.7 శాతం నష్టపోయింది. మరోవైపు సెన్సెక్స్ వరుసగా మూడో సెషన్‌లో నష్టాలను నమోదు చేయడంతో మొత్తంగా 1 శాతం కింద‌కు చేరింది.

 

పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

దేశీయ మార్కెట్‌ల‌కు ప్రస్తుతం అతిపెద్ద ఆందోళనగా పెరిగిన ముడి చమురు ధరలు నిలుస్తున్నాయి. అధిక చమురు ధరల కారణంగా దేశ ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడి పెరగవచ్చనే భయాలు నెలకొన్నాయి. ద్రవ్యోల్బణం పెరగడం, రూపాయి విలువ మరింత బలహీనపడటం, విదేశీ పెట్టుబడులు భారీగా బయటకు వెళ్లే అవకాశం ఉండటం వంటి అంశాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సెన్సెక్స్ ముగిసే సమయానికి చమురు ధరల అంతర్జాతీయ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు దాదాపు 91 డాలర్ల వద్ద ట్రేడైంది. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న వివాదానికి ఇంకా పరిష్కారం లభించకపోవడం చమురు ధరలపై ఒత్తిడిని కొనసాగిస్తోంది. హోర్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటించవచ్చన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ తిరస్కరించింది. అమెరికా దౌత్య ప్రయత్నాలు విఫలమైతే సకాలంలో, కచ్చితమైన దాడికి పాల్పడతామని ఇరాన్ హెచ్చరించినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. ఇక ఫారెక్స్ మార్కెట్‌లో భార‌త రూపాయి మ‌రోమారు ప‌త‌న‌మైంది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 95.67 వ‌ద్ద ఉన్న రూపాయి సెష‌న్‌లో 0.08 శాతం న‌ష్ట‌పోయింది.

Advertisement
Advertisement