Stock Markets | ఫ్లాట్ గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. నష్టాలతో మొదలై భారీగా రికవరీ..
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. ప్రారంభంలో నష్టాలతో మొదలైన సూచీలు తరువాత భారీగా రికవర్ అయ్యాయి. దీంతో సెషన్ ముగిసే సమయానికి నిఫ్టీ50 సూచీ 10.95 పాయింట్ల లాభంతో 23,416.55 వద్ద స్థిరపడగా, సెన్సెక్స్ 13.84 పాయింట్లు లాభపడి 74,360.01 వద్ద నిలిచింది.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. ప్రారంభంలో నష్టాలతో మొదలైన సూచీలు తరువాత భారీగా రికవర్ అయ్యాయి. దీంతో సెషన్ ముగిసే సమయానికి నిఫ్టీ50 సూచీ 10.95 పాయింట్ల లాభంతో 23,416.55 వద్ద స్థిరపడగా, సెన్సెక్స్ 13.84 పాయింట్లు లాభపడి 74,360.01 వద్ద నిలిచింది. అయితే బెంచ్ మార్క్ సూచీలు ఫ్లాట్‌గా ముగిసినప్పటికీ విస్తృత మార్కెట్ సూచీలు మాత్రం మంచి లాభాలను నమోదు చేశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్‌లు 0.5 శాతం చొప్పున పెరిగాయి. నిఫ్టీ కన్‌జ్యూమర్ డ్యూరబుల్స్ సూచీ 2 శాతానికి పైగా పెరిగి ర్యాలీని కొనసాగించింది. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 0.7 శాతం మేర పతనమైంది. ఎన్ఎస్ఈలో మొత్తం ఉన్న స్టాక్స్‌లో 1817 స్టాక్స్ లాభ పడగా, 1474 షేర్లు పతనమయ్యాయి. మరో 105 స్టాక్స్‌లో ఎలాంటి మార్పు లేదు.
అంతర్జాతీయ సూచీలు నష్టాల్లో..
టోక్యో కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు అమెరికా ఎస్ అండ్ పీ 500 ఫ్యూచర్స్ 0.6 శాతం క్షీణించాయి. జపాన్ టోపిక్స్ ఇండెక్స్ 4.6 శాతం భారీగా పతనమవ్వగా, ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ 200 సూచీ 2.2 శాతం తగ్గింది. హాంగ్ కాంగ్ హాంగ్ సెంగ్ సూచీ 2.8 శాతం తగ్గింది. షాంగై కంపోజిట్ 1.4 శాతం మేర పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లన్నీ నెగెటివ్‌లో ఉన్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం నష్టాల నుంచి భారీగా కోలుకుని పాజిటివ్‌గా ముగియడం విశేషం. అయితే అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన తీర్మానమే దేశీయ మార్కెట్లలో ర్యాలీకి ప్రధాన కారణమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్‌పై సైనిక చర్యను నిలిపివేయాలని ప్రతినిధుల సభలో అధ్యక్షుడు ట్రంప్‌కు వ్యతిరేకంగా బిల్లు ప్రవేశపెట్టగా దానికి ఆమోదం లభించింది. దీంతో గురువారం నాడు అమెరికా మార్కెట్లు భారీగా లాభపడే చాన్స్ ఉందని, దీని ప్రభావం దేశీయ మార్కెట్లలో శుక్రవారం కనిపించే చాన్స్ ఉందని, ఇప్పటికే చాలా వరకు రికవర్ అయిందని విశ్లేషకులు తెలిపారు.
భారీగా తగ్గిన చమురు ధరలు..
కాగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు భారీగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర 1.20 శాతం తగ్గి బ్యారెల్‌కు 95.665 వద్ద నిలవగా, డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 1.14 శాతం తగ్గి బ్యారెల్‌కు 92.845 వద్ద నిలిచింది. ఫారెక్స్ మార్కెట్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ మరోమారు భారీగా తగ్గింది. డాలర్‌కు 8 పైసలు నష్టపోయిన రూపాయి 95.77 వద్ద నిలిచి మళ్లీ ఆల్ టైం కనిష్ట దిశగా కదులుతోంది. అయితే ప్రస్తుతం మార్కెట్లలో వేచి చూసే ధోరణి కనిపిస్తుందని, యుద్ధం, ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గితే తప్ప మార్కెట్లలో మళ్లీ పాజిటివ్ ప్రభావం కనిపించే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.
సంబంధిత వార్తలు

Stock Markets | వరుసగా 5వ రోజు నష్టాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 4 నెలల్లో అతి పెద్ద పతనం..
జులై 24, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లకు చమురు ధరల షాక్.. సూచీలు భారీగా పతనం..
జులై 24, 2026

Stock Markets | మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లు కుదేలు.. నాలుగు రోజుల్లో రూ.4 లక్షల కోట్ల నష్టం..
జులై 23, 2026
తాజావార్తలు
- ●Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..
- ●Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..

Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..

Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?

Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?



