త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | యుద్ధం ఉద్రిక్త‌త‌ల ఎఫెక్ట్‌.. న‌ష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

Stock Markets | మ‌ధ్య‌ప్రాచ్యంలో పెరిగిన యుద్ధ ఉద్రిక్త‌త‌ల కార‌ణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ న‌ష్టాల‌ను న‌మోదు చేశాయి. రెండు రోజుల పాటు వ‌చ్చిన ర్యాలీకి బ్రేక్ వేస్తూ బెంచ్ మార్క్ సూచీలు నిఫ్టీ50, సెన్సెక్స్ న‌ష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ50 సూచీ 109.75 పాయింట్లు త‌గ్గి 23,946.25 వ‌ద్ద ముగియ‌గా, సెన్సెక్స్ 372.10 పాయింట్ల మేర ప‌త‌న‌మై 76,728.37 వ‌ద్ద స్థిర‌ప‌డింది.

S

Business | Published On Jun 29, 2026, 3.57 pm IST

Stock Markets | యుద్ధం ఉద్రిక్త‌త‌ల ఎఫెక్ట్‌.. న‌ష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..
Advertisement

Stock Markets | మ‌ధ్య‌ప్రాచ్యంలో పెరిగిన యుద్ధ ఉద్రిక్త‌త‌ల కార‌ణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ న‌ష్టాల‌ను న‌మోదు చేశాయి. రెండు రోజుల పాటు వ‌చ్చిన ర్యాలీకి బ్రేక్ వేస్తూ బెంచ్ మార్క్ సూచీలు నిఫ్టీ50, సెన్సెక్స్ న‌ష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ50 సూచీ 109.75 పాయింట్లు త‌గ్గి 23,946.25 వ‌ద్ద ముగియ‌గా, సెన్సెక్స్ 372.10 పాయింట్ల మేర ప‌త‌న‌మై 76,728.37 వ‌ద్ద స్థిర‌ప‌డింది. పెట్టుబ‌డిదారులు లాభాల బుకింగ్‌కు ఆస‌క్తి చూపించ‌డం, పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్త‌త‌లు, స్వ‌ల్పంగా పెరిగిన చ‌మురు ధ‌ర‌ల కార‌ణంగా మార్కెట్ల‌లో అమ్మ‌కాల ఒత్తిడి క‌నిపించింది. విస్తృత మార్కెట్ సూచీలు సైతం న‌ష్టాల్లోనే ముగిశాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.37 ప‌త‌న‌మ‌వ్వ‌గా, స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 0.62 శాతం త‌గ్గింది. సోమ‌వారం మార్కెట్లు న‌ష్టాల్లో ముగియ‌డంతో మ‌దుప‌ర్లు రూ.1 ల‌క్ష కోట్ల మేర సంప‌ద‌ను న‌ష్ట‌పోయారు. బీఎస్ఈలో న‌మోదైన కంపెనీల మార్కెట్ క్యాపిట‌ల్ గ‌త సెష‌న్‌లోని రూ.475 ల‌క్ష‌ల కోట్ల నుంచి రూ.474 ల‌క్ష‌ల కోట్ల‌కు ప‌డిపోయింది.

స్వ‌ల్పంగా పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

అంత‌ర్జాతీయ మార్కెట్ లో ముడి చ‌మురు ధ‌ర‌లు పెర‌గడం కూడా మార్కెట్ల న‌ష్టాల‌కు కార‌ణ‌మైంది. మ‌ధ్య ప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ దేశాల మ‌ధ్య మ‌ళ్లీ యుద్ధ ఉద్రిక్త‌త‌లు పెరుగుతుండ‌డంతో చ‌మురు స‌ర‌ఫ‌రాకు ఆటంకం ఏర్ప‌డ‌వ‌చ్చ‌ని ఆందోళ‌న మొద‌లైంది. దీంతో చ‌మురు ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 0.11 శాతం పెరిగి బ్యారెల్‌కు 73 డాల‌ర్ల వ‌ద్ద నిల‌వ‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 0.11 శాతం పెరిగి బ్యారెల్‌కు 69 డాలర్ల వ‌ద్ద నిలిచింది. అలాగే ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి విలువ త‌గ్గ‌డం కూడా మార్కెట్ల న‌ష్టాల‌కు కార‌ణ‌మైంది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే భార‌త రూపాయి 94.54 వ‌ద్ద నిలిచింది. సెష‌న్‌లో భార‌త రూపాయి విలువ 15 పైస‌లు త‌గ్గింది.

ఆసియా మార్కెట్లు లాభాల్లోనే..

దేశీయ స్టాక్ మార్కెట్లు న‌ష్టాల్లో ఉన్నప్ప‌టికీ విదేశీ మార్కెట్లు మాత్రం స్వ‌ల్ప లాభాల్లో కొన‌సాగాయి. జ‌పాన్ నిక్కీ225 ఇండెక్స్ 0.23 శాతం మేర లాభ‌ప‌డింది. ద‌క్షిణ కొరియా కోస్పి సూచీ 0.20 శాతం మేర త‌గ్గగా, షాంగై కంపోజిట్ 1.16 శాతం మేర ఎగ‌బాకింది. హాంగ్ సెంగ్ ఇండెక్స్ 1.57 శాతం పెరిగింది. ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్‌200 సూచీ 0.68 శాతం లాభ‌ప‌డింది. ఇక దేశీయ స్టాక్ మార్కెట్‌ల‌లో ఆందోళ‌న‌ను సూచించే భ‌య సూచిక ఇండియా విక్స్ 3.93 శాతం మేర పెరిగి 13.56 వ‌ద్ద నిలిచింది. మ‌ధ్య‌ప్రాచ్యంలో మ‌ళ్లీ యుద్ధం మొద‌లైన నేప‌థ్యంలో ఈసారి యుద్ధం సుదీర్ఘంగా కొన‌సాగితే తీవ్ర ప‌రిణామాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని పెట్టుబ‌డిదారుల్లో ఆందోళ‌న మొద‌లైంది. అందుక‌నే అమ్మ‌కాల ఒత్తిడి పెరిగి సూచీలు న‌ష్టాల్లో ముగిశాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

Advertisement
Advertisement