Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.18వేలు తగ్గిన బంగారం ధర.. పెట్టుబడిదారులకు అలర్ట్..
Gold And Silver Prices Today | పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవడం, అమెరికా, ఇరాన్ దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటుండడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు మళ్లీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం ఈ వారం బలహీనంగా ప్రారంభమయ్యాయి.
Gold And Silver Prices Today | పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవడం, అమెరికా, ఇరాన్ దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటుండడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు మళ్లీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం ఈ వారం బలహీనంగా ప్రారంభమయ్యాయి. ఇదే ప్రభావం కారణంగా బులియన్ మార్కెట్‌లలో బంగారం, వెండి ధరలు రోజు రోజుకీ విపరీతంగా తగ్గుతాయి. మంగళవారం నాటి సెషన్ లో అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఔన్స్ బంగారం ధర 0.78 శాతం మేర పతనమై 3,985 డాలర్లకు చేరగా, వెండి ధర 1.49 శాతం మేర పతనమై 57 డాలర్లకు చేరుకుంది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1151 పాయింట్లు తగ్గి 1,41,251కు చేరగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1134 పాయింట్లు తగ్గి 2,21,383కి చేరుకుంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు భారీగా క్షీణించాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,013 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,12, 104 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,40,130 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,01,300 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.18వేలు తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.12,845 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,02,760గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,28,450 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.12,84,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.16,500 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,510 ఉండగా, 8 గ్రాముల ధర రూ.84,080గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,05,100 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.10,51,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.13,500 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,35,000 ఉండగా, తులం ధర రూ.2,350గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి కిలోకు రూ.5వేలు తగ్గింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,44,900 ఉండగా, తులం ధర రూ.2,449 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | యుద్ధం ఎఫెక్ట్.. మళ్లీ తగ్గుతున్న బంగారం ధరలు..
జూన్ 29, 2026

Gold And Silver Prices Today | భారీగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుతుందా..?
జూన్ 27, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. కొనుగోదారుల ఆసక్తి పెరుగుతుందా..?
జూన్ 26, 2026
తాజావార్తలు
- ●Bengal refinery | హల్దియా రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం.. 20 మందికి గాయాలు.. రైలు సర్వీసులకు అంతరాయం
- ●OnePlus | అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో వన్‌ప్లస్ భారీ ఆఫర్లు.. ఏ ఫోన్‌పై ఎంత తగ్గింపు?
- ●FIFA 2026 | నెదర్లాండ్స్ షూటౌట్!
- ●Harish Rao | జూన్ 30, 2025... తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు : హరీశ్‌రావు
- ●BRS Party | ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని విమర్శిస్తే సహించేది లేదు : అనిల్ బైరెడ్డి
- ●WhatsApp | ఇక వాట్సాప్‌లో ఫోన్ నంబర్ లేకుండానే చాట్.. యూజర్‌నేమ్ ఫీచర్ వస్తోంది..

Bengal refinery | హల్దియా రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం.. 20 మందికి గాయాలు.. రైలు సర్వీసులకు అంతరాయం

OnePlus | అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో వన్‌ప్లస్ భారీ ఆఫర్లు.. ఏ ఫోన్‌పై ఎంత తగ్గింపు?

FIFA 2026 | నెదర్లాండ్స్ షూటౌట్!

Harish Rao | జూన్ 30, 2025... తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు : హరీశ్‌రావు



