త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SEBI | సీఏఎస్‌కు సెబీ ఎండ్ కార్డ్‌..? మ‌ళ్లీ పాత విధాన‌మే..?

SEBI | డెరివేటివ్స్‌ ఎక్స్‌పైరీ రోజుల్లో చివరి నిమిషంలో ధరల్లో చోటుచేసుకునే భారీ హెచ్చుతగ్గులను తగ్గించేందుకు పాత సెటిల్‌మెంట్ విధానాన్ని తిరిగి తీసుకురావడంపై సెబీ పరిశీలన ప్రారంభించింది. మార్కెట్‌ నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా ప్రస్తుత క్లోజింగ్‌ ఆక్షన్‌ సెషన్‌ విధానాన్ని సమీక్షించనున్నట్లు సెబీ తెలిపింది.

S

Business | Published On Sep 7, 2026, 4.43 pm IST

SEBI | సీఏఎస్‌కు సెబీ ఎండ్ కార్డ్‌..? మ‌ళ్లీ పాత విధాన‌మే..?
Advertisement

SEBI | డెరివేటివ్స్‌ ఎక్స్‌పైరీ రోజుల్లో చివరి నిమిషంలో ధరల్లో చోటుచేసుకునే భారీ హెచ్చుతగ్గులను తగ్గించేందుకు పాత సెటిల్‌మెంట్ విధానాన్ని తిరిగి తీసుకురావడంపై సెబీ పరిశీలన ప్రారంభించింది. మార్కెట్‌ నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా ప్రస్తుత క్లోజింగ్‌ ఆక్షన్‌ సెషన్‌ విధానాన్ని సమీక్షించనున్నట్లు సెబీ తెలిపింది. అవసరమైతే గతంలో అమల్లో ఉన్న వాల్యూమ్‌ వెయిటెడ్‌ యావరేజ్‌ ప్రైస్‌ (వీడబ్ల్యూఏపీ) విధానాన్ని లేదా వీడబ్ల్యూఏపీ, క్లోజింగ్‌ ఆక్షన్‌ సెషన్‌ కలయికతో కూడిన హైబ్రిడ్‌ విధానాన్ని తీసుకురానుంద‌ని సమాచారం.

తగ్గిన ట్రేడింగ్ ప‌రిమాణం, విలువ‌..

ఆగస్టు 3 నుంచి అమల్లోకి వచ్చిన క్లోజింగ్‌ ఆక్షన్‌ సెషన్‌లో ట్రేడింగ్‌ పరిమాణం, విలువ గణనీయంగా తగ్గినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్బిట్రేజ్‌ ట్రేడర్లు, రిటైల్‌ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం తక్కువగా ఉండటంతో ఎక్స్‌పైరీ సమయంలో ధర నిర్ణయంపై ప్రభావం పడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుత విధానంలో తక్కువగా ట్రేడ్‌ అయ్యే స్టాక్స్‌కు ఆక్షన్‌లో ఏర్పడిన ధరల ఆధారంగా సెటిల్‌మెంట్‌ జరుగుతోంది. దీనివల్ల నిఫ్టీ, సెన్సెక్స్‌ వంటి సూచీలపై చివరి నిమిషంలో ధరల వక్రీకరణకు అవకాశం ఉంటుందని మార్కెట్‌ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పాత వీడబ్ల్యూఏపీ విధానాన్ని తీసుకొస్తే ఈ ధరల వక్రీకరణను తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఈ అంశంపై సెబీ వారంలోగా కన్సల్టేషన్‌ పేపర్‌ విడుదల చేసే అవకాశం ఉంది. సెప్టెంబర్‌ 24న జరిగే సెబీ బోర్డు సమావేశంలో దీనిపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Advertisement
Advertisement