Hiroshima Delegation | తెలంగాణ అసెంబ్లీని సందర్శించిన హిరోషిమా ప్రతినిధుల బృందం
Hiroshima Delegation | జపాన్ హిరోషిమాకు చెందిన ప్రతినిధుల బృందం తెలంగాణ శాసనసభ, శాసన మండలిని సందర్శించింది. ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ప్రతినిధులకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.
Hiroshima Delegation | జపాన్ హిరోషిమాకు చెందిన ప్రతినిధుల బృందం తెలంగాణ శాసనసభ, శాసన మండలిని సందర్శించింది. ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ప్రతినిధులకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. శాసనసభ, శాసన మండలి సమావేశ మందిరాలను సందర్శించిన అనంతరం ప్రతినిధుల బృందం చైర్మన్ ఛాంబర్‌లో సమావేశమైంది. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిందన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ప్రపంచంలోని అనేక దేశాలకు చెందిన ప్రజలు నివసిస్తూ, తమ వ్యాపార కార్యకలాపాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.
శాసనసభ, శాసన మండలిలోని ప్రజాప్రతినిధులు సమర్థవంతంగా చట్టాల రూపకల్పనలో భాగస్వాములవుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టి, నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని వివరించారు. హిరోషిమా రాష్ట్రానికి చెందిన ప్రతినిధుల బృందం తెలంగాణను సందర్శించడం రెండు ప్రాంతాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేసే శుభపరిణామమని గుత్తా అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో శాసన మండలి విప్‌లు అద్దంకి దయాకర్, వెంకట నర్సింగరావు, ఎమ్మెల్సీలు దాసోజు శ్రావణ్, అంజి రెడ్డి, ఎమ్మెల్యేలు టీ రామ్మోహన్ రెడ్డి, పాల్వాయి హరీశ్, శాసన మండలి కార్యదర్శి డాక్టర్ నర్సింహాచార్యులు, శాసనసభ కార్యదర్శి ఆర్ తిరుపతి పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | తిన్నది అరిగేదాక తిరిగండి.. బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ సెటైర్లు
జూన్ 5, 2026

CM Revanth Reddy | భూసేకరణ జరుగకుండా ప్రాజెక్టు పూర్తవుతుందని కేసీఆర్ ఎట్ల అనుకున్నరు? ప్రశ్నించిన సీఎం రేవంత్
జూన్ 5, 2026

MP Dharmapuri Aravind | గడ్డాలు తెల్లవడుతున్నా మళ్లా గదే సబ్జెక్టు.. సుతిలీలు లేవు.. సంచులు లేవని చెప్పుడేంది: ధర్మపురి అరవింద్
జూన్ 5, 2026
తాజావార్తలు
- ●Web Series | హీరోగా మారిన టాలీవుడ్ కమెడియన్ - వెరైటీ టైటిల్‌తో వెబ్‌సిరీస్
- ●CM Revanth Reddy | భూసేకరణ జరుగకుండా ప్రాజెక్టు పూర్తవుతుందని కేసీఆర్ ఎట్ల అనుకున్నరు? ప్రశ్నించిన సీఎం రేవంత్
- ●IIT Roorkee | క్లౌడ్ స్టోరేజ్ కాంపోనెంట్లో సమస్య వాస్తవమే.. కానీ,.. డేటా లీక్ ఆరోపణలపై ఐఐటీ రూర్కీ క్లారిటీ
- ●MP Dharmapuri Aravind | గడ్డాలు తెల్లవడుతున్నా మళ్లా గదే సబ్జెక్టు.. సుతిలీలు లేవు.. సంచులు లేవని చెప్పుడేంది: ధర్మపురి అరవింద్
- ●Google Search | గూగుల్ కొత్త ఫీచర్.. సెర్చ్‌లోనే క్రియేటర్లకు ప్రత్యేక ప్రొఫైల్..
- ●Janhvi Kapoor | పెద్దిలో జాన్వీ కపూర్ రోల్‌పై దారుణంగా ట్రోల్స్ - శ్రీదేవి కూతురికి అవమానం అంటూ నెటిజన్ల కామెంట్స్

Web Series | హీరోగా మారిన టాలీవుడ్ కమెడియన్ - వెరైటీ టైటిల్‌తో వెబ్‌సిరీస్

CM Revanth Reddy | భూసేకరణ జరుగకుండా ప్రాజెక్టు పూర్తవుతుందని కేసీఆర్ ఎట్ల అనుకున్నరు? ప్రశ్నించిన సీఎం రేవంత్

IIT Roorkee | క్లౌడ్ స్టోరేజ్ కాంపోనెంట్లో సమస్య వాస్తవమే.. కానీ,.. డేటా లీక్ ఆరోపణలపై ఐఐటీ రూర్కీ క్లారిటీ

MP Dharmapuri Aravind | గడ్డాలు తెల్లవడుతున్నా మళ్లా గదే సబ్జెక్టు.. సుతిలీలు లేవు.. సంచులు లేవని చెప్పుడేంది: ధర్మపురి అరవింద్



