Stock Markets | వణుకు పుట్టిస్తున్న ముడి చమురు ధరలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
Stock Markets | పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు, ఇరాన్-అమెరికాల మధ్య శాంతి చర్చలు కొలిక్కి రాకపోవడం, పెరుగుతున్న ముడి చమురు ధరలు తదితర కారణాల వల్ల దేశీయ సూచీలు నష్టాలను కొనసాగిస్తున్నాయి. ఉదయం సెషన్‌ను గ్యాప్ అప్‌తో ప్రారంభించినప్పటికీ ఆ లాభాలను సూచీలు నిలబెట్టుకోలేకపోయాయి.
Stock Markets | పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు, ఇరాన్-అమెరికాల మధ్య శాంతి చర్చలు కొలిక్కి రాకపోవడం, పెరుగుతున్న ముడి చమురు ధరలు తదితర కారణాల వల్ల దేశీయ సూచీలు నష్టాలను కొనసాగిస్తున్నాయి. ఉదయం సెషన్‌ను గ్యాప్ అప్‌తో ప్రారంభించినప్పటికీ ఆ లాభాలను సూచీలు నిలబెట్టుకోలేకపోయాయి. దీంతో ఇంట్రా డే కనిష్టానికి దగ్గర్లో ట్రేడయ్యాయి. సెషన్ ముగిసే సమయానికి సూచీలు ఫ్లాట్‌గా స్థిరపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ కేవలం 3 పాయింట్లు అత్యంత స్వల్పంగా పెరిగి 77,540.83 వద్ద ముగియగా, నిఫ్టీ 50 సూచీ 20 పాయింట్లు పెరిగి 24,252 వద్ద స్థిరపడింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 సూచీ 0.8 శాతం పెరగ్గా, నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 సూచీ 0.41 శాతం పెరిగింది. ప్రధాన సూచీల్లో లాభాలు పరిమితమైనప్పటికీ విస్తృత మార్కెట్లలో మాత్రం కొనుగోళ్ల ఉత్సాహం కనిపించింది.
పెరిగిన చమురు ధరలు..
అంతర్జాతీయ మార్కెట్‌లలో ముడి చమురు ధరలు రోజూ పెరుగుతుండడం పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. దీంతో వారు రిస్క్ తీసుకునే ధోరణిని తగ్గించారు. లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఈ సెషన్‌లో 0.44 శాతం పెరిగి బ్యారెల్‌కు 91 డాలర్ల వద్ద స్థిరపడగా, డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 0.36 శాతం పెరిగి బ్యారెల్‌కు 87 డాలర్లకు చేరింది. పశ్చిమ ఆసియాలో ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధం రోజు రోజుకీ తీవ్రరూపం దాలుస్తుండడం, శాంతి చర్చలపై ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో పెట్టుబడిదారులపై తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో చమురు సరఫరాకు ఆటంకం కలగవచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. చమురు ధరలు పెరుగుతుండడం కూడా ఈ అనుమానాలకు బలమిస్తోంది. దీంతో ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర అస్థిరత నెలకొంది. ఇక ఫారెక్స్ మార్కెట్‌లో భారత రూపాయి ఈ సెషన్‌లో ఉదయం ప్రారంభంలో కాస్త బలహీనపడినా సెషన్ ముగిసే సమయానికి కాస్త లాభపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 0.01 శాతం లాభపడ్డ రూపాయి 95.68 వద్ద నిలిచింది.
నెలలో ఇప్పటి వరకు 0.50 శాతం మేర నష్టం..
ఈ వారంలో మొత్తం మీద సెన్సెక్స్ 0.60 శాతం పతనమవ్వగా, నిఫ్టీ 50 సూచీ 0.50 శాతం నష్టపోయింది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న పరిణామాలతోపాటు పెరుగుతున్న ముడి చమురు ధరలే మార్కెట్ల పతనానికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సెన్సెక్స్, నిఫ్టీ50 ఈ నెలలో ఇప్పటి వరకు దాదాపు 0.50 శాతం చొప్పున పతనమవ్వగా, 2 నెలల పాటు వచ్చిన లాభాలకు బ్రేక్ పడింది. అమెరికా-ఇరాన్ చర్చలపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో పెట్టుబడిదారులు రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడడం లేదు. అయితే మార్కెట్లకు వచ్చే వారం మరింత కీలకమని, ఆ వారంలో దిశ నిర్దేశం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Education | అమెరికాలో తక్కువ ఖర్చుతో కోర్సులను అందిస్తున్న టాప్ 5 యూనివర్సిటీలు ఇవే..
- ●Balmuri Venkat | బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కై సీఎం పర్యటను అడ్డుకున్నయ్ : బల్మూరి వెంకట్
- ●MLA Megha Reddy | చిన్నారెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించండి... ఖర్గేకు మేఘారెడ్డి ఫిర్యాదు
- ●Beerla Ilaiah | సుష్మిత వ్యాఖ్యలను కొండ సురేఖ ఖండించాలే : ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
- ●Bharathi Mukhi Accident Case | యువతి భారతి ముఖి మృతి కేసులో నిందితుడి గుర్తింపు.. నిర్లక్ష్య డ్రైవింగే కారణమని నిర్ధారణ
- ●Sowcar Janaki | దిగ్గజ నటి షావుకారు జానకి కన్నుమూత - రెండు వందల తెలుగు సినిమాల్లో హీరోయిన్గా!

Education | అమెరికాలో తక్కువ ఖర్చుతో కోర్సులను అందిస్తున్న టాప్ 5 యూనివర్సిటీలు ఇవే..

Balmuri Venkat | బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కై సీఎం పర్యటను అడ్డుకున్నయ్ : బల్మూరి వెంకట్

MLA Megha Reddy | చిన్నారెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించండి... ఖర్గేకు మేఘారెడ్డి ఫిర్యాదు

Beerla Ilaiah | సుష్మిత వ్యాఖ్యలను కొండ సురేఖ ఖండించాలే : ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య






