Stock Markets | స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో సూచీలు..
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఆర్‌బీఐ మానెటరీ పాలసీ కమిటీ సమావేశం కారణంగా సూచీల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు తీవ్ర అస్థిరత ఏర్పడింది. ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ తరువాత కాసేపటికి భారీగా పతనమయ్యాయి. పలు మార్లు రికవరీ కోసం యత్నించినా చివరకు సెషన్ ముగింపులో నష్టాలను చవి చూశాయి.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఆర్‌బీఐ మానెటరీ పాలసీ కమిటీ సమావేశం కారణంగా సూచీల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు తీవ్ర అస్థిరత ఏర్పడింది. ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ తరువాత కాసేపటికి భారీగా పతనమయ్యాయి. పలు మార్లు రికవరీ కోసం యత్నించినా చివరకు సెషన్ ముగింపులో నష్టాలను చవి చూశాయి. ఈ క్రమంలోనే బీఎస్ఈ సెన్సెక్స్ 116.67 పాయింట్లు పతనమై 74,243.34 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 సూచీ 49.85 పాయింట్లు తగ్గి 23,366.70 వద్ద స్థిరపడింది. విస్తృత మార్కెట్ల సూచీలు సైతం నష్టాల్లోనే ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 0.35 శాతం పతనమవగా, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీ స్వల్ప నష్టాలను నమోదు చేసింది. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ మెటల్ సూచీ 1.6 శాతం పతనాన్ని నమోదు చేసింది. నిఫ్టీ మీడియా సైతం 3 శాతానికి పైగా క్షీణించింది. ఎన్ఎస్ఈలో మొత్తం 1649 స్టాక్స్ పతనమవగా, 1623 స్టాక్స్ లాభపడ్డాయి. మరో 94 స్టాక్స్‌లో మార్పు లేదు.
విదేశీ మార్కెట్లు సైతం..
విదేశీ పెట్టుబడిదారులకు భారత ప్రభుత్వం పలు అంశాల్లో సడలింపులు, మినహాయింపులు ప్రకటించింది. ముఖ్యంగా ప్రభుత్వ సెక్యూరిటీలను విక్రయిస్తే ఇప్పటి వరకు వసూలు చేస్తున్న క్యాపిటల్ గెయిన్స్ పన్నును వారికి పూర్తిగా మినహాయించారు. దీని వల్ల విదేశీ పెట్టుబడుల అవుట్ ఫ్లో ఆగుతుందని కేంద్రం భావిస్తోంది. అయినప్పటికీ మార్కెట్లపై ఏర్పడిన తీవ్ర అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు నష్టాల్లోనే కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్లలోనూ నెగెటివ్ సెంటిమెంట్ కనిపించింది. అమెరికా ఎస్ అండ్ పీ 500 ఫ్యూచర్స్ 0.6 శాతం తగ్గగా, జపాన్ టోపిక్స్ సూచీ 0.1 శాతం నష్టపోయింది. ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ 200 సూచీ 0.7 శాతం తగ్గింది. హాంగ్ కాంగ్ హాంగ్ సెంగ్ 0.4 శాతం క్షీణించగా, షాంఘై కంపోజిట్ స్వల్ప మార్పులకు గురైంది.
తగ్గిన చమురు ధరలు, బలపడ్డ రూపాయి..
అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరల్లోనూ తీవ్ర అస్థిరత నెలకొంది. చమురు ధరలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర 0.33 శాతం తగ్గి బ్యారెల్‌కు 93 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. అలాగే డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 0.24 శాతం తగ్గి బ్యారెల్‌కు 90 డాలర్ల వద్ద కొనసాగింది. ఫారెక్స్ మార్కెట్‌లో భారత రూపాయి విలువ బలపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 84 పైసలు పెరిగిన రూపాయి 94.93 వద్ద నిలిచింది. అయితే అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధం ముగియడం లేదా శాంతి ఒప్పందంపై స్పష్టత వస్తే కానీ మార్కెట్లలో అస్థిరత తగ్గదని, పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించాలని, రిస్క్ తీసుకునే ధోరణిని తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Stock Markets | భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు.. స్వల్పంగా పెరిగిన చమురు ధరలు..
జూన్ 5, 2026

Stock Markets | ఫ్లాట్ గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. నష్టాలతో మొదలై భారీగా రికవరీ..
జూన్ 4, 2026

Stock Markets | నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. స్వల్పంగా తగ్గిన చమురు ధరలు..
జూన్ 4, 2026
తాజావార్తలు
- ●Manipur Violence | మణిపూర్‌లో మళ్లీ హింస.. గ్రామంపై కాల్పులు, ఇళ్లకు నిప్పు.. ముగ్గురు మృతి
- ●Sai Pallavi | ధనుష్ సినిమాలో సాయి పల్లవి షాకింగ్ రోల్ - లేడీ సింగంగా నాచురల్ బ్యూటీ
- ●Harish Rao vs Revanth Reddy | రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంతో తెలంగాణ జల హక్కులకే ముప్పు: సీఎంకు హరీశ్ రావు బహిరంగ లేఖ
- ●Hiroshima Delegation | తెలంగాణ అసెంబ్లీని సందర్శించిన హిరోషిమా ప్రతినిధుల బృందం
- ●Trichy East | టీవీకే బిగ్ ట్విస్ట్.. తిరుచ్చి ఈస్ట్ నుంచి రాఘవ లారెన్స్ పోటీ..?
- ●Metformin | మధుమేహ మందు మెట్ఫార్మిన్.. మరెన్నో రోగాలకు ఆశాకిరణం..

Manipur Violence | మణిపూర్‌లో మళ్లీ హింస.. గ్రామంపై కాల్పులు, ఇళ్లకు నిప్పు.. ముగ్గురు మృతి

Sai Pallavi | ధనుష్ సినిమాలో సాయి పల్లవి షాకింగ్ రోల్ - లేడీ సింగంగా నాచురల్ బ్యూటీ

Harish Rao vs Revanth Reddy | రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంతో తెలంగాణ జల హక్కులకే ముప్పు: సీఎంకు హరీశ్ రావు బహిరంగ లేఖ

Hiroshima Delegation | తెలంగాణ అసెంబ్లీని సందర్శించిన హిరోషిమా ప్రతినిధుల బృందం



