త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | స్టాక్ మార్కెట్‌ల‌లో స్వల్ప నష్టాలు.. బ్యాంకింగ్ షేర్ల మ‌ద్ద‌తు..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ గరిష్ఠంగా 89 పాయింట్ల వరకు పడిపోగా, నిఫ్టీ50 సూచీ ఇంట్రాడే కనిష్ఠంగా 24,210 స్థాయిని తాకింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్‌సీఎల్ టెక్, ఐటీసీ వంటి ఇండెక్స్ హెవీవెయిట్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి మార్కెట్లపై ప్రభావం చూపింది.

S

Business | Published On Aug 21, 2026, 10.37 am IST

Stock Markets | స్టాక్ మార్కెట్‌ల‌లో స్వల్ప నష్టాలు.. బ్యాంకింగ్ షేర్ల మ‌ద్ద‌తు..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ గరిష్ఠంగా 89 పాయింట్ల వరకు పడిపోగా, నిఫ్టీ50 సూచీ ఇంట్రాడే కనిష్ఠంగా 24,210 స్థాయిని తాకింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్‌సీఎల్ టెక్, ఐటీసీ వంటి ఇండెక్స్ హెవీవెయిట్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి మార్కెట్లపై ప్రభావం చూపింది. అయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎటర్నల్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లలో కొనుగోళ్ల ఆసక్తి కనిపించడంతో మార్కెట్లలో నష్టాలు పరిమితమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయానికి సెన్సెక్స్ 34 పాయింట్లు తగ్గి 77,504 వద్ద, నిఫ్టీ50 సూచీ 11 పాయింట్లు క్షీణించి 24,222 వద్ద కొనసాగాయి.

భారీగా పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

ఆసియా మార్కెట్లలో మాత్రం ఎక్కువగా సానుకూల పరిస్థితులు కనిపించాయి. చైనా షాంఘై కాంపోజిట్ సూచీ 0.09 శాతం పెరగగా, హాంకాంగ్ హాంగ్ సెంగ్ 0.7 శాతం, దక్షిణ కొరియా కోస్పి 1.2 శాతం లాభపడ్డాయి. జపాన్ నిక్కీ మాత్రం 0.4 శాతం నష్టపోయింది. అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. చమురు ధరలు, అధిక ద్రవ్యోల్బణంపై ఆందోళనలు, అమెరికా ప్రభుత్వ రుణభారం పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 1.32 శాతం, ఎస్‌అండ్‌పీ 500 సూచీ 0.9 శాతం, టెక్నాలజీ ఆధారిత నాస్‌డాక్ 1 శాతం చొప్పున పడిపోయాయి. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ సీఎన్‌బీసీతో మాట్లాడుతూ ఇరాన్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేలా వాషింగ్టన్ చరిత్రలోనే అత్యంత కఠినమైన ఆంక్షలను విధించనుందని, ఈ ప్రయత్నంలో చైనా సహా ఇతర దేశాలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునివ్వడంతో బ్రెంట్ క్రూడ్ ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0.46 శాతం వరకు పెరిగి బ్యారెల్‌కు 94.21 డాలర్ల ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకాయి. ఫారెక్స్ మార్కెట్‌లో భార‌త రూపాయి మ‌రోమారు బ‌ల‌హీన ప్ర‌ద‌ర్శ‌న చేసింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 0.03 శాతం న‌ష్ట‌పోయిన రూపాయి, డాల‌ర్ విలువ‌కు 95.70 వ‌ద్ద నిలిచింది.

Advertisement
Advertisement