త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | ట్రంప్ డీల్ ఎఫెక్ట్.. మార్కెట్లలో భారీ జోష్!

Stock Markets | అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం వార్తలతో సోమవారం భారత స్టాక్ మార్కెట్లు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. బెంచ్‌మార్క్ సూచీలు భారీ లాభాలతో ప్రారంభమవగా, ఉదయం 9:15 గంటలకు నిఫ్టీ 1.43 శాతం పెరిగి 23,960 వద్ద ట్రేడ్ అయింది. మరోవైపు సెన్సెక్స్ 1.52 శాతం ఎగబాకి 76,676 పాయింట్లకు చేరుకుంది.

S

Business | Published On Jun 15, 2026, 10.36 am IST

Stock Markets | ట్రంప్ డీల్ ఎఫెక్ట్.. మార్కెట్లలో భారీ జోష్!
Advertisement

Stock Markets | అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం వార్తలతో సోమవారం భారత స్టాక్ మార్కెట్లు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. బెంచ్‌మార్క్ సూచీలు భారీ లాభాలతో ప్రారంభమవగా, ఉదయం 9:15 గంటలకు నిఫ్టీ 1.43 శాతం పెరిగి 23,960 వద్ద ట్రేడ్ అయింది. మరోవైపు సెన్సెక్స్ 1.52 శాతం ఎగబాకి 76,676 పాయింట్లకు చేరుకుంది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడం, ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం వంటి అంశాలు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచాయి. సెక్టోరల్ సూచీల్లో ఫార్మా మినహా అన్ని రంగాలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ముఖ్యంగా రియాల్టీ, పీఎస్‌యూ బ్యాంక్, ఆటో సూచీలు దాదాపు 2 శాతం చొప్పున పెరిగాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు కూడా మంచి లాభాల‌ను నమోదు చేశాయి. బ్రాడర్ మార్కెట్లు కూడా బలంగా కనిపించాయి. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 సూచీ 1.63 శాతం పెరగగా, నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 సూచీ 1.46 శాతం లాభపడింది.

యుద్ధాన్ని ముగించేందుకు అంగీకారం..

అమెరికా, ఇరాన్ దేశాలు హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, వేలాది ప్రాణనష్టానికి, ప్రపంచ ఇంధన సరఫరాలకు అంతరాయం కలిగించిన యుద్ధాన్ని ముగించేందుకు ఒప్పందానికి వచ్చాయి. ఈ ఒప్పందంపై అధికారిక సంతకాలు చేయడానికి రెండు దేశాల ప్రతినిధులు జూన్ 19న స్విట్జర్లాండ్‌లో సమావేశం కానున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికలో స్పందిస్తూ, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌తో ఒప్పందం పూర్తైంద‌ని, హోర్ముజ్ జలసంధిని టోల్ ఫ్రీగా తెరవడానికి, అమెరికా నౌకాదళ దిగ్బంధాన్ని వెంటనే ఎత్తివేయడానికి అనుమతి ఇస్తున్నాన‌ని తెలిపారు. ప్రపంచ నౌకలన్నీ మళ్లీ ప్రయాణం ప్రారంభించ‌వ‌చ్చ‌ని, చమురు సరఫరాలు కొనసాగనివ్వండ‌ని పేర్కొన్నారు. అయితే ఒప్పందం సంతకాల తేదీపై ఇరాన్ ఇంకా అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు.

భారీగా త‌గ్గిన చ‌మురు ధ‌ర‌లు..

హోర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకోనున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పడిపోయాయి. జూలై డెలివరీకి సంబంధించిన డబ్ల్యూటీఐ క్రూడ్ ఫ్యూచర్స్ 4.77 శాతం క్షీణించి బ్యారెల్‌కు 80.83 డాలర్లకు చేరగా, ఆగస్టు డెలివరీకి సంబంధించిన బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ దాదాపు 4 శాతం తగ్గి 83.77 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యాయి. హోర్ముజ్ మార్గం ద్వారా ముడి చమురు రవాణా తిరిగి ప్రారంభం కావడం, అభివృద్ధి చెందిన దేశాలు అత్యవసర చమురు నిల్వలను విడుదల చేయడం, చైనా వంటి ప్రధాన దిగుమతిదారులు కొనుగోళ్లు తగ్గించడం వల్ల ధరలపై ప్ర‌భావం ప‌డింది. కాగా ఆసియా-పసిఫిక్ ప్రాంత మార్కెట్లు కూడా భారీ లాభాలతో ట్రేడ్ అయ్యాయి. దక్షిణ కొరియా కోస్పీ సూచీ 5.17 శాతం ఎగబాకి ప్రాంతీయ మార్కెట్లకు నాయకత్వం వహించింది. జపాన్ నిక్కీ 225 సూచీ 5.13 శాతం పెరగగా, టోపిక్స్ సూచీ 3.63 శాతం లాభపడింది. ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ 200 సూచీ 2.62 శాతం పెరిగింది.

బ‌ల‌ప‌డ్డ రూపాయి..

హాంకాంగ్ హాంగ్ సెంగ్ ఫ్యూచర్స్ 24,706 వద్ద ట్రేడ్ అవుతూ గత ముగింపు స్థాయి 24,718.10 కంటే స్వల్పంగా దిగువన నిల‌వ‌గా, అమెరికా ఫ్యూచర్స్ మార్కెట్లలో కూడా బలమైన కొనుగోళ్లు కనిపించాయి. డౌ జోన్స్ ఫ్యూచర్స్ 342 పాయింట్లు పెరగగా, ఎస్ అండ్ పీ 500 ఫ్యూచర్స్ 0.9 శాతం లాభపడ్డాయి. టెక్నాలజీ ఆధారిత నాస్‌డాక్ 100 ఫ్యూచర్స్ 1.4 శాతం ఎగబాకి అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాయి. ఇక ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి విలువ బ‌ల‌ప‌డింది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 53 పైస‌లు పెరిగిన 94.57 వ‌ద్ద నిలిచింది.

Advertisement
Advertisement