Stock Markets | నష్టాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారులపై తీవ్ర అమ్మకాల ఒత్తిడి..
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభంలో గ్యాప్ అప్‌తో సూచీలు మొదలైనప్పటికీ ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి పెరిగింది. దీంతో కొన్ని నిమిషాల వ్యవధిలోనే మార్కెట్లు పతనమయ్యాయి. సెన్సెక్స్ 210 పాయింట్లకు పైగా పతనమై 76,500 వద్ద నిలవగా, నిఫ్టీ50 సూచీ 80 పాయింట్లకు పైగా పతనమై 23,850 వద్ద ఉంది.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభంలో గ్యాప్ అప్‌తో సూచీలు మొదలైనప్పటికీ ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి పెరిగింది. దీంతో కొన్ని నిమిషాల వ్యవధిలోనే మార్కెట్లు పతనమయ్యాయి. సెన్సెక్స్ 210 పాయింట్లకు పైగా పతనమై 76,500 వద్ద నిలవగా, నిఫ్టీ50 సూచీ 80 పాయింట్లకు పైగా పతనమై 23,850 వద్ద ఉంది. అమెరికా-ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందం విఫలమవడం పెట్టుబడిదారుల్లో ఆందోళనలను మరింత పెంచింది. ఆసియా మార్కెట్లు సైతం బలహీనతను ప్రదర్శిస్తుండడంతో దేశీయ సూచీలపై ఒత్తిడి పెరిగింది. నిఫ్టీ టాప్ గెయినర్లలో మారుతి సుజుకి 1.45 శాతం పెరిగి రూ.13,607.00 వద్ద ట్రేడైంది. యాక్సిస్ బ్యాంక్ 1.19 శాతం లాభంతో రూ.1,373.00కు చేరుకుంది. నెస్లే ఇండియా 1.03 శాతం పెరిగి రూ.1,401.60 వద్ద నిలిచింది. అదానీ పోర్ట్స్ 0.79 శాతం ఎగబాకి రూ.1,790.20కు చేరగా, సన్ ఫార్మా 0.76 శాతం పెరిగి రూ.1,889.00 వద్ద ట్రేడైంది.
పెరిగిన చమురు ధరలు..
మరోవైపు నష్టాల్లో ఐషర్ మోటార్స్ 4.87 శాతం పతనమై రూ.7,064.00కు చేరింది. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ 3.54 శాతం తగ్గి రూ.1,073.40 వద్ద ట్రేడైంది. ఇన్ఫోసిస్ 1.79 శాతం క్షీణించి రూ.1,018.10కు చేరగా, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ 1.21 శాతం తగ్గి రూ.1,359.00 వద్ద నిలిచింది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ 1.05 శాతం పడిపోయి రూ.577.10 వద్ద ట్రేడైంది. వారాంతంలో అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన సైనిక పరిణామాల ప్రభావంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరిగాయి. దీంతో ఆ ప్రభావం ఈక్విటీ మార్కెట్లపై పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర 0.51 శాతం పెరిగి బ్యారెల్‌కు 73 డాలర్ల వద్ద ఉండగా, డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 0.47 శాతం పెరిగి బ్యారెల్‌కు 70 డాలర్ల వద్ద ఉంది. ఇక ఫారెక్స్ మార్కెట్‌లో మరోమారు భారత రూపాయి బలహీనతను ప్రదర్శించింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 94.61 వద్ద ఉన్న రూపాయి ఇవాళ్టి సెషన్‌లో 0.09 శాతం పతనమైంది.
పెరుగుతున్న ఇంధన సరఫరా ఆందోళనలు..
హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకాయానానికి అంతరాయం ఏర్పడితే ఇంధన సరఫరాలు, ద్రవ్యోల్బణం, ప్రపంచ మార్కెట్ల రిస్క్ సెంటిమెంట్‌పై మళ్లీ ఆందోళనలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీని వల్లే మార్కెట్లపై మళ్లీ ఒత్తిడి పెరుగుతుందని తెలిపారు. అలాగే దేశీయంగా ఆలస్యంగా ప్రారంభమైన రుతుపవనాల కారణంగా గతేడాదితో పోలిస్తే వేసవి పంటల సాగు మందగించడం కూడా ఆందోళన కలిగిస్తోందని, దీనివల్ల వ్యవసాయ ఉత్పత్తి, గ్రామీణ డిమాండ్‌పై ప్రభావం పడే అవకాశాలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించాయని అన్నారు. బలమైన రుణ వృద్ధి, మెరుగైన నెట్ ఇంటరెస్ట్ మార్జిన్ల కారణంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలు మంచి ప్రదర్శన కొనసాగిస్తాయని, బలహీనమైన రుతుపవనాల నేపథ్యంలో హెల్త్‌కేర్ రంగం రక్షణాత్మక పెట్టుబడిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
సంబంధిత వార్తలు

Stock Markets | యుద్ధం ఉద్రిక్తతల ఎఫెక్ట్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, పెరిగిన చమురు ధరలు..
జూన్ 29, 2026

Stock Markets | మళ్లీ మొదలైన యుద్ధ ఉద్రిక్తతలు.. ఫ్లాట్‌గా ట్రేడవుతున్న సూచీలు..
జూన్ 29, 2026

NSE | స్టాక్ ధర కాదు.. వ్యాపారమే ముఖ్యం.. ఎన్ఎస్ఈ సీఈఓ కీలక సూచనలు..
జూన్ 26, 2026
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.18వేలు తగ్గిన బంగారం ధర.. పెట్టుబడిదారులకు అలర్ట్..
- ●WhatsApp | ఇక వాట్సాప్‌లో ఫోన్ నంబర్ లేకుండానే చాట్.. యూజర్‌నేమ్ ఫీచర్ వస్తోంది..
- ●Brazil Vs Japan | జపాన్ను దాటేసిన బ్రెజిల్
- ●Rules Change July 1st | జరిమానా డబుల్.. పెరగనున్న పాస్‌పోర్ట్ ఫీజులు.. జులై 1 నుంచి జరిగే మార్పులు ఇవే..!
- ●FIFA 2026 | బ్రెజిల్ చేతిలో ఓటమి.. తలవంచి అభిమానులకు క్షమాపణలు చెప్పిన జపాన్ కోచ్ హజిమే
- ●Lightning strikes | 24 గంటల్లో 3 లక్షలకు పైగా పిడుగులు.. కాలిపోయిన పలు ఇండ్లు

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.18వేలు తగ్గిన బంగారం ధర.. పెట్టుబడిదారులకు అలర్ట్..

WhatsApp | ఇక వాట్సాప్‌లో ఫోన్ నంబర్ లేకుండానే చాట్.. యూజర్‌నేమ్ ఫీచర్ వస్తోంది..

Brazil Vs Japan | జపాన్ను దాటేసిన బ్రెజిల్

Rules Change July 1st | జరిమానా డబుల్.. పెరగనున్న పాస్‌పోర్ట్ ఫీజులు.. జులై 1 నుంచి జరిగే మార్పులు ఇవే..!



