త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | స్టాక్ మార్కెట్లు ఫ్లాట్.. సెన్సెక్స్ స్వల్ప లాభం, నిఫ్టీ స్వ‌ల్ప నష్టంలో ముగింపు..

Stock Markets | గ్లోబల్ అనిశ్చితుల ప్రభావంతో భారత ఈక్విటీ మార్కెట్లు బుధవారం ఇంట్రాడే లాభాలను నిలబెట్టుకోలేక దాదాపు ఫ్లాట్‌గా ముగిశాయి. ట్రేడింగ్ చివర్లో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో ప్రధాన సూచీలు మిశ్రమంగా క్లోజ్ అయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 64.42 పాయింట్లు పెరిగి 73,983.18 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 50 సూచీ 27.15 పాయింట్లు కోల్పోయి 23,214.95 వద్ద స్థిరపడింది.

S

Business | Published On Jun 10, 2026, 3.57 pm IST

Stock Markets | స్టాక్ మార్కెట్లు ఫ్లాట్.. సెన్సెక్స్ స్వల్ప లాభం, నిఫ్టీ స్వ‌ల్ప నష్టంలో ముగింపు..
Advertisement

Stock Markets | గ్లోబల్ అనిశ్చితుల ప్రభావంతో భారత ఈక్విటీ మార్కెట్లు బుధవారం ఇంట్రాడే లాభాలను నిలబెట్టుకోలేక దాదాపు ఫ్లాట్‌గా ముగిశాయి. ట్రేడింగ్ చివర్లో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో ప్రధాన సూచీలు మిశ్రమంగా క్లోజ్ అయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 64.42 పాయింట్లు పెరిగి 73,983.18 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 50 సూచీ 27.15 పాయింట్లు కోల్పోయి 23,214.95 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో అత్యధిక లాభాలు నమోదు చేసిన షేర్లలో నెస్లే ఇండియా, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హిందుస్తాన్ యూనిలీవర్, ఐసీఐసీఐ బ్యాంక్ ఉన్నాయి. ఇక నష్టపోయిన షేర్లలో కోల్ ఇండియా, హిందాల్కో ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, ఓఎన్‌జీసీ, ఎటర్నల్ నిలిచాయి. మార్కెట్ భయ సూచికగా భావించే ఇండియా విక్స్ 0.32 శాతం స్వల్ప పెరుగుదలతో 15.63 వద్ద ముగిసింది.

త‌గ్గిన చ‌మురు ధ‌ర‌లు, బ‌ల‌ప‌డ్డ రూపాయి..

రంగాల వారీగా చూస్తే ఎఫ్‌ఎంసీజీ, ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లు మాత్రమే లాభాల్లో ముగిశాయి. మిగిలిన అన్ని సెక్టోరల్ సూచీలు నష్టాల్లోనే క్లోజ్ అయ్యాయి. ముఖ్యంగా మీడియా, ఎనర్జీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, రియాల్టీ, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు 1 నుంచి 2 శాతం వరకు క్షీణించాయి. విస్తృత మార్కెట్‌లో కూడా బలహీనత కనిపించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీలు దాదాపు 1 శాతం చొప్పున పడిపోయాయి. కరెన్సీ మార్కెట్‌లో భారత రూపాయి డాలర్‌తో పోలిస్తే బలపడింది. బుధవారం డాలర్‌తో పోలిస్తే భార‌త రూపాయి 6 పైస‌లు లాభ‌ప‌డి 95.27 వద్ద ముగిసింది. ఇక అంత‌ర్జాతీయ మార్కెట్‌లో చ‌మురు ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర 0.17 శాతం త‌గ్గి బ్యారెల్‌కు 90.61 డాల‌ర్ల వ‌ద్ద ముగియ‌గా, డబ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 0.26 శాతం త‌గ్గి బ్యారెల్‌కు 86.91 డాల‌ర్ల వ‌ద్ద నిలిచింది.

Advertisement
Advertisement